ఆధ్యాత్మికం

Lord Shani Dev : శ‌నివారం లేదా అమావాస్య రోజు ఇలా చేస్తే.. అప్పుల బాధ‌లు పోతాయి..!

Lord Shani Dev : ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఉన్నవాళ్లు అయిపోవాలని అనుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని, ఐశ్వర్యం పెరగాలని కోరుకుంటారు. శనివారం నాడు, అమావాస్య రోజు ఇలా చేస్తే ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. పైగా ధనవంతులు అవ్వచ్చు. శని దేవుడు నీతివంతుడు. మనం చెడు చేస్తే, చెడు ఫలితం మనకి వస్తుంది. అదే మంచి చేస్తే, మంచి ఫలితాలు మనకి వస్తూ ఉంటాయి. అనవసరంగా ఎవరిని కూడా శని దేవుడు హింసించడు.

జ్యోతీష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే, శని దోషం ఉన్నవాళ్లు శని అమావాస్య రోజున దానధర్మాలు చేస్తే మంచిది. శని ప్రభావం ఉన్నవాళ్లు వారి లైఫ్ లో ఎన్నో సమస్యలని ఎదుర్కోవాలి. పనిలో ఆటంకాలు, ఆర్థిక బాధలు ఇలా ఏవో ఒకటి కలుగుతుంటాయి. ఇటువంటి సమస్యలను మీరు కూడా ఎదుర్కొంటున్నట్లయితే, శని అమావాస్య రోజున శని భగవానుడిని ఆరాధించడం మంచిది.

do like this on saturday or amavasya for money problems

అలానే, పలు వస్తువులను కూడా దానం చేస్తే మంచిది. ఒక గిన్నెలో నూనెని తీసుకుని, మీ మొఖాన్ని చూసి, ఆ గిన్నెతో నూనెని శని దేవుని ఆలయంలో ఉంచండి. ఇలా పెట్టడం వలన శని దేవుడు సంతోషిస్తాడు. శుక్రవారం రాత్రి నిద్ర పోయేటప్పుడు నల్ల ఉప్పు, నల్ల వ‌స్త్రంలో చుట్టి దిండు కింద లేదంటే మీ దగ్గర పెట్టుకోవాలి.

శనివారం నాడు శని దేవుని గుడిలో ఈ ఉప్పు మూటని ఇచ్చేయాలి. దీంతో, శని బాధలు పోతాయి. నల్లని యాంటీమొనిని కొని తల నుండి కాళ్ళ దాకా తొమ్మిది సార్లు తిప్పేసి, దానిని భూమిలో పాతి పెట్టండి. ఇలా చేస్తే శని ప్రభావం పోతుంది. శని బాధల నుండి బయటపడొచ్చు. జాతకంలో కనుక శని ప్రభావం ఉందని మీరు తెలుసుకుంటే, శని దేవుడిని పూజించేటప్పుడు ముఖం చూడకండి. పాదాలను మాత్రమే చూడండి.

Admin

Recent Posts