బీర్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు కలుగుతాయని శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. కొన్ని ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చని వారు తమ నివేదికలో వెల్లడించారు. అలాగని ఎక్కువ లాగించేయకూడదు సుమీ.. పరిమితంగా తీసుకోవాలి. మహిళలు వారానికి రెండు బీర్లు తీసుకుంటే.. గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చాలా సర్వేల్లో తేలింది.
పురుషులు పరిమితంగా బీర్లు తీసుకుంటే.. మూత్రపిండాల్లో రాళ్లు పడే ప్రమాదం తగ్గుతుందని తెలిసింది. బీర్లలో సిలికాన్ సమృద్ధిగా ఉంటుంది. అది ఎముకల సాంధ్రతను పెంచడంతోపాటు అవి చాలా బలంగా ఉండేలా చేస్తుంది. రెగ్యులర్‌గా బీర్ తీసుకునే 27 వేలమందిపై పరిశోధనలు చేయగా.. కిడ్నీ సమస్యలు తగ్గుతాయని తాజా సర్వేలో నిరూపితమైంది. అలాగే.. గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చునని తెలిసింది. బీర్ తాగేవారిలో రక్తప్రసరణ జరుగుతుందని, దాంతో గుండెపోటు సమస్య రాదని తేలింది.
బీర్లు తీసుకుంటే.. టైప్-2 డయాబెటిస్ వ్యాధి 25 శాతం వరకు తగ్గుతుంది. అల్జీమర్స్ రాకుండా చేయడంతోపాటు మంచి కొలెస్టిరాల్‌ని పెంచడంలో బీర్లు కీలకపాత్ర పోషిస్తాయి. మెదడుకు రక్తప్రసరణ బాగా చేయడంలో బీర్లు దోహదపడతాయి. దీంతో.. మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. వారానికి రెండు, మూడు సార్లు తీసుకుంటే.. కొన్ని రకాల క్యాన్సర్ కారకాలు మన దరికి చేరవు. దృష్టి లోపాల్ని సవరించడంలో బీర్ ప్రముఖపాత్ర పోషిస్తుంది. అయితే అతి అన్నింటికీ ప్రమాదకరమే… కాబట్టి లిమిట్ లో ఉంటేనే ఆరోగ్యమైనా.. ఆనందమైనా!!