business ideas

Business Idea : పెట్టుబ‌డి త‌క్కువ.. శ్ర‌మ ప‌డాల్సిన ప‌నిలేదు.. నెల నెలా చ‌క్క‌ని సంపాదన పొంద‌వ‌చ్చు..!

Business Idea : విందు, వినోదం.. ఇత‌ర కార్య‌క్ర‌మాలు.. ఏవైనా స‌రే.. ఒక‌ప్పుడు ప్లాస్టిక్ ప్లేట్ల‌లో భోజ‌నాలు పెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. పేప‌ర్ ప్లేట్ల‌నే ఎక్కువ‌గా ఉపయోగిస్తున్నారు. తక్కువ ఖ‌రీదుతో.. యూజ్ అండ్ త్రో సౌక‌ర్యం ఉంటుంది క‌నుక‌.. చాలా మంది భోజ‌నాల‌కు వీటినే వాడుతున్నారు. ఇక పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేసే వ్యాపారులు ఎక్కువ‌య్యారు. ఈ క్ర‌మంలోనే నిరుద్యోగులు, మ‌హిళ‌లు.. ఈ బిజినెస్ ద్వారా నెల‌కు రూ.వేల‌ల్లో సంపాదించ‌వ‌చ్చు. ఈ బిజినెస్ వారికి చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి అవుతుంది. మరి ఇందుకు ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో.. ఎంత వ‌ర‌కు సంపాదించ‌వ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

పేప‌ర్ ప్లేట్ల త‌యారీ బిజినెస్‌కు పెద్ద‌గా స్థ‌లం అవ‌స‌రం లేదు. ఇండ్ల‌లోనే ఈ మెషిన్ల‌ను పెట్టుకోవచ్చు. స్థ‌లం లేని వారు చిన్న‌పాటి షెడ్ల‌ను లీజుకు తీసుకుని వాటిల్లో ఈ బిజినెస్ ప్రారంభించ‌వ‌చ్చు. ఇందుకు గాను సింగిల్ ఫేజ్ క‌రెంట్ స‌రిపోతుంది. అలాగే పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేసే మెషిన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి మార్కెట్‌లో రూ.60వేల ప్రారంభ ధ‌రకు ల‌భిస్తున్నాయి. సింగిల్ హైడ్రాలిక్ పేప‌ర్ ప్లేట్ మెషిన్ ధ‌ర రూ.60వేలు ఉంటుంది. డ‌బుల్ హైడ్రాలిక్ మెషిన్ ధ‌ర రూ.1.20 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. వీటిని మార్కెట్‌లో కొనుగోలు చేయాలి. అనంతరం పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేసేందుకు అవ‌స‌రం అయ్యే ముడి స‌రుకును కొనాలి. గ్రీన్‌, సిల్వ‌ర్ త‌దిత‌ర రంగుల్లో ఉండే చ‌తుర‌స్రాకార షీట్ల‌ను ముందుగా రెడీ చేసుకోవాలి. ఆ త‌రువాత పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు.

paper plates business you can earn good income

హైడ్రాలిక్ మెషిన్‌లో హెడ్ కింద స‌ద‌రు చ‌తుర‌స్రాకార షీట్‌ను ఉంచితే.. మెషిన్ దాన్ని రౌండ్‌గా క‌ట్ చేసి.. అదే స‌మ‌యంలో దాన్ని ప్లేట్‌లా మార్చుతుంది. ఇలా సింగిల్ హైడ్రాలిక్ మెషిన్ ద్వారా రోజుకు 5వేలు, డబుల్ హైడ్రాలిక్ మెషిన్ ద్వారా రోజుకు 8వేల వ‌ర‌కు బ‌ఫెట్ పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఇక ఒక్కోప్లేటును మార్కెట్‌లో 20పైస‌ల ధ‌ర‌కు హోల్‌సేల్‌గా విక్ర‌యించవ‌చ్చు. దీంతో 5వేల ప్లేట్ల‌కు రోజుకు రూ.1వేయి, 8వేల ప్లేట్ల‌కు రోజుకు రూ.1600 వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంది. అందులో ఖ‌ర్చులు పోను రోజుకు రూ.800 నుంచి రూ.1400 వ‌ర‌కు మిగులుతుంది. ఈ క్ర‌మంలో నెల‌కు రూ.24వేల నుంచి రూ.42వేల వ‌ర‌కు సంపాదించ‌వ‌చ్చు.

అయితే పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేయ‌డంతోనే స‌రిపోదు.. వాటిని మార్కెటింగ్ చేసి విక్ర‌యించాల్సి ఉంటుంది. ఆ ఒక్క అంశంలో శ్ర‌మిస్తే.. నెల‌కు రూ.వేల‌ల్లో సంపాదించుకోవ‌చ్చు. దీనికి పెద్ద‌గా ఎలాంటి కోర్సు నేర్చుకోవాల్సిని ప‌నిలేదు. అలాగే పెద్ద‌గా మ్యాన్‌ప‌వ‌ర్ కూడా అవ‌స‌రం ఉండ‌దు. ఇక పేప‌ర్ ప్లేట్ల‌ను త‌యారు చేయ‌గా వ‌చ్చే షీట్ల స్క్రాప్‌ను కేజీకి రూ.2 చొప్పున విక్ర‌యిస్తే.. అందులోనూ లాభం వ‌స్తుంది. ఈ క్ర‌మంలో పేప‌ర్ ప్లేట్ల త‌యారీ బిజినెస్ ఔత్సాహికుల‌కు చ‌క్క‌ని ఆదాయ వ‌న‌రు అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు..!

Admin

Recent Posts