ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ అప్పట్లో కేవలం రూ.1 లక్షకే కారు అని చెప్పి టాటా నానో కారును విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ కారు కోసం అప్పట్లో వాహనదారుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. అయితే కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నప్పటికీ కార్లలో సమస్యలు వస్తుండడంతో టాటా మోటార్స్ ఆ కార్ల తయారీని, అమ్మకాలను నిలిపివేసింది. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ యుగం నడుస్తుండడంతో నానాను మళ్లీ నానో ఈవీ రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. దీంతో త్వరలోనే ఈ కార్ రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు.
ఇక టాటా నావో ఈవీ కార్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 15.5 నుంచి 20 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీని ఏర్పాటు చేస్తారని సమాచారం. దీన్ని ఇంట్లో ఉండే ఏ చార్జర్‌తో అయినా చార్జింగ్ చేసుకోవచ్చట. చార్జర్ కెపాసిటీ 15 యాంప్స్ ఉంటే చాలు. అలాగే ఒక్కసారి ఈ బ్యాటరీని ఫుల్ చార్జింగ్ పెడితే ఏఏకంగా 220 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
నానో ఈవీ కారులో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, బ్లూటూత్ కనెక్టివిటీ, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేలు, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ 6 స్పీకర్ ఇన్ఫొటెయిన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించనున్నారని తెలుస్తోంది. ఇక టాటా నానో ఈవీ ధర రూ.6 లక్షల వరకు ఆన్‌రోడ్ ప్రైస్ ఉంటుందని సమాచారం. అయితే ఈ కార్ గనుక లాంచ్ అయితే అత్యంత తక్కువ ధరకు లభించే ఈవీ కార్ ఇదే అవుతుంది. దీంతో ఇతర ఈవీ కార్ల తయారీ కంపెనీలకు పెద్ద దెబ్బే అని విశ్లేషకులు అంటున్నారు. మరి నానో ఈవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.