స్మార్ట్ ఫోన్ నిండు జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది. ఇది టెక్నాలజీ వీర విహారమా?లేక వాడే వారి విచ్చలవిడితనమో కానీ కొందరు కపుల్స్ మాత్రం దానికి బలైపోతున్నారు. ఫోటో లు , సెల్పీ ల నుండి పడకగది సీన్లను కూడా రికార్డ్ చేసుకునే దాకా వచ్చింది స్మార్ట్ ఫోన్ల ఉపయోగం. దీని కారణంగానే కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వివరాల్లోకెళితే..
కొత్తగా పెళ్ళైన జంట, చిలకాగోరింకల్లా అన్యోన్యంగా గడిపేవారు. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ ఆ దంపతులిద్దరూ తాము సన్నిహితంగా ఉన్న శృంగార దృశ్యాలను వారి స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించుకున్నారు. కానీ నెలరోజుల క్రితం వారు చేసిన ఒక ప్రయాణంలో ఆ ఫోన్ పోయింది. దీంతో ఆ ఫోన్ దొరికిన వ్యక్తి స్మార్ట్ ఫోన్ ను ఓపెన్ చేసి చూశాడు. వీడియో ఫోల్డర్ ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా అవాక్కయ్యాడు, భార్యాభర్తలు సన్నిహితంగా ఉంటూ రికార్డ్ చేసుకున్న వీడియో కనిపించింది, వెంటనే వాట్సాప్ లో తన ప్రెండ్స్ కు ఆ వీడియో సెండ్ చేశాడు, అక్కడి నుండి ఆ వీడియో పదులు, వందలు,వేలు ,లక్షల మంది చేతులు మారింది. అది కాస్త పోర్న్ సైట్స్ లో కూడా పోస్ట్ అయిపోయింది.
ఇది తెలుసుకున్న ఆ దంపతులు సిగ్గుతో చితికిపోయారు. అయినవారికి, బంధువులకు ముఖం చూపలేక విషం మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లో జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు దీనికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గతంలో జరిగిందే. కానీ ఇప్పటికీ ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పడక గది ముచ్చట్లు, మురిపాలు అక్కడి వరకే పరిమితం చేస్తే కపుల్స్ జీవితం ఇలా అర్థాంతరంగతా ముగియదు. బీ కేర్ ఫుల్, స్మార్ట్ ఫోన్లను మరీ ఎక్కువగా పర్సనల్ లైఫ్ లోకి రానివ్వకుండా చూసుకోండి!