సాధారణంగా మన హిందువులకు ఎన్నో సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు అదేవిధంగా మూఢనమ్మకాలను కూడా ఎక్కువగా నమ్ముతారు. ఇలాంటి మూఢ నమ్మకాలలో ఒకటే కాకి తంతే అపశకునం అని భావించడం. సాధారణంగా కాకి తగిలితే మనకు ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని భావిస్తారు. నిజంగానే కాకి తగిలితే ప్రమాదం జరుగుతుందా? కాకి తన్నిన వెంటనే స్నానం ఎందుకు చేయాలి ? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా కాకులు ఎన్నో ప్రదేశాలలో తిరిగి వస్తూ ఉంటాయి. కాకులు ఆహార అన్వేషణలో భాగంగా చనిపోయిన ఎలుకలు, ఇతర జంతువులను తమ గోర్లు ద్వారా పీక్కు తింటాయి. ఈ క్రమంలోనే ఎన్నో హానికర సూక్ష్మజీవులు కాకుల కాలిగోటికి అతుక్కొని ఉంటాయి. అలాంటి సమయంలోనే కాకులు వచ్చి మన పై వాలిన, తన్నిన ఆ సూక్ష్మజీవులు మన శరీరంపై అంటుకుని ఉంటాయి. తద్వారా ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తుంది కాబట్టి కాకి తన్నిన వెంటనే తలస్నానం చేయాలి అనేది మన పెద్దలు సూచించారు.
సాధారణంగా కాకి శనీశ్వరుని వాహనంగా భావిస్తారు. అందువల్ల కాకి మనపై వాలితే శని ప్రభావం మనపై ఉంటుందని, అదేవిధంగా కాకి మన ఇంటి లోపలికి వస్తే శని మన ఇంట్లో ప్రవేశించిందని భావిస్తూ ఏవేవో పూజలు చేస్తుంటారు. ఇవన్నీ కేవలం మన మూఢనమ్మకాలేనని నిజానికి సైన్స్ పరంగ కాకి మన ఇంటిలోకి వస్తే ఎన్నో రోగాల బారిన పడతాము అందువల్లే మన పెద్దవారు కాకి తగిలితే అపశకునం, తగిలిన వెంటనే స్నానం చేయాలని భావించేవారు.