ఆధ్యాత్మికం

Marriage : ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కుదరట్లేదా..? ఇలా చేస్తే.. త్వరగా పెళ్లి సెట్ అయిపోతుంది..!

Marriage : పెళ్లిళ్లు అవ్వక చాలా మంది ఈ రోజుల్లో బాధ పడుతున్నారు. పెళ్లి సంబంధాలు ఎన్ని చూసినా సరే కుదరడం లేదని, చాలామంది చింతిస్తున్నారు. మీరు కూడా పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతున్నారా..? పెళ్లి కుదిరిపోతే బాగుండు అని అనుకుంటున్నారా..? అయితే పెళ్లి అవ్వట్లేదు అని చింతించే వారు ఇలా చేస్తే చక్కటి పరిష్కారం కనబడుతుంది. కొంత మందికి త్వరగా పెళ్లి అయిపోతే కొంత మందికి ఆలస్యంగా కుదురుతుంది. చాలా మంది వివాహం కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు.

అమ్మాయిలు లేదా అబ్బాయిలు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు వారికి తగ్గ వాళ్లని ఎంచుకుంటూ ఉంటారు. పైగా కొంత మంది పెళ్లి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని అబ్బాయి ఇలా ఉండాలి, లేదా అమ్మాయి ఇలా ఉండాలి అని రిజక్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. పెళ్లి కుదరక ఇబ్బంది పడుతున్న వాళ్ళు సోమవారం నాడు ఉపవాసం ఉంటే అన్ని సమస్యలకి పరిష్కారం కనబడుతుంది.

do like this if your marriage is getting delayed

శ్రావణమాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతోమంది చూస్తూ ఉంటారు. శివుడిని ఇలా ఆరాధిస్తే పెళ్లి అయిపోయినట్టే. శ్రావణమాసం శివుడికి ఎంతో ఇష్టమైనది. ఈ శ్రావణ మాసంలో ఎనిమిది సోమవారాలు వచ్చాయి. కాబట్టి మీరు శివుడిని ప్రసన్నం చేసుకోండి. శ్రావణమాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం చేస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది.

అలానే సోమవారం నాడు శివాలయానికి వెళ్లి నియమాల ప్రకారం శివుడిని ఆరాధించండి. ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని జపిస్తే కూడా శివుడి అనుగ్రహం కలుగుతుంది. శివ పార్వతుల్ని పూజించేటప్పుడు 108 బిల్వపత్రాలను తీసుకుని పూజిస్తే కూడా చక్కటి ఫలితం కనబడుతుంది. ఇలా మీరు శివుడిని ఆరాధించడం వలన త్వరగా పెళ్లి అయిపోతుంది. శివుడిని ఆరాధించేటప్పుడు పసుపు రంగు బట్టలు వేసుకోవడం మర్చిపోకండి.

Admin

Recent Posts