వైద్య విజ్ఞానం – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Fri, 20 Dec 2024 12:14:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png వైద్య విజ్ఞానం – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 Paralysis Symptoms : ప‌క్ష‌వాతం వ‌చ్చే ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జాగ్ర‌త్త‌గా ఉండండి..! https://ayurvedam365.com/medical-science-knowledge/these-symptoms-will-appear-before-paralysis.html Fri, 20 Dec 2024 12:14:34 +0000 https://ayurvedam365.com/?p=63059 Paralysis Symptoms : పక్షవాతం అనేది సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వారికి వస్తుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువ వయస్సున్న వారికి కూడా పక్షవాతం వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మధుమేహం, స్థూలకాయం, హై కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, హై బీపీ వంటి అనేక అనారోగ్యాల వల్ల ప్రస్తుతం చాలామందికి పక్షవాతం వస్తోంది. అయితే.. పక్షవాతం వచ్చాక బాధ పడడం కంటే అది రాకముందే అప్రమ‌త్తంగా ఉండాలి. ఈ క్ర‌మంలోనే ప‌క్ష‌వాతం వ‌చ్చే ముందు మ‌న శ‌రీరంలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని జాగ్ర‌త్త‌గా గుర్తిస్తే.. ముందుగానే ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ప‌క్ష‌వాతం వ‌చ్చే ముందు మ‌న‌లో క‌నిపించే ఆ ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

ప‌క్ష‌వాతం వ‌చ్చే ముందు ముఖానికి ఒక వైపు స్ప‌ర్శ స‌రిగ్గా ఉండ‌దు. ఒక వైపును స‌రిగ్గా క‌దిలించ‌లేరు. అలాగే ఒక వైపు ఉండే ముఖంపై చ‌ర్మం అంతా సాగిన‌ట్లు అవుతుంది. ముఖాన్ని రెండు వైపులా స‌రిగ్గా క‌దిలిస్తే.. ప‌క్షవాతం వ‌చ్చేది.. రానిదీ తెలుసుకోవ‌చ్చు.. ఒక వైపు ముఖాన్ని క‌దిలించ‌క‌పోతే.. వెంట‌నే అప్ర‌మ‌త్తం అవ్వాలి. త‌క్ష‌ణ‌మే వైద్యున్ని సంప్ర‌దించి చికిత్స తీసుకోవాలి. కొంద‌రికి అప్పుడప్పుడు శరీరంలో కేవ‌లం ఒకే వైపు స్ప‌ర్శ లేకుండా అవుతుంది. ఆ స‌మ‌యంలో కొంద‌రు శ‌రీరంలో ఒక ప‌క్క భాగాన్ని (చేతులు, కాళ్లు కూడా) కదిలించ‌లేక‌పోతారు. ఇలా గ‌న‌క ఎవ‌రికైనా అనిపిస్తుంటే.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌వాలి.

these symptoms will appear before paralysis

ప‌క్ష‌వాతం వ‌చ్చే ముందు కొంద‌రికి మాట కూడా స‌రిగ్గా రాదు. అస్ప‌ష్టంగా మాట్లాడుతుంటారు. ఇలా గ‌న‌క జ‌రుగుతుంటే.. వెంట‌నే స్పందించి.. డాక్ట‌ర్‌ను క‌లిసి త‌గిన చికిత్స తీసుకోవాలి. ప‌క్ష‌వాతం వ‌చ్చే ముందు కొంద‌రు చేతుల‌ను, కాళ్ల‌ను పైకి ఎత్త‌లేక‌పోతుంటారు. ఇలా జ‌రిగితే ప‌క్ష‌వాతంగా అనుమానించి వెంట‌నే చికిత్స తీసుకోవాలి. ప‌క్ష‌వాతం వ‌చ్చే ముందు కొంద‌రు.. ఇత‌రుల‌తో సంభాషించేట‌ప్పుడు అయోమ‌యానికి లోన‌వుతుంటారు. ఎదుటి వారు చెప్పే మాట‌ల‌ను వారు స‌రిగ్గా అర్థం చేసుకోలేక‌పోతారు. ఈ ల‌క్ష‌ణం క‌నిపిస్తే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. ఎప్పుడూ బాగా త‌ల‌నొప్పిగా ఉండ‌డం, క‌ళ్లు తిర‌గ‌డం, న‌డ‌క త‌డ‌బ‌డ‌డం, దృష్టి లోపాలు.. త‌దిత‌ర ల‌క్ష‌ణాలు ఉంటే.. ప‌క్ష‌వాతంగా అనుమానించి డాక్ట‌ర్‌ను క‌ల‌వాలి.

]]>
Black Marks On Tongue : మీ నాలుక‌పై ఇలా ఉందా.. అయితే అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే..! https://ayurvedam365.com/medical-science-knowledge/if-you-have-black-spots-on-tongue-then-beware.html Fri, 20 Dec 2024 04:43:13 +0000 https://ayurvedam365.com/?p=62956 Black Marks On Tongue : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో నాలుక కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు రుచిని తెలియ‌జేస్తుంది. దీంతో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల రుచుల‌ను ఆస్వాదిస్తాము. అయితే డాక్ట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్ల‌గానే మ‌న నాలుక చూపించ‌మంటారు. ఎందుకంటే నాలుక‌ను చూసి మ‌న‌కు వచ్చిన అనారోగ్య స‌మ‌స్య గురించి ఇట్టే చెప్ప‌వచ్చు. అందువ‌ల్లే వైద్యులు ముందుగా నాలుక చూపించ‌మంటారు. అయితే వాస్త‌వానికి నాలుక ఇచ్చే ప‌లు సూచ‌న‌ల‌ను గుర్తించ‌డం ద్వారా మ‌నం కూడా మ‌నకు క‌లిగిన అనారోగ్య స‌మ‌స్య ఏమిటో ముందుగానే తెలుసుకోవ‌చ్చు. ఇక నాలుక‌పై ఎలాంటి సూచ‌న‌లు క‌నిపిస్తే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుక మీద తెల్ల‌గా ఉంటే మీరు జీర్ణ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని, షుగ‌ర్ ఉంద‌ని అర్థం. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి లేదా షుగ‌ర్ ఉన్న‌వారికి కూడా నాలుక మీద తెల్ల‌గా ఉంటుంది. ఇలా గ‌న‌క ఉంటే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి. లేదంటే స‌మ‌స్య‌లు మ‌రింత తీవ్ర‌త‌రం అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. ఇక నాలుక మీద న‌ల్ల‌ని మచ్చ‌లు ఉన్నాయంటే వెంట‌నే అల‌ర్ట్ అవ్వాల్సిందే. సాధార‌ణంగా ఇలాంటి మ‌చ్చ‌లు క్యాన్స‌ర్ వ‌ల్ల ఏర్ప‌డుతాయి. లేదంటే ధూమ‌పానం చేయ‌డం వ‌ల్ల ఏర్ప‌డుతాయి. క‌నుక ఇలాంటి మ‌చ్చ‌లు వ‌స్తున్నాయంటే అప్ర‌మ‌త్తంగా ఉండాలి. లేదంటే క్యాన్స‌ర్ బారిన ప‌డ‌తారు.

if you have black spots on tongue then beware

ఇక నోటి స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ నాలుక మీద తెల్ల‌ని పొర ఏర్ప‌డుతుంది. వీరికి నోటి దుర్వాస‌న కూడా ఉంటుంది. శ‌రీరంలో బాక్టీరియా, వైర‌స్‌, ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు ఉంటే నాలుక పొర‌లుగా అయిన‌ట్లు క‌నిపిస్తుంది. నాలుక వాపుల‌కు కూడా గుర‌వుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డిన వారి నాలుక ప‌సుపు రంగులో లేదా పాలిపోయిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇలా నాలుక‌ను చూసి మ‌న‌కు ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌ల గురించి తెలుసుకోవ‌చ్చు. ఇవి తెలుసుకుంటే వ్యాధులు మ‌రింత ముద‌ర‌కుండా చూసుకోవ‌చ్చు.

]]>
తరచూ కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి! https://ayurvedam365.com/medical-science-knowledge/do-not-make-these-mistakes-if-you-are-suffering-from-stomach-ache.html Thu, 19 Dec 2024 14:20:16 +0000 https://ayurvedam365.com/?p=62859 సాధారణంగా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించే వాటిలో మన పేగులు ఒకటి. ఇవి శక్తిని గ్రహించడంతో పాటు, మానసిక సమతుల్యతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన పేగులలో మన ఆరోగ్యాన్ని కాపాడే మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. దీని ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి.అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది వారి జీవనశైలిలో ఎన్నో మార్పులను చోటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సరేనా పోషకాహారానికి బదులుగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడటంతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింప చేసే బ్యాక్టీరియాలు నశించిపోయి తరచూ తీవ్రమైన కడుపు నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ విధంగా కడుపు నొప్పి రావడానికి మనం చేసే కొన్ని తప్పులు కూడా కారణమవుతాయి మరి ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

*సాధారణంగా ప్రతి రోజూ వారి ఆహారంలో భాగంగా ఎక్కువ మోతాదులో చక్కెర తీసుకుంటారు. అధిక మోతాదులో చక్కెర తీసుకోవటంవల్ల మన ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా పూర్తిగా దెబ్బతింటుంది తద్వారా తరచూ మనకు కడుపునొప్పి రావడం మొదలవుతుంది.

do not make these mistakes if you are suffering from stomach ache

*మన శరీరానికి కావల్సినంత నిద్ర లేకపోవడం వల్ల అధిక ఒత్తిడి ఆందోళనకు గురి కావడం వల్ల గట్ బ్యాక్టీరియా పూర్తిగా దెబ్బతింటుంది.

*మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే తప్పనిసరిగా నీటిని తీసుకోవాలి. అయితే చాలామంది నీటి పరిమాణం పూర్తిగా తగ్గించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

*మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ లోపించడం వల్ల కూడా ఈ విధమైనటువంటి సమస్య తలెత్తుతుంది. ఫైబర్ కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా తీసుకున్న ఆహారం సరైన క్రమంలో జీర్ణమవుతుంది.

*అధికంగా మద్యపానం చేయడం వల్ల దాని ప్రభావం గట్ బ్యాక్టీరియాలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ కారణం చేత మన శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియాకు తీవ్రమైన హాని కలుగుతుంది.

]]>
Heart Attack Signs : హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.. జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించండి..! https://ayurvedam365.com/medical-science-knowledge/heart-attack-symptoms-beware-of-them.html Wed, 18 Dec 2024 15:24:20 +0000 https://ayurvedam365.com/?p=62705 Heart Attack Signs : గుండె పోటు సైలెంట్ కిల్ల‌ర్‌.. అది వ‌చ్చేదాకా చాలా సైలెంట్‌గా ఉంటుంది. కానీ ఒక‌సారి హార్ట్ స్ట్రోక్ వ‌స్తే మాత్రం.. బాధితులు విల‌విల‌లాడిపోతారు. అది వ‌చ్చేదాకా ఎలాంటి ల‌క్ష‌ణాలు మ‌న‌కు క‌న‌బ‌డ‌వు. కానీ హార్ట్ స్ట్రోక్ వ‌స్తుందంటే చాలు.. కొన్ని ల‌క్ష‌ణాల‌ను మాత్రం మ‌నం సుల‌భంగా క‌నిపెట్ట‌వ‌చ్చు. అవేమిటంటే.. గుండె పోటు వ‌స్తుంద‌నగా.. తీవ్ర‌మైన అల‌స‌ట క‌లుగుతుంది. అవ‌య‌వాల‌కు ర‌క్త ప్ర‌వాహం ఆగిపోతుంది. దీని వ‌ల్ల ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌దు. దీంతో అల‌స‌ట వ‌స్తుంది. అయితే ఎవ‌రికైనా అప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉండి, వెంట‌నే అల‌స‌టగా అనిపిస్తే అనుమానించాలి. అది హార్ట్ ఎటాక్‌కు సంకేతం కావ‌చ్చు. అలాంటి వారు అప్ర‌మ‌త్త‌గా ఉండి వెంట‌నే స్పందిస్తే పెను ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు.

హార్ట్ ఎటాక్ వ‌చ్చేముందు గొంతు, మెడ‌, ద‌వ‌డ‌లో తీవ్ర‌మైన నొప్పిగా ఉంటుంది. అది నెమ్మదిగా ఏదైనా భుజం మీదుగా చేయి కింద‌కు వ్యాపిస్తుంది. అలాగే ఛాతి మ‌ధ్య‌లో ముందు లేదా వెనుక నొప్పి వ‌స్తుంది. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌రాదు. త‌క్ష‌ణ‌మే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి. గుండె పోటు వ‌చ్చేముందు కొంద‌రికి క‌డుపులో తిప్పిన‌ట్లు అవుతుంది. వికారం, వాంతులు అవుతాయి. ఈ ల‌క్ష‌ణాల‌ను కూడా జాగ్ర‌త్త‌గా గ‌మనించాలి. సాధార‌ణంగా కొంద‌రికి ఆహారం తిన్న వెంట‌నే ఛాతిలో మంట అనిపిస్తుంది. అది గ్యాస్ లేదా అసిడిటీ అయి ఉండ‌వ‌చ్చ‌ని కొంద‌రు అనుకుంటారు. అది నిజ‌మే అయిన‌ప్ప‌టికీ.. కొన్ని సందర్భాల్లో మాత్రం.. అది హార్ట్ ఎటాక్ వ‌చ్చేముందు క‌నిపించే సంకేతం కావ‌చ్చు. క‌నుక ఈ ల‌క్ష‌ణం ప‌ట్ల కూడా జాగ్ర‌త్త‌గా ఉండి వెంట‌నే స్పందించాలి.

heart attack symptoms beware of them

గుండె పోటు వ‌చ్చేముందు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు త‌లెత్తుతాయి. శ్వాస స‌రిగ్గా ఆడ‌దు. గుండె పోటు వ‌చ్చేముందు లేదా వ‌స్తున్న స‌మ‌యంలో మాట్లాడితే మాట‌లు త‌డ‌బ‌డుతుంటాయి. అలాగే మైకం వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. త‌ల‌తిరిగి ప‌డిపోతారు. పైన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం ఆల‌స్యం చేయకుండా వెంట‌నే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాలి. దీంతో గుండెకు భారీగా న‌ష్టం క‌ల‌గ‌కుండా నివారించ‌వ‌చ్చు.

]]>
Skin Rashes : ఈ చ‌ర్మ స‌మ‌స్య‌లు మీకు ఉన్నాయా.. అయితే కార‌ణాలు ఏమిటో తెలుసుకోండి..! https://ayurvedam365.com/medical-science-knowledge/if-you-have-skin-rashes-then-know-the-reasons.html Wed, 18 Dec 2024 14:24:38 +0000 https://ayurvedam365.com/?p=62685 Skin Rashes : మ‌న శ‌రీరంలో అనేక ప‌నులు స‌క్ర‌మంగా జ‌ర‌గాలన్నా.. శ‌రీర అవ‌య‌వాల‌కు పోష‌ణ అందాల‌న్నా.. మ‌నం అనేక పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాల్సిందే. ఈ క్ర‌మంలోనే ప‌లు విట‌మిన్లు మ‌న శ‌రీరానికి పోష‌ణ అందించ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని ర‌కాల విటమిన్లు అంద‌క‌పోతే.. మ‌న‌కు ప‌లు ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ పొడిగా ఉంటుందంటే అందుకు విట‌మిన్ ఎ లోపం కార‌ణం కావ‌చ్చు. విట‌మిన్ ఎ చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. క‌నుక అది లోపిస్తే.. చ‌ర్మం పొడిగా మారుతుంది. ఇలా గ‌న‌క జ‌రిగితే.. విట‌మిన్ ఎ ఉన్న ఆహారాల‌ను తింటే ఈ స‌మ‌స్య పోతుంది. విట‌మిన్ ఎ మ‌న‌కు కోడిగుడ్లు, మాంసం, పాలు, చీజ్‌, క్రీమ్‌, లివ‌ర్‌, కిడ్నీలు, చేప‌లు, పాల‌కూర‌, యాప్రికాట్స్‌, క్యారెట్లు, ఆపిల్స్ త‌దిత‌రాల్లో ల‌భిస్తుంది.

చ‌ర్మంపై ద‌ద్దుర్లు వ‌స్తున్నా, నోటి పూత ఉన్నా, నాలుక ప‌గిలిన‌ట్లు క‌నిపిస్తున్నా.. దాన్ని విట‌మిన్ బి2 లోపంగా అనుమానించాలి. అలాంట‌ప్పుడు ఈ విట‌మిన్ ఉన్న ఆహారం తీసుకుంటే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. విట‌మిన్ బి2 మ‌న‌కు పాలు, చీజ్‌, పెరుగు, తృణ ధాన్యాలు, ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, కోడిగుడ్డు తెల్ల‌నిసొన‌, మాంసం, కిడ్నీలు, లివ‌ర్‌లో ల‌భిస్తుంది. విట‌మిన్ బి3 లోపం ఉంటే త‌ర‌చూ గ‌జ్జి, తామ‌ర వంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలో విట‌మిన్ బి3 ఉండే చేప‌లు, మాంసం, కోడిగుడ్లు, పాలు, తృణ ధాన్యాలు, పుట్ట‌గొడుగులు, న‌ట్స్ త‌దిత‌ర ఆహారాల‌ను తీసుకుంటే.. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. విట‌మిన్ బి6 లోపం ఉంటే.. పెదాలు బాగా ప‌గులుతాయి. నోటిపూత వ‌స్తుంది. చ‌ర్మంపై దుర‌ద‌, ర్యాషెస్ వ‌స్తాయి. దీన్ని నివారించాలంటే.. విట‌మిన్ బి6 ఉండే చేప‌లు, గుడ్లు, కూర‌గాయలు తీసుకోవాలి.

if you have skin rashes then know the reasons

చర్మం పాలిపోయిన‌ట్లు ఉన్నా, పొడిగా మారినా దాన్ని విట‌మిన్ బి7 లోపంగా భావించాలి. అలాంటి వారు లివ‌ర్‌, ప‌ల్లీలు, కోడిగుడ్డు ప‌చ్చ‌సొన‌, చికెన్‌, పుట్ట‌గొడుగులు తీసుకుంటే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. విట‌మిన్ బి12 లోపం ఉంటే చ‌ర్మం ప‌సుపు రంగులోకి మారుతుంది. దీన్ని నివారించాలంటే.. విట‌మిన్ బి12 ఎక్కువ‌గా ఉండే.. మాంసం, లివ‌ర్‌, చీజ్‌, పాలు, కోడిగుడ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. చ‌ర్మంపై ఎరుపు రంగు మ‌చ్చ‌లు క‌నిపిస్తున్నా, చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా దాన్ని విట‌మిన్ సి లోపంగా భావించాలి. విట‌మిన్ సి ఉండే నారింజ‌, ద్రాక్ష‌, బొప్పాయి, ట‌మాటాలు, క్యాబేజీ, కాలీఫ్ల‌వ‌ర్‌, పాల‌కూర వంటివి తీసుకుంటే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

చ‌ర్మం దుర‌దగా ఉండ‌డం, చ‌ర్మంపై పొర పొలుసులుగా మారి ఊడి రావ‌డం.. త‌దిత‌ర ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. దాన్ని సోరియాసిస్ అంటారు. దీనికి వైద్యులు ఇచ్చే మెడిసిన్‌తోపాటు విట‌మిన్ డి ఉండే ఆహారాల‌ను కూడా తీసుకోవాలి. విట‌మిన్ డి ఎక్కువ‌గా కోడిగుడ్డు ప‌చ్చ‌నిసొన‌, లివ‌ర్‌, ఉప్పునీటి చేప‌లు, పాలు, పుట్ట‌గొడుగుల్లో మ‌న‌కు ల‌భిస్తుంది. మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఇ లోపిస్తే.. చ‌ర్మం ముడ‌త‌లుగా వ‌చ్చిన‌ట్లుగా మారుతుంది. వృద్ధాప్య ఛాయ‌లు చ‌ర్మంపై క‌నిపిస్తాయి. దీన్ని నివారించాలంటే.. విట‌మిన్ ఇ ఉండే.. స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌, న‌ట్స్ వంటి వాటిని ఎక్కువ‌గా తీసుకోవాలి.

]]>
Urine Smell : మూత్రం దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఇవే కార‌ణాలు కావ‌చ్చు..! https://ayurvedam365.com/medical-science-knowledge/if-your-urine-is-getting-bad-smell-then-these-are-the-reasons.html Wed, 18 Dec 2024 10:02:19 +0000 https://ayurvedam365.com/?p=62643 Urine Smell : ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులు మూత్ర విసర్జన చేస్తే మూత్రం ఎలాంటి దుర్వాసనా రాదు. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంది. అయితే ఎవరికైనా సరే మూత్రం దుర్వాసన వస్తుందంటే.. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంటుంది. అయితే ఈ సమస్య పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. కనుక స్త్రీలు ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వారి మూత్రం దుర్వాసన వస్తుందంటే.. ఎక్కువగా మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లే కారణం అయి ఉంటాయి. ఫంగస్, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారి మూత్రం కూడా దుర్వాసన వస్తుంటుంది. అలాగే మూత్ర విసర్జన సాఫీగా జరగని వారి మూత్రం కూడా వాసన వస్తుంది.

ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసాహారం తినడం, మద్యం సేవించడం వంటి కారణాల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంటుంది. పలు సందర్భాల్లో జన్యు పరమైన వ్యాధుల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంటుంది. సాధారణంగా ఇది వంశ పారంపర్యంగా వస్తుంటుంది.

if your urine is getting bad smell then these are the reasons

నిత్యం తగినంత నీటిని తాగకపోయినా, డయాబెటిస్ ఉన్నా, కిడ్నీలలో రాళ్లు, ఇతర కిడ్నీ సమస్యలు, లివర్ వ్యాధులు ఉన్నా.. మూత్రం దుర్వాసన వస్తుంటుంది. అయితే ఎవరైనా సరే.. మూత్రం దుర్వాసన వస్తుందంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని వారు ఇచ్చే మందులను కచ్చితంగా వాడాలి. దీంతో మూత్రాశయ సమస్యలు, మూత్రం దుర్వాసన రాకుండా ఉంటాయి.

]]>
Liver Disease Symptoms : ఈ 6 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ లివ‌ర్ డ్యామేజ్ అయిందేమో చెక్ చేసుకోండి..! https://ayurvedam365.com/medical-science-knowledge/liver-damage-symptoms-you-must-look-for.html Wed, 18 Dec 2024 02:52:12 +0000 https://ayurvedam365.com/?p=62551 Liver Disease Symptoms : మ‌న శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉన్న అతి పెద్ద అవ‌య‌వాల్లో లివ‌ర్ మొద‌టి స్థానంలో ఉంటుంది. లివ‌ర్ అనేక ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ముఖ్యంగా శ‌రీరంలోని విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డం, మెట‌బాలిజం స‌రిగ్గా నిర్వ‌హించ‌డం, పోష‌కాల‌ను నిల్వ చేయ‌డం వంటి అనేక ప‌నుల‌ను లివ‌ర్ చేస్తుంది. అయితే చాలా మందికి ఉన్న ప‌లు అల‌వాట్ల కార‌ణంగా లివ‌ర్ వ్యాధులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా మ‌ద్యం సేవించ‌డం ఒక‌టి. అయితే మ‌ద్యం సేవించ‌క‌పోయినా కొంద‌రికి వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్‌, స్థూల‌కాయం, జ‌న్యుప‌రంగా లేదా ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా లివ‌ర్ వ్యాధులు వ‌స్తున్నాయి. లివ‌ర్ డ్యామేజ్ కూడా అవుతోంది.

అయితే ఇలాంటి స్థితిలో స‌త్వ‌ర‌మే స‌మ‌స్య‌ల‌ను గుర్తించాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చికిత్స టైముకు తీసుకుని లివ‌ర్‌ను కాపాడుకోవ‌చ్చు. ఇక లివ‌ర్ చెడిపోయినా లేదా లివ‌ర్ వ్యాధులు వ‌చ్చినా మ‌న‌కు శ‌రీరం కొన్ని ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. దీంతో త్వ‌ర‌గా ఆ ల‌క్ష‌ణాల‌ను ప‌సిగట్టి త్వ‌ర‌గా చికిత్స తీసుకుంటే లివ‌ర్‌ను కాపాడుకున్న వారిమ‌వుతాము. ఇక లివ‌ర్ వ్యాధి వ‌స్తే క‌నిపించే ఆ ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

liver damage symptoms you must look for

లివ‌ర్ చెడిపోయిన వారిలో లేదా లివ‌ర్ వ్యాధి వ‌చ్చిన వారిలో తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుంది, నీర‌సంగా అనిపిస్తుంది. చిన్న ప‌నిచేసినా విప‌రీతంగా అల‌సిపోతారు. కాస్త దూరం కూడా న‌డ‌వ‌లేరు. అలాగే లివ‌ర్ ఉన్న చోట వాపున‌కు గురై నొప్పి కూడా వ‌స్తుంది. దీంతోపాటు మూత్రం రంగు కూడా గోధుమ రంగులోకి మారుతుంది. అలాగే ప‌సుపు రంగులో సాధార‌ణంగా వ‌చ్చే మ‌లం మ‌ట్టి రంగులోకి మారిపోయి వ‌స్తుంది.

ఇక లివ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారికి శ‌రీరంలో ప‌లు చోట్ల వాపులు క‌నిపిస్తుంటాయి. ముఖ్యంగా పొట్ట‌, కాలి పిక్క‌లు, మ‌డ‌మ‌లు వంటి భాగాల్లో నీరు చేరి వాపులు వ‌స్తాయి. అలాగే చ‌ర్మంపై దుర‌ద‌లు వ‌స్తాయి. ముఖ్యంగా అరిచేతులు, అరికాళ్ల‌లో దుర‌ద‌గా అనిపిస్తుంటుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా క‌నిపిస్తే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకోండి. స‌మ‌స్య ఉంటే తేలిపోతుంది. దీంతో స‌రైన స‌మయంలో చికిత్స తీసుకుని లివ‌ర్‌ను కాపాడుకోవ‌చ్చు. లేదంటే ప్రాణాల మీద‌కు వ‌స్తుంది జాగ్ర‌త్త‌.

]]>
Tachycardia : మీ గుండె వేగంగా కొట్టుకుంటుంద‌ని అనుమానంగా ఉందా.. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..? https://ayurvedam365.com/medical-science-knowledge/if-you-think-your-heart-is-beating-fast-then-know-what-happens.html Tue, 17 Dec 2024 13:38:46 +0000 https://ayurvedam365.com/?p=62494 Tachycardia : మీకు మీ గుండె వేగంగా కొట్టుకుందేమోన‌ని అనుమానంగా ఉందా ? బీపీ చెక్ చేయించుకుంటే ఎక్కువ‌గా ఉందా ? మీ గుండె గ‌న‌క నిమిషానికి 100 సార్ల క‌న్నా ఎక్కువ‌గా కొట్టుకుంటే దాన్ని టాకీకార్డియా (tachycardia) అంటారు. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంది ? అంటే.. గుండె నుంచి శ‌రీరంలోని ఇత‌ర అవ‌య‌వాల‌కు ర‌క్తం స‌ర‌ఫ‌రా అయ్యేందుకు ఒక ర‌క‌మైన ఎల‌క్ట్రిక‌ల్ ఇంప‌ల్స్ (విద్యుత్ ప్ర‌వాహం) స‌హాయ ప‌డుతుంది. ఈ విద్యుత్ ప్ర‌వాహంలో ఏవైనా తేడాలు వ‌స్తే అప్పుడు గుండె అసాధార‌ణ రీతిలో వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఇలా జ‌ర‌గ‌డానికి చాలా వ‌ర‌కు మ‌నం చేసే త‌ప్పులే కార‌ణం. అవును.. మ‌నం మ‌న జీవ‌న విధానంలో చేసే త‌ప్పులే మన గుండె వేగంగా కొట్టుకోవడానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. అవేమిటంటే..

టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, చాకొలెట్ల‌లో కెఫీన్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని నిత్యం ఎక్కువ‌గా తీసుకుంటే శ‌రీరంలో కెఫీన్ మోతాదు పెరుగుతుంది. దీంతో ర‌క్తపోటు పెరుగుతుంది. ఫ‌లితంగా గుండె వేగంగా కొట్టుకుంటుంది. క‌నుక ఈ ప‌దార్థాల‌ను మోతాదులో తీసుకుంటే మంచిది. మ‌ద్యపానం, ధూమ‌పానం చేసే వారిలో కూడా గుండె అసాధార‌ణ రీతిలో వేగంగా కొట్టుకుంటుంది. ఈ అల‌వాట్లు ఉన్న‌వారికి గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. బ‌రువు త‌గ్గించే డైట్ పిల్స్‌, జ‌లుబు, ద‌గ్గు మెడిసిన్లతోపాటు కొకెయిన్ ఎక్కువ‌గా తీసుకునే వారిలోనూ ఇలాగే గుండె వేగంగా కొట్టుకుంటుంది.

if you think your heart is beating fast then know what happens

న్యుమోనియా, ఊపిరితిత్తుల్లో బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ రావ‌డం, లంగ్ క్యాన్స‌ర్ వంటి ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది. టాకీకార్డియా వ‌చ్చిన వారిలో ర‌క్త‌హీన‌త క‌నిపిస్తుంది. అలాగే శ‌రీరంలో ప‌లు భాగాల్లో ఒక్కోసారి తీవ్ర ర‌క్త స్రావం అవుతుంది. థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉంటాయి. ఈ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా క‌నిపిస్తే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే వైద్యుడిని క‌లిసి చికిత్స తీసుకోవాలి. అలాగే ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలికి మార‌డం ద్వారా కూడా గుండె వేగంగా కొట్టుకోవ‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. నిత్యం వ్యాయామం చేయ‌డం, స‌రైన స‌మ‌యానికి పౌష్టికాహారం తీసుకోవ‌డం, త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డం చేస్తే గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవచ్చు.

]]>
Metformin Tablets : మెట్ ఫార్మిన్ ట్యాబ్లెట్ల‌ను వాడుతున్న‌వారు సైడ్ ఎఫెక్ట్స్ రావొద్దంటే ఇలా చేయాలి..! https://ayurvedam365.com/medical-science-knowledge/stop-side-effects-of-metformin-like-this.html Tue, 17 Dec 2024 09:53:50 +0000 https://ayurvedam365.com/?p=62454 Metformin Tablets : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. ఈ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఒక్క‌సారి ఈ వ్యాధి బారిన ప‌డితే జీవితాంతం మందులు వాడాల్సిందే. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు వైద్యులు ఎక్కువ‌గా సూచించే మందులల్లో మెట్ ఫార్మిన్ ఒక‌టి. దీనిని టైప్ 2 డ‌యాబెటిస్ లో ఔష‌ధంగా వాడ‌తారు. ఈ టాబ్లెట్ తెలియ‌ని షుగ‌ర్ పేషెంట్స్ ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలో ఈ మెట్ ఫార్మిన్ చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. అయితే ఈ మెట్ ఫార్మిన్ ను షుగ‌ర్ తో పాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా వాడ‌తార‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. అలాగే దీనిని ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల మ‌నం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని దీని వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భ్రావాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మెట్ ఫార్మిన్ ను షుగ‌ర్ తో పాటు ఏ ఇత‌ర స‌మ‌స్య‌ల‌కు వాడ‌తారు.

అలాగే దీని వ‌ల్ల మ‌న‌కు క‌లిగే దుష్ప్ర‌భావాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మెట్ ఫార్మిన్ ను షుగ‌ర్ తో పాటు స్త్రీలల్లో వచ్చే పిసిఒడి స‌మ‌స్య‌ల‌కు కూడా ఔష‌ధంగా ఇస్తూ ఉంటారు. అలాగే కొన్ని ర‌కాల మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి కూడా ఔష‌ధంగా ఇస్తారు. అంతేకాకుండా మ‌నం ఎక్కువ కాలం పాటు అనారోగ్య స‌మస్య‌లు రాకుండా జీవించ‌డానికి, మ‌న జీవిత కాలాన్ని పెంచుకోవ‌డానికి కూడా మెట్ ఫార్మిన్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు తాజా ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేసారు. కొంద‌రు అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉండ‌డానికి షుగ‌ర్ లేన‌ప్ప‌టికి రోజూ ఒక మెట్ ఫార్మిన్ టాబ్లెట్ ను వేసుకుంటున్నార‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ మెట్ ఫార్మిన్ ను అధికంగా వాడ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తాయి. అలాగే వాంతులు, విరోచ‌నాలు, పొట్ట ఉబ్బ‌రం, నీళ్ల విరోచ‌నాలు, గ్యాస్ వంటి ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

stop side effects of metformin like this

అలాగే మెట్ ఫార్మిన్ ను వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో విట‌మిన్ బి12 లోపం కూడా వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా మెట్ ఫార్మిన్ వ‌ల్ల వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్ త‌క్కువ‌గా ఉండాలంటే దీనిని భోజ‌నం త‌రువాత తీసుకోవ‌డం మంచిది. అలాగే ఒకేసారి ఎక్కువ మోతాదు కాకుండా త‌క్కువ మోతాదు నుండి తీసుకోవ‌డం ప్రారంభించి క్ర‌మంగా ఎక్క‌వ మోతాదు వ‌ర‌కు తీసుకోవాలి. అలాగే దీనిని రోజుకు రెండుసార్లు తీసుకునే వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఈ మెట్ ఫార్మిన్ టాబెట్ల‌ను ఎక్కువ వ్య‌వ‌ధితో తీసుకోవాలి. వీటి మ‌ధ్య వ్య‌వ‌ధి ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఉద‌యం తీసుకుంటే మ‌ర‌లా సాయంత్రం తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అలాగే ఒక కంపెనీ టాబ్లెట్ ల‌ను వాడిన‌ప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ‌గా ఉంటే వారు మ‌రో కంపెనీ టాబ్లెట్ ల‌ను వాడి చూడాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ త‌గ్గే అవ‌కాశం ఉంది. ఇలా మెట్ ఫార్మిన్ ను వాడి దాని వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవ‌డానికి బ‌దులుగా చ‌క్క‌టి ఆహార నియ‌మాల‌ను, జీవ‌న‌శైలినిపాటిస్తూ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండ‌డ‌మే మంచిద‌ని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

]]>
Left Arm Pain : ఎడ‌మ చేయి నొప్పిగా ఉంటుందా.. అయితే కార‌ణాల‌ను తెలుసుకోండి..! https://ayurvedam365.com/medical-science-knowledge/if-your-left-hand-is-in-pain-then-know-this.html Sun, 15 Dec 2024 07:33:00 +0000 https://ayurvedam365.com/?p=62016 Left Arm Pain : సాధార‌ణంగా హార్ట్ ఎటాక్ వ‌చ్చే ఎవ‌రికైనా స‌రే ఎడ‌మ చేయి బాగా నొప్పిగా ఉంటుంది. భుజం నుంచి చేయి కింద వ‌ర‌కు లాగిన‌ట్టు నొప్పి వ‌స్తుంది. అలాగే ఛాతి మ‌ధ్య‌లో నొప్పి మొద‌లై పైకి వ్యాపిస్తుంది. ఇక కొంద‌రికి ఎడ‌మ వైపు ద‌వ‌డ నొప్పిగా ఉంటుంది. ఇవ‌న్నీ హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని తెలిపే ల‌క్ష‌ణాలు. అయితే ఇవి లేకుండా కేవ‌లం ఎడ‌మ చేయి నొప్పి మాత్ర‌మే ఉంటే దాన్ని చాలా మంది గుండె స‌మ‌స్య అని భావిస్తుంటారు. కానీ కింద తెలిపిన ప‌లు కార‌ణాల వ‌ల్ల కూడా కొంద‌రికి ఎల్ల‌ప్పుడూ ఎడ‌మ చేయి నొప్పిగా ఉంటుంది. మ‌రి ఆ కార‌ణాలు ఏమిటంటే..

నిద్రించే భంగిమ‌, కంప్యూట‌ర్ ఎదుట కూర్చునే భంగిమ స‌రిగ్గా లేక‌పోయినా ఎడ‌మ చేయి నొప్పిగా అనిపిస్తుంది. ఆ భంగిమ‌ను స‌రి చేసుకోవ‌డం ద్వారా ఆ నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు. శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా లేక‌పోయినా కొన్ని సార్లు ఎడ‌మ చేయి నొప్పి వస్తుంటుంది. దీన్ని త‌గ్గించుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయాలి. స‌రైన పౌష్టికాహారం తీసుకోవాలి. మ‌ద్య‌పానం, ధూమ‌పానం మానేయాలి. అలాగే కెఫీన్ ఎక్కువ‌గా ఉండే టీ, కాఫీలు అతిగా తాగ‌రాదు. నిత్యం త‌గినంత నీటిని తాగాలి. స‌మ‌యానికి నిద్ర పోవాలి. దీంతో ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు ప‌డుతుంది.

if your left hand is in pain then know this

కొన్ని సార్లు గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య వ‌ల్ల కూడా ఎడ‌మ చేయి నొప్పి వ‌స్తుంటుంది. దీన్ని నివారించేందుకు వైద్యుల వ‌ద్ద‌కు వెళ్లి చికిత్స తీసుకోవాలి. గ్యాస్‌, అసిడిటీ త‌గ్గితే కొంద‌రికి ఎడ‌మ చేయి నొప్పి కూడా త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుక‌ని ఆ స‌మ‌స్య‌కు చికిత్స తీసుకుంటే ఆటోమేటిగ్గా నొప్పి కూడా త‌గ్గుతుంది. క్యాన్స‌ర్ చికిత్సలో భాగంగా వాడే కీమో థెర‌పీ మందులు, కొలెస్ట్రాల్‌ను త‌గ్గించే స్టాటిన్ డ్ర‌గ్స్‌ను ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల కూడా కొన్ని సార్లు ఎడ‌మ చేయి నొప్పిగా అనిపిస్తుంది. అందుకు గాను వైద్యుడిని క‌లిసి స‌రైన మెడిసిన్ ఇచ్చేలా చూసుకోవాలి. దీంతో నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.

పైన తెలిపిన సూచ‌న‌ల మేర‌కు త‌గిన విధంగా స్పందిస్తే ఎడ‌మ చేయి నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు. అయితే అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకున్న‌ప్ప‌టికీ, పైన తెలిపిన స‌మ‌స్య‌లు ఏవీ లేన‌ప్ప‌టికీ ఎడ‌మ చేయి ఇంకా నొప్పిగా ఉంటే.. అప్పుడు దాన్ని క‌చ్చితంగా గుండె స‌మ‌స్య‌గా అనుమానించాలి. వెంట‌నే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి ఆ మేర‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుని అందుకు త‌గిన విధంగా చికిత్స తీసుకుంటే హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

]]>