మార్వాడీస్ ఎక్కువగా లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ పైన ఫోకస్ చేసి చూస్తారు. ఉదాహరణకు ఎలక్ట్రికల్ షాప్స్, పెయింట్ షాప్స్, ప్లై వుడ్ బిజినెస్, స్వీట్ షాప్స్ లాంటివాటి మీద వారి పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. మార్వాడిలు చేసే మొట్ట మొదటి పని ఎక్కడైతే ఊరిలో కాంపిటీషన్ తక్కువగా ఉంటుందో అక్కడ షాప్ లు ఓపెన్ చేయడం. ఒక్క మార్వాడి కూడా ఇంతవరకు కాంపిటీషన్ లో దెబ్బ తిన్నట్టు ఉండదు ఎందుకంటే వారంతా ఒకేలాగా మార్కెట్ కు అనుగుణంగా అడుగులేస్తూ ఉంటారు. చిన్న పనులు చేయడానికి కూడా సిగ్గు పడకపోవడం వారు కిరానా సామాను పెట్టుకున్నా స్వయంగా ఇంటింటికి డెలివరీ చేయాల్సి వచ్చినా ఎక్కడ భేషజాలకు పోకుండా ఆ పని చేస్తారు దానికోసం వారు ఇంత తక్కువ పని చేస్తున్నాం అని ఫీల్ అవ్వరు.
ఒక కస్టమర్ తో మాట మంతీ కలపాలంటే మార్వాడీలు తర్వాతే ఎవరైనా దీనితో ఆ పరిసరాల్లో ఉన్న పరిస్థితులు భాష చాలా త్వరగా నేర్చేసుకుంటారు. ఎంత ఆ ఊరిలో వ్యాపారం చేసిన వారు అక్కడ అప్పు చేయరు అలాగే ఆ ఊరిలో ఉన్నా సరే కస్టమర్ కి అప్పు ఇవ్వరు. కస్టమర్ కి తన మార్కెట్ గురించి అసలు తెలియనీయకుండా జాగ్రత్తగా ఉండడం ఇలా చేయడం వల్ల వ్యాపారం అభివృద్ధి చేసుకుంటారు. ఉదాహరణకు ఇంటికి అవసరమైన ఒక సర్క్యూట్ బాక్స్ కంపెనీ లో మ్యానుఫ్యాక్చర్ ఐతే దాని ఖరీదు 40 రూపాయలు ఎక్స్‌పోర్ట్ చేసినందుకు ఒక పది రూపాయలు అంత వెరసి ఒక బాక్స్ మీద నికరంగా 50 రూపాయలు అనుకుందాం. మనం డైరెక్టుగా కంపెనీ దగ్గరకు వెళ్లి ఆ వస్తువును కొనలేం వీళ్ళు బల్క్లో ఈ సరుకు కొనుగోలు చేయడంతో ఒక్క బాక్స్ మీద 5 రూపాయలు తగ్గుతుంది. ఇక చీప్ ఎక్స్పోర్ట్ మీద ఇంకొక 5 రూపాయలు ఇన్ని వెరసి అసలు 40 రూపాయలే కానీ ఈ మార్వాడి సేల్స్ మార్జిన్ చూపించి 2000 బాక్స్ లు కొంటారు.
అలా కొన్నాక వీళ్ళు ఒక్క బాక్స్ ని 150 రూపాయలకు తక్కువగా అమ్మరు, అలా వీళ్ళు అనుసరించే టెక్నిక్స్ చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఎలక్ట్రిక్ వైరింగ్ ఇంకా మోటార్ రిపేర్ వర్కర్ తో కలవడం మీరు ఒక మెకానిక్ ని పిలవడం వల్ల అతడు మీకు ఇంటికి కావలిసిన సామాను అంతా ఒక షాప్ లో కొనడానికి పిల్చుకెళ్తాడు. అలా వెళ్ళాక అక్కడ టోటల్ బిల్ మీద మీకు 20% తగ్గిస్తాడు. అలా చేయడం వల్ల మీకు తక్కువవుతుందనే ఒక భ్రమ చేస్తారు, కానీ అక్కడ మీరు చేసిన బిల్ మీద ఉన్న 20% ఆ రిపేర్ వాడికి అందిస్తాడు ఇందువల్ల కస్టమర్ ఇంకోసారి షాప్ కి వస్తాడు. ఆ రిపేర్ వ్యక్తి ఇతని దగ్గరే సరుకు తీసుకుంటాడు. ఇక్కడ సేల్స్ పెరుగుతాయి. ఇందువల్ల అదనంగా కంపెనీ నుంచి బోనస్ వల్ల మార్జిన్ పెంచినందుకు తద్వారా ఈసారి వచ్చే సరుకు పైన ఇంకా కమిషన్ ఎక్కువగా వస్తుంది.ఇది వాళ్ల స్ట్రాటజీ.