printed t-shirt business : నెలనెలా రూ.30వేల నుంచి రూ.40వేల వరకు ఆదాయం పొందాలని చూస్తున్నారా ? స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని అనుకుంటున్నారా ? అయితే ఈ వ్యాపారం మీ కోసమే. ఇందులో రూ.50వేలు పెట్టుబడి పెడితే చాలు. దాంతో నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ వ్యాపారం ఏమిటి ? అంటే…
ప్రస్తుత తరుణంలో ప్రింటెడ్ టి-షర్టులకు మంచి గిరాకీ ఉంది. యూత్ ఎక్కువగా ఈ తరహా టి-షర్ట్‌లను ధరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే స్కూళ్లు, కాలేజీలు, కంపెనీలు, ఇనిస్టిట్యూట్స్, రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు తమ సంస్థలకు చెందిన లేదా అవి చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన ప్రింటెడ్ టి-షర్ట్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. అందువల్ల ఈ బిజినెస్‌కు చక్కని డిమాండ్ ఉందని చెప్పవచ్చు. సరిగ్గా మార్కెటింగ్ చేయగలిగితే నెల నెలా స్థిరమైన ఆదాయం కూడా పొందవచ్చు.
ప్రింటెడ్ టి-షర్ట్ బిజినెస్ పెట్టేందుకు మెషిన్ అవసరం అవుతుంది. దాని ఖరీదు సుమారుగా రూ.50వేల వరకు ఉంటుంది. అందులో నిమిషానికి ఒక టి-షర్ట్‌ను ప్రింట్ చేయవచ్చు. ఇక ఒక్క తెలుపు రంగు టి-షర్ట్ ధర సుమారుగా రూ.120 ఉంటుంది. దానిపై ప్రింటింగ్‌కు రూ.1 నుంచి రూ.10 ఖర్చవుతుంది. ఈ క్రమంలో ఒక్క టి-షర్ట్‌ను రూ.250 నుంచి రూ.300కు విక్రయించవచ్చు. దీంతో కనీసం ఎంత లేదాన్నా 50 శాతం లాభం వస్తుంది.
ఇలా ఈ టి-షర్ట్‌లను ప్రింట్ చేసి అమ్ముతూ నెల నెలా రూ.వేలల్లో ఆదాయం పొందవచ్చు. అయితే వ్యాపారం వృద్ధి చెందితే నెల నెలా రూ.లక్షల్లో కూడా దీని ద్వారా డబ్బులను సంపాదించవచ్చు. ఇక ఈ టి-షర్ట్‌లను ఆన్‌లైన్‌లో కూడా విక్రయించవచ్చు. సొంతంగా ఏదైనా బ్రాండ్‌ను క్రియేట్ చేసి దాని పేరిట ఈ టి-షర్ట్‌లను అమ్మితే బ్రాండ్‌కు మంచి పేరు వస్తుంది. దీంతో బ్రాండ్ పాపులారిటీ ద్వారా కూడా మార్కెట్‌లో నిలదొక్కుకోవచ్చు. సుస్థిరమైన ఆదాయం రావాలంటే మార్కెటింగ్ సరిగ్గా చేయాల్సి ఉంటుంది. దీంతో లాభాలను గడించవచ్చు.