ప్రతిరోజూ వ్యాయామం చేస్తే మీ జీవితంలో ఏర్పడే ఒత్తిడి సంఘటనలను తేలికగా ఎదుర్కొంటారు. జీవితం ఒత్తిడి తెచ్చే ఎన్నో సంఘటనలతో కూడుకొని వుంటుంది. కనుక సులభమైన వ్యాయామాల ద్వారా అధిక ఒత్తిడి ఎలా నియంత్రించుకోవాలో పరిశీలించండి. శారీరక వ్యాయామం – ఒత్తిడి ఆందోళన తగ్గాలంటే, ఏదో ఒక శారీరక చర్యలలో పాల్గొనండి. అది నడక లేదా వర్కవుట్ కావచ్చు. కొంతసేపు చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. స్విమ్మింగ్ లేదా మీ కిష్టమైన ఆటలాడటం చేస్తే బోర్ అనిపించకుండా వుంటుంది. శారీరక కదలిక కండరాలను వేడెక్కించి మైండ్ ను రిలాక్స్ చేస్తాయి. అయితే, ఇది అతిగా చేస్తే శరీరం నొప్పులు పెడుతుంది. గాఢ శ్వాసలు తీయడం – గాఢ శ్వాసలు తీస్తే శరీరం విశ్రాంతి పొంది ప్రశాంతత పొందుతుంది. ఒత్తిడి హార్మోన్లు తొలగుతాయి. మీ పొట్టపై ధ్యాస పెట్టండి ఛాతీ కంటే కూడా పొట్ట బాగా కదలాలి. ఇది విశ్రాంతి పొందేందుకు మంచి టెక్నిక్.
యోగాభ్యాసం – ఒత్తిడికి గాఢ శ్వాస లేదా ఏకాగ్రత వంటివి ఎంతో మేలు చేస్తాయి. శరీరం విశ్రాంతి పొందుతుంది. శరీర భంగిమలపై ధ్యాస పెట్టండి. మెత్తటి మ్యూజిక్ లేదా డిమ్ లైట్ వంటివి యోగా సమయంలో మరింత హాయినిస్తాయి. ఇవి వ్యాయామాలు కాకపోయినప్పటికి మనస్సును ప్రశాంత పరుస్తాయి. కనుక ఆచరించవచ్చు.
కండరాల విశ్రాంతి – వివిధ యోగా ఇతర భంగిమలు ఆచరించటం వలన కండరాలు విశ్రాంతిని పొంది ఒత్తిడి తగ్గుతుంది. మీ కండరాలలో ఆందోళన సమసిపోతుంది. కండరాలు సడలి విశ్రాంతి పొందుతారు.
జాగింగ్, స్విమ్మింగ్, సైకిలింగ్, డేన్సింగ్ వంటివి కూడా ఒత్తిడిని తగ్గించే ఉపయాలే. మైండ్ ప్రశాంతంగా పెట్టుకుంటూ శరీర కదలికలపై దృష్టి పెడితే శరీరానికి అలసట తగ్గి మనస్సు ప్రశాంతమవుతుంది. నేటి రోజులలో ఒత్తిడి సర్వ సాధారణమైంది. కనుక ఈ సులభతర టెక్నిక్ లు ఆచరించి ఆరోగ్య ప్రయోజనం పొందండి.