Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలని ఉంటుంది. ధన లాభం కలిగి సుఖంగా ఉండాలని అనుకుంటారు. ఎవరికి కూడా బాధలు ఉండాలని అనుకోరు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఎన్నో ఉపాయాలు ఉన్నాయి, వీటిని మీరు కనుక పాటించారంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. సంతోషంగా ఉండవచ్చు. సకల సంపదలకు అమ్మ ఆది దేవత మహాలక్ష్మి దేవి.
లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఎలాంటి సంపద కూడా కలగదు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ ధనం ఉంటుంది. దీపారాధన చేయని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. శుభ్రం లేని ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. శంఖ ధ్వని వినిపించని చోట, తులసి లేని చోట లక్ష్మీదేవి ఉండదు అని శ్రీమహావిష్ణువు చెప్పారు.
విష్ణు అర్చనలేని చోట లక్ష్మీదేవి ఉండదు. పండితులను, విద్యావేత్తలను, బ్రహ్మ వేత్తలకి గౌరవం లేని చోట లక్ష్మి ఉండదు. అతిధులకి భోజనాలు లేని చోట లక్ష్మీదేవి ఉండదని శ్రీ మహావిష్ణువు చెప్పారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నిత్యం దీపారాధన చేయాలి. విష్ణువుని పూజించాలి. శివాభిషేకం, శివార్చన జరగాలి. శ్రీహరి దివ్య చరిత్ర గుణ గానం జరిగే చోట లక్ష్మీదేవి ఉంటుంది.
సాలగ్రామం, తులసి, శంఖ ధ్వని ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. పసుపు గడపలులో, తులసి కోట లో అమ్మవారు ఉంటుంది. పచ్చని తోరణం ఉన్న చోట అమ్మవారు ఉంటుంది. అందరినీ గౌరవించే చోట అమ్మవారు ఉంటుంది. ఎప్పుడూ సుమంగళి ద్రవ్యాలతో అర్చనలతో సంతోషంతో ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కచ్చితంగా ఉంటుంది. గొడవలు వాదనలు అబద్ధాలు ఆడడం వంటివి చేసే ఆడవారి దగ్గర లక్ష్మీదేవి ఉండదు.