business

వై ఎస్ రాజశేఖర రెడ్డి కారణంగానే సత్యం రామలింగరాజు జైలుకు వెళ్లారని అంటారు. అది నిజమేనా?

<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు సత్యం సంస్థలో జరిగిన సంఘటన చూద్దాం&period; 1987 లో రామలింగరాజు చేత స్థాపించబడి నాలుగు సంవత్సరాలలోనే మన భారత స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి సంచలనం సృష్టించింది&period; 1988 లో దీనితో పాటుగా మైటాస్ ఇంఫ్రా&comma; ప్రాపర్టీస్ అనే ఇంకో రెండు సంస్థలను కూడా స్థాపించారు&period; వీటిలో అధికభాగం భాగస్వాములు అయన స్నేహితులు&comma; బంధువులే&period; సత్యం కంప్యూటర్స్ అద్భుతంగా నడుస్తున్నప్పుడు రామలింగరాజు దృష్టి రియల్ ఎస్టేట్ వైపు మళ్లింది&period; హైదరాబాదు లో మంచి అభివృద్ధి జరుగుతున్న సమయంలో&comma; ఆ ప్రాంతాలలో స్థిరాస్తులను కొనడానికి&comma; సత్యం కంప్యూటర్స్లో వచ్చిన లాభాలను ఎక్కువగా చూపించి ఆ షేర్ యొక్క ధర విపరీతంగా పెరిగేటట్టు చేసి&comma; తరువాత తమ దగ్గర ఉన్న షేర్లలో కొంత భాగాన్ని అమ్మేసి ఆ డబ్బుని స్థిరాస్థులలో పెట్టుబడిగా పెట్టేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తెలివిగా ఈ లావాదేవీలన్నీ తన ఇంకో రెండు సంస్థల ద్వారా&comma; మరియు చాలా నకిలీ సంస్థల ద్వారా జరిగేటట్టు చూసేవారు&period; వీటికి డైరెక్టర్లగా స్నేహితులని&comma; తనకు తెలిసినవాళ్లందరిని పెట్టేవాడు&period; ఐతే ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా కొనడానికి గల కారణం మెట్రో మ్యాప్ యొక్క సమాచారం తన వర్గాల ద్వారా ముందస్తుగా తెలియడమే&period; ఇలా కొన్ని సంవత్సరాలుగా చెయ్యడం వల్ల&comma; సత్యం కంప్యూటర్స్ యొక్క నిజమైన లాభాలకి&comma; కల్పిత లాభాలకి దూరం బాగా పెరిగింది&period; ఎదో ఒకలాగా ఈ దూరాన్ని ధరలు బాగా పెరిగిన తరువాత స్థలాలని అమ్మేసి తగ్గిదాం అనుకున్న రాజుకి ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ కుదేలవడంతో ఎదురు దెబ్బ తగిలింది&period; అయినా పట్టువదలక&comma; తెలివిగా సత్యం కంప్యూటర్స్ మిగిలిన రెండు సంస్థలైన మైటాస్ ఇంఫ్రా&comma; ప్రాపర్టీస్ లో అధికభాగం లేదా పూర్తిగా వాటాని కొనుగోలు చెయ్యాలని ప్రతిపాదన తెచ్చాడు&period; ఎవరైనా సత్యం లాభాలు ఏమయ్యాయి అని ప్రశ్నించే లోపు&comma; వాటిని ఈ సంస్థలను కొనుగోలు చెయ్యడానికి ఉపయోగించేశాం అని చెప్పొచ్చనుకున్నాడు&period; బోర్డు అఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపేటట్టు చేసి&comma; ఈ ప్రక్రియ పూర్తిచేసాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86575 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;satyam&period;jpg" alt&equals;"what is the story of satyam computers " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెట్టుబడిదారులు&comma; వాటాదారుల ఆమోదం లేకుండా జరిగిన ఈ లావాదేవీ అసలు నచ్చకపోవడం వల్ల వాళ్ళని చికాకులో పెట్టింది&period; దీనితో పెద్ద వాటాదారులైన ఇన్సూరెన్సు సంస్థలు&comma; బ్యాంకులు&comma; ఇతర మ్యుట్యుయల్ ఫండ్స్ మెల్లగా తప్పుకోవడం ప్రారంభించారు&period; అంతే షేర్ ధర పతనం మొదలయ్యింది&comma; సగానికి సగం&period; తప్పని పరిస్థితిలో తన ప్రతిపాదనని వెనక్కి తీసేసుకున్నాడు&period; బోర్డు అఫ్ డైరెక్టర్స్ మెల్లిగా తప్పుకోవడం మొదలు పెట్టారు ప్రమాదం గ్రహించి&period; ప్రశ్నలు ఎక్కువ అవ్వడంతో చివరికి తాను చూపిన తప్పుడు లెక్కలు గురించి ఒప్పుకున్నాడు&period; వాటిని చూసి నిపుణులు నివ్వెరపోయారు&period; కొన్ని సంవత్సరాలు పదిరెట్లు కంటే ఎక్కువ లాభం చూపించి ఎలా తప్పించుకున్నారా అని చూస్తే ఆడిట్ సంస్థల్ని కూడా బోల్తా కొట్టించేసారు&period; పీడబ్ల్యూసీ &comma; సత్యం కంప్యూటర్స్ కి ఆడిటర్లు గా పనిచేసే సంస్థకు భారీగా జరిమానా పడింది&comma; అంతే కాక తాత్కాలిక నిషేధం కూడా అమలు అయ్యింది&period; తరువాత రాజుని అరెస్ట్ చేసిని విషయం తెలిసిందే&period; కాబట్టి స్వయంకృతాపరాధం వల్లనే జరిగింది గానీ&comma; ఒకరి వల్ల కాదు&period; నిజాయితి లేకపోవడం&comma; అత్యాశకు గురవ్వడం ఎవరినైనా పతనం చేస్తాయనడానికి ఇదొక ఋజువు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts