చిట్కాలు – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Sat, 21 Dec 2024 12:17:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png చిట్కాలు – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 Multani Mitti : ముల్తానీ మ‌ట్టిని ఇలా ఉప‌యోగించండి.. మీ చ‌ర్మం మెరిసిపోతుంది..! https://ayurvedam365.com/home-remedies-in-telugu/use-multani-mitti-in-this-way-for-facial-glow-how-to-use.html Sat, 21 Dec 2024 12:17:02 +0000 https://ayurvedam365.com/?p=63244 Multani Mitti : ముఖాన్ని కాంతివంతంగా మార్చడంతోపాటు పలు చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తానీ మట్టి అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల చర్మం మృదువుగా కూడా మారుతుంది. బ్లాక్‌ హెడ్స్, చర్మం రంగు మారడం, ఎండ వల్ల చర్మం కందిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఉన్నవారు ముల్తానీ మట్టిని ఉపయోగించాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ముల్తానీ మట్టితో ఆయా సమస్యల నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందామా. ఒక గిన్నెలో రెండు మూడు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున పెరుగు, కీరదోస గుజ్జు, రెండు టీ స్పూన్ల శనగపిండిలను వేసి బాగా కలపాలి. తరువాత పాలు పోస్తూ మెత్తని మిశ్రమంగా చేయాలి. దాన్ని ముఖం, మెడకు రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. ప్రకాశిస్తుంది.

రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి, ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఒకటిన్నర టీస్పూన్ల నిమ్మరసం, చిటికెడు పసుపులను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో మాస్క్‌లా రాయాలి. తరువాత బాగా ఆరిపోయాక తడి చేత్తో రుద్దుతూ మొత్తం కడిగేయాలి. దీంతో బ్లాక్‌ హెడ్స్‌ సమస్య తగ్గుతుంది. రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీమట్టిలో అంతే మోతాదులో బంగాళాదుంపల గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. బాగా ఆరాక కడిగేయాలి. దీంతో ఎండ వల్ల రంగు మారిన చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది.

use multani mitti in this way for facial glow how to use

రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నీళ్లు, పావు టేబుల్‌ స్పూన్‌ చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో ఎండ వల్ల కందిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఒక గుడ్డు తెల్లసొనలో రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి, కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్టులా తయారు చేయాలి. దాన్ని ముఖానికి రాయాలి. అనంతరం 20 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో చర్మం దృఢంగా ఉంటుంది. సాగిపోయినట్లు కనిపించదు.

చర్మం పొడిబారిపోయే సమస్య ఉన్నవారు రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీమట్టిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం, ఒక టీస్పూన్‌ రోజ్‌ వాటర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని మాస్క్‌లా వేయాలి. 30 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు ఆగాక కడిగేయాలి. దీంతో చర్మం తేమగా మారుతుంది. మృదుత్వం వస్తుంది.

]]>
Betel Leaves For Hair Growth : త‌మ‌ల‌పాకుల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..! https://ayurvedam365.com/home-remedies-in-telugu/betel-leaves-for-hair-growth-use-them-in-this-method.html Sat, 21 Dec 2024 09:53:22 +0000 https://ayurvedam365.com/?p=63210 Betel Leaves For Hair Growth : ప్రతి ఒక్కరు కూడా, అందమైన కురులని సొంతం చేసుకోవాలని అనుకుంటారు. అందమైన కురుల కోసం, అనేక రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. మీరు కూడా, అందమైన కురులని పొందాలని అనుకుంటున్నారా..? అయితే, ఇలా చేయండి. తమలపాకులతో అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు. తమలపాకులో యాంటీ టాక్సిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అలానే, యాంటీ డయాబెటిక్ గుణాలు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా తమలపాకులో ఎక్కువ ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి టు తో పాటుగా ఇతర పోషకాలు కూడా తమలపాకుల్లో ఉంటాయి.

తమలపాకులతో చక్కటి లాభాలని పొందవచ్చు. శీతాకాలంలో జుట్టు పొడిబారి పోతుంది. చిట్లి పోతుంది కూడా. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి, తమలపాకుల్ని మిక్సీలో వేసుకుని, కొన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిలో, రెండు స్పూన్లు తేనె వేసి మిక్స్ చేయండి. ఈ పేస్ట్ ని తలకి, జుట్టుకి ప్యాక్ లాగ వేసి అరగంట పాటు ఆరబెట్టుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో, తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ ని మాడుకి రాస్తే, జుట్టు బాగా ఉంటుంది జుట్టుని. మృదువుగా ఉంటుంది.

Betel Leaves For Hair Growth use them in this method

అలానే, జుట్టు ని ఒత్తుగా మారుస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగాలంటే, తమలపాకుల్ని పేస్ట్ కింద చేసుకుని, రెండు స్పూన్లు కొబ్బరి నూనె ఒక స్పూన్ ఆముదం కలపాలి. మిశ్రమాన్ని మాడు నుండి కుదుళ్ల దాకా పట్టించాలి. అరగంట అయ్యాక, తల స్నానం చేస్తే సరిపోతుంది. వారానికి, రెండుసార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

తమలపాకులలో మందార పూలు, కరివేపాకు, తులసి ఆకులు మిక్సీలో వేసి, తగినంత నీళ్లు పోసి పేస్ట్ కింద చేసుకోవాలి. రెండు స్పూన్లు కొబ్బరి నూనె కలిపి తలకి రాసి గంట తర్వాత స్నానం చేయాలి. వారానికి రెండుసార్లు, ఈ ప్యాక్ వేసుకుంటే మంచిది. జుట్టు ఒత్తుగా ఎదుగుతుంది.

]]>
మెరిసే చర్మం కోసం.. కొబ్బరి పాలు, నిమ్మరసం..! https://ayurvedam365.com/home-remedies-in-telugu/coconut-milk-and-lemon-juice-for-beauty.html Sat, 21 Dec 2024 09:18:45 +0000 https://ayurvedam365.com/?p=63192 సాధారణంగా చాలా మంది చర్మకాంతి పొందాలని భావిస్తారు. ఈ క్రమంలోనే ఎంతో ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ విధంగా మార్కెట్లో రసాయనాలతో తయారైన ఉత్పత్తులను చర్మానికి అలర్జీలను తీసుకువస్తాయి.ఈ క్రమంలోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం కొన్ని చిట్కాలతో ఇరవై నిమిషాలలో మన చర్మాన్ని ఎంతో కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన చర్మాన్ని చర్మకాంతిని పొందాలనుకునేవారు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్టులా తయారుచేసి ముఖంపై మర్దనా చేయాలి.20 నిమిషాల పాటు అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే ఎంతో కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.ఈ విధంగా చర్మం కాంతిని మెరుగు పరచడం కాకుండా ముఖం పై ఉన్న మచ్చలు వలయాలు తొలగిపోతాయి. అదేవిధంగా ముఖం పై ఏర్పడిన ముడతలను కూడా తొలగిస్తుంది.

coconut milk and lemon juice for beauty

అదేవిధంగా టేబుల్స్ వన్ ముల్తాన్ మట్టి, ఒక టేబుల్ స్పూన్ తేనే, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారుచేసుకుని మొహానికి, మెడకు ప్యాక్ వేసుకోవాలి. సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ విధంగా వారంలో కనీసం రెండు మూడు సార్లు చేయడం వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.

]]>
Carom Seeds For Gas Trouble : చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎవ‌రికైనా స‌రే.. ఇలా చేస్తే గ్యాస్ పోతుంది..! https://ayurvedam365.com/home-remedies-in-telugu/kids-or-adults-follow-this-remedy-for-gas-trouble.html Sat, 21 Dec 2024 08:27:58 +0000 https://ayurvedam365.com/?p=63184 Carom Seeds For Gas Trouble : ఈ మధ్యకాలంలో, చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిజానికి, ఎటువంటి అనారోగ్య సమస్య అయినా, ఇంటి చిట్కాలతో తొలగించుకోవచ్చు. మారిన జీవన శైలి, వయసు పైబడటం మొదలైన కారణాల వలన, ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టకపోతే, అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ఎక్కువమంది, ఈరోజు గ్యాస్ట్రిక్ సమస్యతో కూడా బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి, బయటపడడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయినప్పటికీ కుదరట్లేదు. ఈ సమస్య తగ్గడానికి, మందులు కాకుండా ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఇంటి చిట్కాలతో, ఈజీగా సమస్యను తగ్గించుకోవచ్చు. వాము గ్యాస్ ఏర్పడకుండా చూస్తుంది. పెద్దవాళ్లు కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు, వాముని ఔషధంగా ఇచ్చేవారు. వామును తీసుకుంటే, అజీర్తి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. పావు స్పూన్ వాము తీసుకుని, అందులో చిటికెడు సైంధవ లవణంని కానీ ఉప్పుని కానీ కలిపి నమిలి, ఆ రసాన్ని మింగేయాలి.

kids or adults follow this remedy for gas trouble

ఇలా చేయడం వలన, కడుపు లో చేరిన గ్యాస్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇది వగరుగా ఉన్నప్పటికీ తీసుకోండి. దీనిని తీసుకున్నాక, అర గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి. అంతే, చక్కగా పనిచేస్తుంది. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నప్పుడు లేదంటే ఏదైనా ఆహారం జీర్ణం అవ్వనప్పుడు, వాము తీసుకుంటే చాలు. సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం, వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

ఒకవేళ తక్కువ సమస్య ఉన్నట్లయితే, ఇలా ఇంటి చిట్కాని ట్రై చేయొచ్చు. వాము చక్కగా పనిచేస్తుంది. పైగా మనం ఇంట్లో వాడతాం కాబట్టి, ఈజీగానే తీసుకోవచ్చు. వామును తింటే ఇబ్బందిగా ఉంది అనుకుంటే, వెంటనే నీళ్లు తాగేయండి. లేదంటే నీళ్లలో వాముని అయిదు నిమిషాలు పాటు మరిగించి, నీటిని వడకట్టేసుకుని కాఫీ, టీ లాగానే తీసుకుంటే మంచిది. గ్యాస్, కడుపు నొప్పి సమస్యలు ఏమి కూడా ఉండవు.

]]>
Headache Home Remedies : త‌ల‌నొప్పి ఎక్కువ‌గా ఉందా.. ఈ నాచుర‌ల్ చిట్కాల‌ను పాటించండి..! https://ayurvedam365.com/home-remedies-in-telugu/follow-these-natural-home-remedies-for-headache.html Thu, 19 Dec 2024 15:40:18 +0000 https://ayurvedam365.com/?p=62878 Headache Home Remedies : త‌ల‌నొప్పి అనేది స‌హ‌జంగానే చాలా మందికి అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి అధికంగా ఉండ‌డం, నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌క‌పోవ‌డం, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, ప‌లు ఇత‌ర కార‌ణాల వల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంది. అయితే త‌ల‌నొప్పి రాగానే చాలా మంది ట్యాబ్లెట్ల‌ను వాడుతుంటారు. కానీ వీటిని వాడ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక త‌ల‌నొప్పి త‌గ్గేందుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మ‌నం ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఎలాంటి చిట్కాల‌ను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

త‌ల‌నొప్పి నుంచి బ‌య‌ట ప‌డేందుకు ద్రాక్ష పండ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ద్రాక్ష పండ్ల‌ను నేరుగా తిన్నా లేదా వాటితో త‌యారు చేసే జ్యూస్‌ను తాగినా కూడా త‌లనొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది. ఈ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు, మూడ్‌ను నియంత్రించే స‌మ్మేళ‌నాలు అధికంగా ఉంటాయి. క‌నుక ద్రాక్ష పండ్ల‌ను తీసుకుంటే త‌ల‌నొప్పి త‌గ్గిపోతుంది. త‌ల‌నొప్పిగా ఉన్న‌ప్పుడు కాసిన్ని ద్రాక్ష పండ్ల‌ను తినండి. లేదా వాటితో జ్యూస్ త‌యారు చేసి తాగండి. దీంతో వెంట‌నే స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

follow these natural home remedies for headache

త‌ల‌నొప్పిని త‌గ్గించ‌డంలో అల్లం ర‌సం కూడా బాగానే ప‌నిచేస్తుంది. చిన్న అల్లం ముక్క‌ను తీసుకుని నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగాలి. లేదా ఒక టీస్పూన్ అల్లం ర‌సంలో అంతే మోతాదులో నిమ్మ‌ర‌సం క‌లిపి తాగాలి. దీంతో త‌ల‌నొప్పి త‌గ్గిపోతుంది.

త‌ల‌నొప్పిని త‌గ్గించేందుకు దాల్చిన చెక్క కూడా ప‌నిచేస్తుంది. ఇది ఆహారాల‌కు రుచి ఇస్తుంది. అంతేకాదు మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా తగ్గిస్తుంది. దాల్చిన చెక్క‌తో టీ త‌యారు చేసి తాగితే త‌ల‌నొప్పి నుంచి వెంట‌నే ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. అలాగే దాల్చిన చెక్క పొడిని నీటిలో క‌లిపి పేస్ట్‌లా చేసి నుదుటిపై రాయాలి. కొంత‌సేపు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేసినా కూడా త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. అదేవిధంగా త‌ల‌నొప్పిగా ఉన్న‌ప్పుడు నుదుటిపై వేడి నీటితో కాపడం పెట్టుకోవ‌డం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇలా ఈ చిట్కాల‌ను పాటించి త‌ల‌నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.

]]>
Beauty Tips : బ్యూటీ పార్లర్ కి వెళ్ళక్కర్లేదు.. ఇంట్లోనే ఇలా చేసి అందాన్ని రెట్టింపు చేసుకోండి..! https://ayurvedam365.com/home-remedies-in-telugu/use-potato-in-this-way-for-beauty.html Thu, 19 Dec 2024 13:39:58 +0000 https://ayurvedam365.com/?p=62836 Beauty Tips : అందంగా కనపడడం కోసం, చాలామంది రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అందాన్ని పెంపొందించుకోవడానికి, మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ ని కూడా, చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది, ఇంటి చిట్కాలు పాటిస్తూ ఉంటారు. చాలామంది, ఈ రోజుల్లో ముడతలు, మచ్చలు, మొటిమలు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. అందంగా, కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ వుంటారు. అందరికీ ఈ కోరిక ఉండడం సహజం. అయితే, చాలామంది అందాన్ని పెంపొందించుకోవడానికి వేలకు వేలు డబ్బులు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు.

బ్యూటీ పార్లర్ ల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. ఇవేమీ కాకుండా, తక్కువ డబ్బులుతోనే మనం, సులభంగా నల్లని మచ్చలు, ముడతలు, మొటిమలు వంటివి తగ్గించుకోవచ్చు. ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. పెద్దగా కష్టపడక్కర్లేదు. ఓపిక ఉంటే చాలు. అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలగవు. కాంతివంతమైన చర్మాన్ని పొందాలని చూసేవాళ్ళు, ఈ పదార్థాలతో ఈజీగా అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

use potato in this way for beauty

దీనికోసం, రెండు స్పూన్లు బంగాళదుంపల రసం లో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ నిమ్మ రసం, ఒక స్పూన్ గ్లిజరిన్ వేసి, బాగా మిక్స్ చేయాలి. దీనంతటినీ ముఖానికి బాగా పట్టించి, పావుగంట పాటు వదిలేసి, తర్వాత గోరువెచ్చని నీటితో, ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే అదిరిపోయే ఫలితం ఉంటుంది. బంగాళదుంపలో పోషకాలు ఎక్కువ ఉంటాయి. చర్మ సమస్యలు తగ్గించడానికి కూడా బంగాళదుంప రసం హెల్ప్ చేస్తుంది.

డార్క్ సర్కిల్స్ వంటి సమస్యల నుండి కూడా ఈజీగా బయటపడొచ్చు. చర్మం పై మృత కణాలను తొలగించి, ముఖం కాంతివంతంగా మారేటట్టు చేస్తుంది. నిమ్మరసంలో ఉన్న పోషకాలు ముడతలు, ఫైన్ లైన్స్ ని తగ్గిస్తుంది. చర్మం పై ఉన్న ముడతలు ని తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. కొబ్బరి నూనెలో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలానే యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు కూడా ఉంటాయి. చర్మానికి సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

]]>
Green Gram For Beauty : పెస‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుంది..! https://ayurvedam365.com/home-remedies-in-telugu/green-moong-dal-for-beauty-how-to-use-lt.html Thu, 19 Dec 2024 11:25:56 +0000 https://ayurvedam365.com/?p=62790 Green Gram For Beauty : పెస‌ల‌ను కొంద‌రు ఉడ‌క‌బెట్టుకుని గుగిళ్లుగా చేసుకుని తింటుంటారు. ఇక కొంద‌రు వాటిని నాన‌బెట్టి, మొల‌కెత్తించి తింటారు. కొంద‌రు కూర చేసుకుంటారు. అయితే ఎలా తిన్నా.. పెస‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా వాటితో ప‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అంతే కాదు, ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌చ్చు. పెస‌ల వ‌ల్ల ముఖానికి సంబంధించి ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రిపూట కొన్ని ప‌చ్చిపాల‌ను తీసుకుని వాటిలో కొన్ని పెస‌ల‌ను వేసి నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ మిశ్ర‌మాన్ని గ్రైండ్ చేయాలి. దాన్ని ఫేస్‌ప్యాక్‌గా మార్చుకుని ముఖానికి రాయాలి. 15 – 20 నిమిషాలు ఆగాక ప్యాక్ డ్రై అవ్వ‌గానే నీటితో క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది. డ్రై స్కిన్ ఉన్న‌వారికి ఈ ప్యాక్ ఎంత‌గానో మేలు చేస్తుంది.

green moong dal for beauty how to use lt

రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో కొన్ని పెస‌ల‌ను వేసి నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే వాటిని మిక్సీ ప‌ట్టి పేస్ట్‌లా మార్చుకోవాలి. ఆ మిశ్ర‌మంలో అర టీస్పూన్ నెయ్యి వేసి బాగా క‌లిపి దాన్ని ముఖంపై అప్లై చేయాలి. ముఖంపై ఆ మిశ్ర‌మాన్ని సున్నితంగా రాస్తూ మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత 10 నిమిషాలు ఆగి గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే మొటిమ‌ల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఒక గ్లాసు నీటిలో గుప్పెడు పెస‌ల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే వాటిని పేస్ట్‌లా చేసుకుని అందులో చ‌ల్ల‌ని పెరుగు లేదా అలోవెరా జెల్ వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని ముఖంపై లేదా శరీరంలోని ఇత‌ర ప్ర‌దేశాల‌పై అప్లై చేయాలి. 5-10 నిమిషాలు ఆగాక చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎండ‌లో కందిన చ‌ర్మం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది. దీంతో చ‌ర్మం మృదువుగా మారుతుంది.

]]>
Sinus Home Remedies : సైన‌స్ ఎంత‌కూ త‌గ్గ‌డం లేదా.. ఈ అద్భుత‌మైన చిట్కాల‌ను పాటించండి..! https://ayurvedam365.com/home-remedies-in-telugu/follow-these-wonderful-home-remedies-for-sinus.html Thu, 19 Dec 2024 02:07:44 +0000 https://ayurvedam365.com/?p=62747 Sinus Home Remedies : సైనసైటిస్‌ సమస్య ఉన్న వారి బాధ వర్ణనాతీతం. ఎన్ని మందులు వాడినా ఫలితం శూన్యం. తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపే చికిత్సలే లేవు. వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా సైనసైటిస్‌ సమస్య మొదలవుతుంది. మళ్లీ మళ్లీ వస్తూ దీర్ఘకాలం వేధించే ఈ సమస్యతో కాలం వెళ్లదీస్తున్న వారు చాలా మందే ఉంటారు. అయితే సైన‌స్ స‌మ‌స్య‌కు చింతించాల్సిన ప‌నిలేదు. కింద సూచించిన విధంగా ప‌లు చిట్కాల‌ను పాటిస్తే సైన‌స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. ఒక పాత్రలో బాగా మరిగిన వేడి నీటిని తీసుకుని అందులో కొంత యూకలిప్టస్ ఆయిల్ లేదా మెంథాల్ వేయాలి. అనంతరం నీటి నుంచి వెలువడే ఆవిరిని పీల్చాలి. ఇలా చేస్తే సైనస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

సైనస్ సమస్య ఉన్న వారు ఎప్పటికప్పుడు నీటిని తాగుతుండాలి. దీంతో శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఫలితంగా సైనస్ సమస్య తొలగిపోతుంది. మసాలాలు, కారం బాగా వేసి వండిన ఆహారాలను తినాలి. కారంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి సైనస్ సమస్యను క్లియర్ చేస్తాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేస్తే మ్యూకస్ కరుగుతుంది. సైనస్ సమస్య నుంచి బయట పడవచ్చు.

follow these wonderful home remedies for sinus

యాపిల్ సైడర్ వెనిగర్‌లో నాచురల్ క్లీనింగ్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. ఇంకా అనేక లాభాలు యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల కలుగుతాయి. సైనస్ నొప్పులను, లక్షణాలను తగ్గించే గుణం ఇందులో ఉంది. ఒక కప్పు వేడి నీటిలో రెండు, మూడు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి రోజుకు 3 సార్లు తాగాలి. ఇలా చేస్తే ఎక్కువగా ఉన్న మ్యూకస్ కరుగుతుంది. ముక్కు దిబ్బడ పోతుంది. సైనస్ సమస్య తగ్గుతుంది. చికెన్, వెజిటెబుల్స్ వేసి తయారు చేసిన వేడి వేడి సూప్స్‌ను తాగాలి. ఇవి మ్యూకస్‌ను కరిగించి సైనస్ సమస్య నుంచి బయట పడేస్తాయి.

]]>
Cracked Heels : చ‌లికాలంలో మ‌డ‌మ‌లు ప‌గిలి ఇబ్బందులు ప‌డుతున్నారా.. అయితే ఇలా చేయండి..! https://ayurvedam365.com/home-remedies-in-telugu/cracked-heels-wonderful-home-remedies-2.html Wed, 18 Dec 2024 14:27:09 +0000 https://ayurvedam365.com/?p=62693 Cracked Heels : చలికాలంలో చర్మం బాగా పాడైపోతుంది. చలికాలంలో పగుళ్లు వంటి వాటి వలన కూడా, ప్రతి ఒక్కరు సతమతమవుతుంటారు. చలికాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలు మొదలవుతాయి. ఎక్కువమంది మడమల పగుళ్లు సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీని వలన, రాత్రిపూట కూడా సరిగ్గా నిద్రపోలేకపోతుంటారు. పాదాల రంగు కూడా, పూర్తిగా మారిపోతుంది. కొంతమంది అయితే, చలిలోకి కూడా రాలేకపోతుంటారు. పగుళ్ల సమస్యని ఎదుర్కోవాలంటే, కొన్ని చిట్కాలని పాటించాలి.

ఇలా చేస్తే, పాదాలు మృదువుగా మారతాయి. అందంగా మారతాయి. మరి, ఈ సమస్య నుండి ఎలా బయటపడొచ్చు అనే విషయాన్ని ఇప్పుడే చూద్దాం. చలికాలంలో పాదాలు క్లీన్ గా ఉండాలి అంటే, స్నానం చేసేటప్పుడు లేదంటే ఖాళీ దొరికినప్పుడు, పాదాల మీద శ్రద్ధ పెట్టాలి. కాళ్లు పగిలినట్లయితే, నూనె వంటివి ఏమైనా మీరు రాసుకోవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు కలబంద గుజ్జుని, గ్లిజరిన్ ని రాసి కొద్దిసేపు మర్ధన చేయాలి. దీంతో మీకు రిలీఫ్ కలుగుతుంది. నిద్ర కూడా పట్టేస్తుంది. ప్రతిరోజు ఇలా చేస్తే, పగుళ్లు పూర్తిగా మాయమైపోతాయి.

cracked heels wonderful home remedies

ఒకవేళ కనుక పగిలిన మడమల బాధనుండి బయటపడాలని అనుకుంటే, దానిమీద కొంచెం తేనె రాయండి. పాదాలు మృదువుగా మారుతాయి. అందంగా కనబడతాయి. ప్రతిరోజు రాత్రి, పాదాలకి తేనెను రాసి, కొంచెం సేపు మర్దన చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె కూడా ఈ సమస్య నుండి మనల్ని బయటపడేస్తుంది. కొబ్బరి నూనె శరీరానికి, ముఖానికి బాగా ఉపయోగపడుతుంది.

పగిలిన మడమల మీద, కొబ్బరి నూనె రాసి, మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. బియ్యం పిండి కూడా బాగా ఉపయోగపడుతుంది. బియ్యం పిండి తీసుకొని, మీరు పగిలిన మడమల మీద స్క్రబ్ చేయాలి. ప్రతిరోజు చేస్తే పగుళ్ళు మాయమైపోతాయి. పాదాల పగుళ్ళతో బాధపడే వాళ్ళు, ఈ చిన్న చిట్కాలని ఫాలో అయితే, చక్కటి ఫలితం ఉంటుంది. ఈజీగా మీ పాదాలని మృదువుగా మార్చుకోవచ్చు. పగుళ్ల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది.

]]>
Teeth Whitening Foods : దంతాలు తెల్ల‌గా, త‌ళ‌త‌ళ మెర‌వాలా..? అయితే వీటిని తినండి..! https://ayurvedam365.com/home-remedies-in-telugu/teeth-whitening-foods-take-these-daily.html Wed, 18 Dec 2024 12:22:49 +0000 https://ayurvedam365.com/?p=62662 Teeth Whitening Foods : స్వీట్లు, జంక్‌ఫుడ్‌, ఇత‌ర కొన్ని ఆహార ప‌దార్థాల‌ను తింటే మ‌న దంతాల‌కు న‌ష్టం క‌లుగుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. వాటితో దంతాల మ‌ధ్య కావిటీలు వ‌చ్చి దంతాలు పుచ్చిపోతాయి. దంతాల‌కు రంధ్రాలు ప‌డ‌తాయి. దీంతోపాటు చిగుళ్ల స‌మ‌స్య‌లు కూడా బాధిస్తాయి. అయితే ఆయా ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాగైతే దంతాల స‌మ‌స్య‌లు వ‌స్తాయో.. అదే క్ర‌మంలో కొన్ని ఆహార ప‌దార్థాల‌ను తింటే దంతాల స‌మ‌స్య‌లు పోవ‌డ‌మే కాదు, దంతాలు తెల్ల‌గా మారుతాయి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ క్ర‌మంలో దంతాల‌ను తెల్ల‌గా చేసే అలాంటి ఆహార ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రా బెర్రీల్లో మాలియిక్ యాసిడ్ అనే ఓ ఎంజైమ్ ఉంటుంది. ఇది స‌హ‌జ సిద్ధ‌మైన బ్లీచింగ్ ఏజెంట్‌లా ప‌నిచేస్తుంది. అంతేకాకుండా ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి వ‌ల్ల కూడా దంతాలు తెల్ల‌గా మారుతాయి. దంతాల మ‌ధ్య పేరుకుపోయే వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. స్ట్రా బెర్రీల‌ను త‌ర‌చూ తింటుంటే దంత స‌మ‌స్య‌లు బాధించ‌వు. చిగుళ్ల‌ను దృఢంగా చేసి దంతాల‌ను తెల్ల‌గా మార్చే ఔష‌ధ గుణాలు యాపిల్స్‌లో ఉన్నాయి. అంతే కాదు, యాపిల్స్ వ‌ల్ల నోట్లో ఉమ్మి కూడా బాగా త‌యార‌వుతుంది. ఇది నోట్లో ఉండే చెడు బాక్టీరియాను నాశ‌నం చేస్తుంది. బ్ర‌కోలిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది దంతాల‌ను తెల్ల‌గా మార్చేందుకు, దంతాల‌ను దృఢంగా చేసేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది.

teeth whitening foods take these daily

క్యారెట్ల‌లో దంతాల‌ను తెల్ల‌గా చేసే గుణాలు ఉన్నాయి. వీటిని త‌ర‌చూ తింటుంటే చాలు దంత స‌మ‌స్య‌లు పోతాయి. చిగుళ్లు దృఢంగా మారుతాయి. చీజ్‌లో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది దంతాల‌ను దృఢంగా చేయ‌డ‌మే కాదు, దంతాల‌ను తెల్ల‌గా మారుస్తుంది. దంతాల పైన ఉండే ఎనామిల్ పొర పోకుండా చూస్తుంది. బాదం ప‌ప్పు, జీడి ప‌ప్పు, వాల్‌నట్స్‌ల‌లో దంతాల‌ను తెల్ల‌గా చేసే ఔష‌ధ గుణాలు ఉన్నాయి. పాచి ప‌ళ్లు ఉన్న‌వారు న‌ట్స్‌ను త‌ర‌చూ తింటుంటే మంచిది. దీంతో దంతాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో ఒక‌టే స‌మ‌స్య‌. అది నోటి దుర్వాస‌న‌. ఉల్లిపాయ‌ల‌ను తింటే నోరంతా వాస‌న వ‌స్తుంది. కానీ నిజానికి ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న దంతాల‌కు మేలే జ‌రుగుతుంది. వాటిని ప‌చ్చిగా తింటుంటే వాటిలో ఉండే స‌ల్ఫ‌ర్ నోటి స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. దంతాల‌ను తెల్ల‌గా మారుస్తుంది.

నారింజ‌ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది దంతాల‌ను దృఢంగా చేయ‌డ‌మే కాదు, తెల్ల‌గా మార్చేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. బ్రొమిలీన్ అనే ర‌సాయ‌నం పైనాపిల్స్‌లో పుష్క‌లంగా ఉంటుంది. ఇది దంతాల‌కు ప‌ట్టిన పాచి, గార వంటి వాటిని తొల‌గించి దంతాల‌ను తెల్ల‌గా, దృఢంగా మారుస్తుంది. దంతాల మ‌ధ్య పేరుకుపోయిన వ్య‌ర్థాలు, బాక్టీరియాను తొలగిస్తుంది. క‌నుక వీటిని రోజూ తింటుంటే ఎలాంటి దంత స‌మ‌స్య‌లు అయినా సరే త‌గ్గిపోతాయి. దంతాలు తెల్ల‌గా మారుతాయి. త‌ళ‌త‌ళా మెరుస్తాయి.

]]>