Banana Chips Business : ఎవరైనా సరే ఆర్థికంగా ప్రగతి సాధించాలంటే అందుకు స్వయం ఉపాధి మార్గాలు ఉత్తమం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అలాంటి వారి కోసం అనేక వ్యాపార ఐడియాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అరటి పండు చిప్స్ ను తయారు చేసి విక్రయించడం కూడా ఒకటి. అరటి పండు చిప్స్ ను తయారు చేసి అమ్మడం వల్ల రోజుకు దాదాపుగా రూ.4వేలు సంపాదించవచ్చు. అంటే నెలకు సుమారుగా రూ.1.20 లక్షలు వస్తాయన్నమాట. ఇది కార్పొరేట్ స్థాయి ఉద్యోగంతో సమానం. ఈ క్రమంలోనే ఈ ఉపాధిని లాభసాటి వ్యాపారంగా కూడా మార్చుకోవచ్చు.
ఆలు చిప్స్ లాగే అరటి పండు చిప్స్ కూడా రుచిగా ఉంటాయి. అయితే ఆలు చిప్స్ వల్ల కొవ్వు బాగా పెరుగుతుంది. కానీ అరటి పండు చిప్స్‌తో అలా కాదు. అందువల్లే చాలా మంది ఆలు చిప్స్‌కు బదులుగా అరటి పండు చిప్స్‌ను తింటున్నారు.మార్కెట్‌లో అరటి పండు చిప్స్‌ను తయారు చేసి విక్రయించే వారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారని చెప్పవచ్చు. కానీ వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. అందువల్ల వీటిని తయారు చేసి విక్రయిస్తే లాభాలు గడించవచ్చు. అరటి పండు చిప్స్ తయారీలో పచ్చి అరటి పండ్లను, వంట నూనె, ఇతర మసాలా దినుసులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే యంత్రాలు కూడా అవసరం అవుతాయి.
50కేజీల అరటి పండు చిప్స్‌ను తయారు చేసేందుకు 120 కేజీల పచ్చి అరటి పండ్లు అవసరం అవుతాయి. 120 కేజీల పచ్చి అరటి పండ్ల కొనుగోలుకు రూ.1000 అవుతాయి. అలాగే 12 నుంచి 15 లీటర్ల వరకు నూనె అవుతుంది. 15 లీటర్ల నూనెకు సుమారుగా రూ.1050 ఖర్చవుతుంది. లీటర్ నూనె రూ.70 అనుకుంటే ఆ ధర అవుతుంది.
చిప్స్ తయారీకి ఉపయోగించే ఫ్రయర్ మెషిన్ 1 గంటకు 11 లీటర్ల వరకు డీజిల్‌ను ఖర్చు చేస్తుంది. 1 లీటర్ డీజిల్‌కు రూ.80 అనుకుంటే మొత్తం రూ.900 ఖర్చు అవుతుంది. ఉప్పు, మసాలా దినుసులకు రూ.150 అవుతుంది. దీంతో 50కేజీల అరటి పండు చిప్స్ తయారీకి దాదాపుగా రూ.3200 ఖర్చు అవుతుంది. ఇక 1 కిలో చిప్స్ ప్యాక్ కు రూ.70 ఖర్చు అవుతుంది. ఒక్క కిలో ప్యాక్‌ను ఆన్‌లైన్ లేదా కిరాణా స్టోర్స్‌కు రూ.90 – రూ.100 కు విక్రయించవచ్చు. అంటే కిలో మీద కనీసం రూ.20 లాభం వేసుకున్నా 50 కేజీలకు 50 * 20 = రూ.1000 వస్తాయి. రోజుకు సుమారుగా 200 కేజీల చిప్స్‌ను తయారు చేసి విక్రయిస్తే 200 * 20 = రూ.4000 వస్తాయి. నెల రోజులకు ఈ విధంగా 30 * 4000 = రూ.1,20,000 వస్తాయి. దీన్ని ఇలా లాభసాటిగా మార్చుకోవచ్చు. అయితే మార్కెటింగ్ పైన ఎక్కువగా దృష్టి సారిస్తే ఇంకా ఎక్కుగానే లాభాలను పొందేందుకు వీలుంటుంది.