జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు స్నానం చేయ‌వ‌చ్చా ?

సాధార‌ణంగా అధిక శాతం మంది జ్వ‌రం వ‌స్తే బ్లాంకెట్ క‌ప్పుకుని ప‌డుకుంటారు. కొద్దిపాటి చ‌లిని కూడా భ‌రించ‌లేరు. ఇక స్నానం అయితే అస‌లే చేయ‌రు. జ్వ‌రం వ‌చ్చిన ఎవ‌రైనా స‌రే స్నానం చేయ‌కూడ‌ద‌ని మ‌న‌వాళ్లు బాగా న‌మ్ముతారు. జ్వ‌రం వ‌చ్చిన వారు స్నానం చేస్తే మంచిది కాద‌ని అనుకుంటుంటారు. కానీ ఇందులో నిజం లేదు. ఎందుకంటే వైద్యులు చెబుతున్న ప్ర‌కారం అయితే.. నిజానికి జ్వ‌రం వ‌చ్చినా కూడా భేషుగ్గా స్నానం చేయ‌వ‌చ్చు. జ్వ‌రం వ‌చ్చిన వారు ఎలాంటి … Read more

రొట్టె, బ్రెడ్‌.. రెండింటిలో ఏది మంచిదో తెలుసా ?

మ‌న‌కు తినేందుకు ర‌కర‌కాల రొట్టెలు అందుబాటులో ఉన్నాయి. గోధుమ పిండి, జొన్న పిండి, రాగులు.. ఇలా భిన్న‌ర‌కాల ధాన్యాలతో త‌యారు చేసిన పిండిల‌తో రొట్టెల‌ను త‌యారు చేస్తారు. అందులో భాగంగానే ఎవ‌రైనా స‌రే త‌మ‌కు ఇష్ట‌మైన రొట్టెల‌ను తింటుంటారు. ఇక బ్రెడ్‌ను రీఫైన్ చేయ‌బ‌డిన పిండి, చ‌క్కెర వంటివి క‌లిపి త‌యారు చేస్తారు. అయితే రొట్టె, బ్రెడ్‌.. రెండింటిలో ఏది మంచిది ? దేని వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి ? అంటే.. నిస్సందేహంగా రొట్టె మంచిద‌ని చెప్ప‌వ‌చ్చు. … Read more

ఆరోగ్యంగా ఉండేందుకు ప‌ళ్ల ర‌సం లేదా పండ్లు.. రెండింటిలో ఏవి తీసుకుంటే మంచిది ?

సాధారణంగా వ్యాయామం చేసిన తర్వాత ఎవ‌రైనా స‌రే అలసిపోతారు. అటువంటి పరిస్థితిలో వారు శక్తిని పొందేందుకు ప‌ళ్ల రసం తాగడానికి ఇష్టపడతారు. ప‌ళ్ల‌ రసం తాగడం వల్ల శక్తి ల‌భిస్తుంది. తాజాద‌నం అందుతుంది. దీంతో చాలా మంది ప‌ళ్ల ర‌సాల‌ను చాలా ఆరోగ్యకరమైనవిగా, ప్రయోజనకరమైనవిగా భావిస్తారు. ప‌ళ్ల రసం, పండ్ల‌లో నిజానికి ఏవి తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పండ్ల రసాలలో చక్కెర, కేలరీలు ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. కాబట్టి అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే … Read more

కోడిగుడ్లు, పాల‌ను ఒకేసారి తీసుకోవ‌డం హానిక‌ర‌మా ? ఏం జ‌రుగుతుంది ? తెలుసుకోండి..!

కోడిగుడ్లు, పాలు.. రెండింటిలోనూ మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే పోష‌కాలు అనేకం ఉంటాయి. వీటిని సంపూర్ణ పోష‌కాహారాలుగా పిలుస్తారు. గుడ్లు, పాల‌లో మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి ఒకేసారి తీసుకోవ‌చ్చా, తీసుకుంటే మంచిదేనా, ఏమైనా దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయా ? అంటే..   ఆయుర్వేదం ప్ర‌కారం కొన్ని ర‌కాల ఆహార పదార్థాల కాంబినేష‌న్ల‌ను తీసుకోరాదు. అయితే నిజానికి కొంద‌రికి కొన్ని ఫుడ్ కాంబినేష‌న్లు ప‌డ‌వు. కొంద‌రికి ప‌డ‌తాయి. ఈ … Read more

న‌ట్స్‌ను నేరుగా అలాగే తినాలా ? వేయించి తినాలా ? ఎలా తింటే మంచిది ?

బాదంప‌ప్పు, పిస్తా, జీడిప‌ప్పు, వాల్ న‌ట్స్.. వంటి ఎన్నో ర‌కాల న‌ట్స్ మ‌న‌కు తినేందుకు అందుబాటులో ఉన్నాయి. అవ‌న్నీ ఆరోగ్య‌క‌ర‌మైన‌వే. అందువ‌ల్ల వాటిని రోజూ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. శ‌క్తి, పోషకాలు రెండూ ల‌భిస్తాయి. ఒక్కో ర‌క‌మైన న‌ట్స్ ను తిన‌డం వ‌ల్ల భిన్న ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే న‌ట్స్‌ను తినడంలో చాలా మందికి కామ‌న్‌గా ఒక సందేహం వ‌స్తుంటుంది. వాటిని నేరుగా అలాగే తినేయాలా ? లేక కొద్దిగా … Read more

ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి.. కోడిగుడ్ల‌ను ఏ స‌మ‌యంలో తింటే మంచిది ?

కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా వైద్యులు చెబుతుంటారు. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. ప్రోటీన్ల‌కు ఇవి ఉత్తమమైన‌ వనరులు అని చెప్ప‌వ‌చ్చు. వీటిని ఉడికించడం చాలా సులభం. పైగా గుడ్లు త‌క్కువ ఖ‌రీదునే క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల త‌క్కువ ఖ‌ర్చుతోనే వీటి ద్వారా పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. అందువ‌ల్ల రోజు వారీ ఆహారంలో గుడ్ల‌ను చేర్చుకోవాలి. దీంతో అనేక పోష‌కాల లోపాన్ని భ‌ర్తీ చేయ‌వ‌చ్చు. అయితే కోడిగుడ్ల‌ను తినేందుకు స‌రైన స‌మ‌యం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్ల‌ను ఉడికించేందుకు చాలా … Read more

తేనె లేదా బెల్లం.. రెండింటిలో ఏది ఆరోగ్య‌క‌ర‌మైన‌ది ? బ‌రువు త‌గ్గేందుకు ఏది బాగా ప‌నిచేస్తుంది ?

రోజూ చ‌క్కెర అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోయి అధికంగా బ‌రువు పెరుగుతారు. దీంతో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. అందువ‌ల్ల చ‌క్కెర‌కు బ‌దులుగా స‌హ‌జ‌సిద్ధ‌మైన తీపి ప‌దార్థాలైన తేనె, బెల్లంల‌ను ఉప‌యోగించాల‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే తేనె, బెల్లం రెండూ స‌హ‌జ‌సిద్ధ‌మైన‌వే అయినా.. ఈ రెండింటిలో ఏది మంచిది ? బ‌రువును త‌గ్గించేందుకు ఏది బాగా ప‌నిచేస్తుంది ? అంటే.. బెల్లంను సాంప్ర‌దాయ భార‌తీయ వంట‌కాల్లో ఎప్ప‌టి నుంచో ఉప‌యెగిస్తున్నారు. దీంతో … Read more

గ్రీన్ టీ వ‌ర్సెస్ బ్లాక్ టీ.. రెండింటిలో ఏది మంచిది ? దేన్ని తాగితే బెట‌ర్ ?

రోజూ మ‌న‌కు తాగేందుకు అనేక ర‌కాల టీ లు అంటుబాటులో ఉన్నాయి. వాటిల్లో గ్రీన్ టీ ఒక‌టి. అలాగే బ్లాక్ టీని కూడా కొంద‌రు తాగుతుంటారు. ప్ర‌త్యేకమైన తేయాకుల‌తో గ్రీన్ టీని త‌యారు చేస్తారు. బ్లాక్ టీ అంటే సాధార‌ణ టీ పొడి డికాష‌న్‌. అయితే రెండింటిలో మ‌న‌కు ఏది మంచిది ? దేన్ని తాగితే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. … Read more

నెయ్యి తింటే అస‌లు బ‌రువు పెరుగుతారా ? త‌గ్గుతారా ? ముఖ్య‌మైన విష‌యం తెలుసుకోండి..!

మ‌న‌లో చాలా మందికి నెయ్యి ప‌ట్ల అనేక అపోహలు ఉంటాయి. నెయ్యి అనారోగ్య‌క‌ర‌మ‌ని, దాన్ని తింటే బ‌రువు పెరుగుతామ‌ని, శ‌రీరంలో కొవ్వు చేరుతుంద‌ని.. చాలా మంది న‌మ్ముతుంటారు. కానీ నిజానికి అది అపోహే. ఇంట్లో త‌యారు చేసిన శుద్ధ‌మైన ఆవు నెయ్యిని తింటే బ‌రువు పెర‌గ‌రు. త‌గ్గుతారు. నెయ్యిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. కొవ్వులో క‌రిగే అనేక విట‌మిన్లు, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు నెయ్యిలో ఉంటాయి. అవ‌న్నీ బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తాయి. అందువ‌ల్ల … Read more

వైట్ రైస్ వ‌ర్సెస్ బ్రౌన్ రైస్‌.. రెండింటిలో ఏ రైస్ మంచిది ? దేనితో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

ప్ర‌స్తుత త‌రుణంలో స్థూల‌కాయం అనేది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, ఒత్తిడి, ఆందోళ‌న‌, నిద్ర‌లేమి, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌నశైలి, ఆహారపు అల‌వాట్ల‌లో మార్పులు, శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది అధికంగా బ‌రువు పెరుగుతున్నారు. అయితే రైస్‌ను తింటే అధికంగా బ‌రువు పెరుగుతార‌ని చాలా మంది అనుకుంటారు. కానీ అది అపోహ మాత్ర‌మే. నిజానికి రైస్‌ను తిన‌డం వల్ల బ‌రువు త‌గ్గుతారు. ఎందుకంటే … Read more