సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక విధమైన సమస్యలు కుటుంబ సభ్యులను వేధిస్తుంటాయి. రోజంతా పనులలో నిమగ్నమైనప్పటికీ ఇంటికి వెళ్లే సమయానికి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే ఎంతో చికాగ్గా అనిపిస్తుంది. ఈ విధంగా మన ఇంట్లో ప్రశాంతత కరువైపోవడానికి గల కారణం గ్రహదోషాలు అని చెప్పవచ్చు.
గ్రహ దోషాలు ఉండటం వల్ల కుటుంబ సభ్యులకు ఈతి బాధలు, ఆందోళనలు ఉంటాయి. ఈ విధమైనటువంటి గ్రహదోషాలు, ఈతి బాధల నుంచి బయటపడాలంటే కొబ్బరికాయతో ఈ విధంగా చేయటం వల్ల మంచి జరుగుతుందని పురోహితులు చెబుతున్నారు.
మన ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడాలంటే ముందుగా ఆవుపేడతో తయారుచేసిన ప్రమిదలో బెల్లం ముక్క వేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం ద్వారా మన ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా కొబ్బరికాయకు నల్లని దారాన్ని కట్టి దానిని పూజ గదిలో ఉంచి పూజ చేయాలి. సాయంత్రం ఆ కొబ్బరికాయను, నల్లని దారాన్ని కాల్చివేయాలి. ఈ విధంగా తొమ్మిది రోజులపాటు చేయటం వల్ల మన ఇంట్లో ఏర్పడిన దోషాలు తొలగిపోయి సుఖసంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు.