మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. రెండోది మంచి కొలెస్ట్రాల్. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. అయితే మనం తినే ఆహారాలు, పాటించే జీవన విధానం వల్ల మన శరీరంలో ఎల్‌డీఎల్ స్థాయిలు రోజూ పెరుగుతుంటాయి. దీన్ని తగ్గించాలంటే హెచ్‌డీఎల్ కావాలి. అందుకు గాను రోజూ పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీంతో ఎల్‌డీఎల్‌ను తగ్గించుకోవచ్చు. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
అయితే శరీరంలో ఎల్‌డీఎల్ స్థాయిల మరీ ఎక్కువగా ఉన్నవారు కింద తెలిపిన ఆయుర్వేద ఔషధాలను ఉపయోగించవచ్చు. దీంతో ఎల్‌డీఎల్ స్థాయిలు త్వరగా తగ్గుతాయి. మరి ఆ ఔషధాలు ఏమిటంటే..
1. శరీరంలోని ఎల్‌డీఎల్‌ను తగ్గించడంలో గుగ్గులు బాగా ఉపయోగపడతాయి. ఇవి మనకు ఆయుర్వేద మందుల షాపుల్లో లభిస్తాయి. వీటిని కొనుగోలు చేసి వాడాల్సి ఉంటుంది. డాక్టర్ సూచన మేరకు లేదా ప్యాక్‌పై సూచించిన విధంగా వీటిని వాడవచ్చు. దీంతో ఎల్‌డీఎల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.
2. ఎల్‌డీఎల్‌ను తగ్గించి హెచ్‌డీఎల్‌ను పెంచేందుకు అర్జున ట్యాబ్లెట్లు కూడా పనిచేస్తాయి. ఈ మూలికకు చెందిన ట్యాబ్లెట్లను కూడా ఆయుర్వేద మందుల షాపుల్లో కొనవచ్చు. ప్యాక్‌పై సూచించిన విధంగా వాడవచ్చు. ఈ మూలిక ఎల్‌డీఎల్‌ను తగ్గించి హెచ్‌డీఎల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
3. ఆయుర్వేదంలో శిలాజిత్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఆయుర్వేద మందుల షాపుల్లో శిలాజిత్ ట్యాబ్లెట్లు లభిస్తాయి. వీటిని కూడా వాడుకోవచ్చు.
4. వృక్షమాల అనే మూలిక కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గించడంతోపాటు బరువును నియంత్రణలో ఉంచుతుంది. అందువల్ల దీన్ని కూడా వాడవచ్చు.
ఇక ఇవే కాకుండా రోజూ ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను పరగడుపునే పచ్చిగా అలాగే తినేయాలి. అలాగే రోజుకు రెండు సార్లు భోజనానికి ముందు 30 ఎంఎల్ ఉసిరికాయ జ్యూస్ ను తాగాలి. ఈ విధంగా చేయడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె పదిలంగా ఉంటుంది.