Health Tips : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్లను వాడుతూ సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా డాక్టర్‌ను కలవకుండానే నేరుగా మెడికల్ షాపుకు వెళ్లి అక్కడ మందులను అడిగి కొని తెచ్చి వాటిని వేసుకుంటున్నారు. దీంతో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్నారు. అయితే ఎలాంటి మందులు వాడకుండానే శరీరంలో కొన్ని భాగాల్లో కొన్ని సెకన్ల పాటు ఒత్తిడిని కలిగించడం ద్వారా పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. దాన్నే రిఫ్లెక్సాలజీ అంటారు. దీని ప్రకారం చిన్నపాటి అనారోగ్య సమస్యలను కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు మెడిసిన్లను వాడాల్సిన పనిలేదు. మరి మనకు వచ్చే ఎలాంటి అనారోగ్య సమస్యలను రిఫ్లెక్సాలజీ ద్వారా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. తలనొప్పి వచ్చిందంటే చాలు, దాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది మెడిసిన్‌ను వేసుకుంటారు. అయితే ఆ పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిఫ్లెక్సాలజీ ద్వారా తలనొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. ముక్కు పైభాగంలో కనుబొమ్మల మధ్యలో 30 సెకన్ల పాటు వేలితో ఒత్తిడిని కలిగించండి. తరువాత 5 సార్లు దీన్ని రిపీట్ చేయండి. ఇలా చేస్తే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది.
2. ముక్కు దిబ్బడకు కూడా రిఫ్లెక్సాలజీ పనిచేస్తుంది. ఇందుకు గాను ముక్కుకు ఇరువైపులా చూపుడు వేలితో టచ్ చేయాలి. అక్కడ చెంపకు సంబంధించిన ఎముక ఉంటుంది. దాని దగ్గర చూపుడు వేలితో 30 సెకన్ల పాటు ప్రెస్ చేయాలి. అలాగే రెండో పక్కన కూడా చేయాలి. ఇదే స్టెప్‌ను 5 సార్లు రిపీట్ చేయాలి. దీంతో ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. తీవ్రంగా అలసట ఉన్నవారు ముక్కు మధ్య భాగంలో పెదవుల మీద 30 సెకన్ల పాటు ఒత్తిడిని కలిగించాలి. దీన్ని 5 సార్లు చేయాలి. అలసట ఇట్టే తగ్గిపోతుంది. అలాగే కుడిచేతి బొటన వేలు, చూపుడు వేలు మధ్య కూడా ప్రెస్ చేయవచ్చు. దీంతో కూడా అలసట తగ్గి ఉత్సాహం వస్తుంది.
4. వెన్ను నొప్పి ఉన్నవారు ఎడమ అరచేతి మధ్య భాగం లేదా కుడి మోచేతికి కొద్దిగా పైభాగంలో ఉన్న పాయింట్ వద్ద ఒత్తిడిని కలిగించాలి. దీంతో నొప్పి తగ్గుతుంది.
5. చెవి తమ్మెల పక్కన కొద్దిగా పైభాగంలో.. లేదా చెవి మధ్య భాగం పక్కన కొంత సేపు ఒత్తిడిని కలిగించడం ద్వారా దంతాల నొప్పి నుంచి బయట పడవచ్చు.
6. వికారంగా ఉన్నవారు ఎడమ చేతి మణికట్టు మీద ఒత్తిడిని కలిగించడం ద్వారా ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. గుండె మరీ వేగంగా కొట్టుకుంటున్న వారు కుడి అరచేతి మధ్య భాగంలో ఒత్తిడిని కలిగించాలి. అదే గుండె వేగం తక్కువగా ఉంటే ఎడమ అరచేతిలో అలా చేయాలి.
8. ముక్కు మధ్య భాగంలో పెదవుల మీద ఒత్తిడిని కలిగించడం ద్వారా అధిక బరువు తగ్గవచ్చు. దీన్ని రోజూ 5 నిమిషాల పాటు చేయాల్సి ఉంటుంది.
9. ఎడమ అరచేతి మణికట్టుకు కుడివైపున ఒత్తిడిని కలిగించడం ద్వారా నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. దీన్ని రాత్రి పూట 2 నుంచి 3 నిమిషాల పాటు చేయాలి.
ఈ విధంగా రిఫ్లెక్సాలజీని ఉపయోగించి పలు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు.