Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆయుర్వేద ఔష‌ధాలు

అనేక వ్యాధులను తగ్గించే తగ్గించే త్రికటు చూర్ణం.. తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి..!

Admin by Admin
August 5, 2021
in ఆయుర్వేద ఔష‌ధాలు, ఆరోగ్యం
Share on FacebookShare on Twitter

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆయుర్వేద ఔషధాల్లో త్రికటు చూర్ణం ఒకటి. శొంఠి, పిప్పళ్లు, మిరియాలను చూర్ణం చేసి సమపాళ్లలో కలిపి త్రికటు చూర్ణాన్ని తయారు చేస్తారు. ఈ చూర్ణంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అనేక వ్యాధులు తగ్గుతాయి. దీన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాలి. దీంతో ఏమేం అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

how to use trikatu churnam for many health problems

1. త్రికటు చూర్ణం మూడు భాగాలు, ఒక భాగం వాము, యాలకులు, ఉప్పు, నేతిలో వేయించిన ఇంగువ చూర్ణం తీసుకుని అన్నింటినీ కలపాలి. అందులో కాసీ భస్మం కలపాలి. తగినంత నిమ్మరసం పోసి ఎండలో ఎండబెట్టాలి. తరువాత చూర్ణం చేసి ఉదయం, సాయంత్రం ఒక టీస్పూన్‌ చొప్పున సేవించాలి. కడుపునొప్పి, అగ్ని మాంద్యం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

2. త్రికటు చూర్ణం, త్రిఫల చూర్ణం, తగినంత సైంధవ లవణం కలిపి రోజుకు రెండు సార్లు అరటీస్పూన్‌ చొప్పున తీసుకోవాలి. పొడిదగ్గు, కళ్లె దగ్గు, జలుబు తగ్గుతాయి.

3. త్రికటు చూర్ణం మూడు భాగాలు, వాము, సైంధవ లవణం, జీలకర్ర, నేతిలో వేయించిన ఇంగువ చూర్ణాలను ఒక్కొక్క భాగం వంతున కలిపి భోజనం మొదటి ముద్దలో కలిపి తింటుండాలి. కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, త్రేన్పులు, విరేచనాలు తగ్గుతాయి.

4. రోజుకు ఒకసారి అరగ్లాస్‌ వేడి నీటిలో ముప్పాతిక స్పూన్‌ త్రికటు చూర్ణం, పావు స్పూన్‌ జీలకర్ర చూర్ణం, ఒక టీస్పూన్‌ ఉప్పు కలిపి తగినంత నిమ్మరసం కలిపి తాగుతుంటే కడుపు నొప్పి, నడుం నొప్పి, ఒళ్లు నొప్పులు, మలబద్దకం, అగ్ని మాంద్యం, అజీర్ణం, అరుచి, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.

5. రెండు గరువింద గింజల ఎత్తు త్రికటు చూర్ణాన్ని పరిశుభ్రమైన నీటిలో కలిపి వడగట్టి నాలుగైదు చుక్కల వంతున ముక్కు రంధ్రాల్లో వేసుకుంటుంటే జలుబు, ముక్కు దిబ్బడ, తలబరువు, సైనస్, కంటి సమస్యలు తగ్గుతాయి.

6. ఒక భాగం జాజికాయ, లవంగాల చూర్ణాలను, మూడు భాగాల త్రికటుచూర్ణం, త్రిఫల చూర్ణాలకు కలిపి ఇందులో శుద్ధ లోహ భస్మాన్ని తొమ్మిది భాగాలు కలిపి ఉంచుకుని, ఐదారు చిటికెల వంతున రోజుకు రెండు సార్లు తేనెతో కలిపి తీసుకుంటే రక్తవృద్ధి జరుగుతుంది.

Tags: trikatu churnamత్రికటుచూర్ణం
Previous Post

బిస్కెట్ల‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా ? ఏమైనా ప్ర‌భావం ఉంటుందా ?

Next Post

లవంగాలు పురుషులకు ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసా ? ఏ సమయంలో తీసుకోవాలంటే..?

Related Posts

ఆరోగ్యం

Daily One Carrot : ఈ 10 కార‌ణాలు తెలిస్తే క్యారెట్ల‌ను రోజూ తింటారు..!

December 14, 2023
ఆయుర్వేద ఔష‌ధాలు

Triphala Churnam : స‌కల రోగాల‌ను హ‌రించే అద్భుత‌మైన ఔష‌ధం.. త్రిఫ‌ల చూర్ణం..!

May 13, 2022
ఆరోగ్యం

అధిక బ‌రువు నుంచి గ్యాస్ స‌మ‌స్య‌ వ‌ర‌కు వీటితో చెక్ పెట్టండి..!

December 17, 2021
ఆరోగ్యం

వారంలో మూడు సార్లు దీన్ని తాగండి.. లివ‌ర్ క్లీన్ అవుతుంది.. వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి..!

December 17, 2021
Featured

బెల్లం తినే స‌రైన ప‌ద్ధ‌తి ఏదో తెలుసా ? చాలా మందికి తెలియ‌దు.. ఈ విధంగా బెల్లాన్ని తింటే అద్భుతాలు జ‌రుగుతాయి..!

November 7, 2021
muscle pains

కండరాల నొప్పులను తగ్గించుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

September 25, 2021

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.