మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఎన్నోరకాల పండ్లను తింటుంటాం. కొన్ని పండ్లు ఆయా సీజన్‌లోనే మాత్రమే దొరుకుతాయి. కానీ అన్ని సీజన్‌లలో దొరికేపండు అరటిపండు. అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. చిన్నవారి నుండి పెద్ద వారికి నచ్చిన పండు. అరటిపండు సులువుగా జీర్ణమవుతుంది. అరటిపండులో చాలా రకాలున్నాయి. అరటిపండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేలు చేస్తుంది. అరటిపండుతో కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం. అరటి పండులోని పొటాషియం మూత్ర పిండవ్యాధి గల వారికి ప్రమాదం ఎక్కువ చేస్తుంది. ప్రతిరోజూ రాత్రిపూట అరటిపండును తినటంవల్ల మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులో పుండ్లకు అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది.
అరటిపండులో ఎక్కువగా ఐరన్ ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుండి విముక్తి కలుగుతుంది. ఉదయం అరటిపండును తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అరటిపండులో ఎక్కువగా పీచు పదార్థం వుండటం వల్ల మలబద్దకాన్ని లేకుండా చేస్తుంది. గుండెలో మంటకీ ఈ పండు మంచి మందుగా పనిచేస్తుంది.
అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె కలిపి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. సన్నగా ఉన్నవారు అరటిపండు తింటే బరువు పెరుగుతారు. జుట్టు రాలే సమస్య ఉన్నవారు అరటిపండు గుజ్జుతో పెరుగుని కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకుంటే జుట్టు రాలే సమస్య నుండి విముక్తి కలుగుతుంది.