Pacha Karpuram : పచ్చ కర్పూరానికి చాలా శక్తి ఉందని చాలా మందికి తెలియదు. ఇంట్లో దుష్ట శక్తుల్ని తొలగించడానికి పచ్చ కర్పూరాన్ని వాడడం మంచిది. పచ్చ కర్పూరం నుండి సువాసన వస్తుంది. ఇంట్లో పచ్చ కర్పూరాన్ని పెట్టడం వలన లక్ష్మీ దేవి ఆ ఇంట ఉంటుంది. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ వుంటారు. అలాంటి వారు ఈ విధంగా పచ్చకర్పూరంని ఉపయోగిస్తే మంచిది. లక్ష్మీ దేవి పటం ముందు గాజు పాత్రలో నీటిని పోసి పచ్చ కర్పూరాన్ని అందులో వేసి, పసుపుని కొంచెం వేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
ఆ నీటిని ప్రతి రోజు కానీ రెండు రోజులకు ఒక సారి కానీ మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సంపదని ఆకర్షించే శక్తి పచ్చ కర్పూరానికి ఉంది. పచ్చ కర్పూరంని ఒక పసుపు వస్త్రంలో మూటలా కట్టుకుని కుబేర స్థానంలో ఉంచి, ధూపం వేస్తూ ఉంటే ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. కొద్దిగా పచ్చ కర్పూరాన్ని తీసి, ఒక పేపర్లో మడత పెట్టి పర్సులో పెట్టుకుంటే ధన లాభం కలుగుతుంది. ఆర్థిక బాధలు ఏమీ ఉండవు.
ధన నష్టం వంటి సమస్యలు కూడా ఉండవు. ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కూడా పచ్చ కర్పూరాన్ని వాడడం మంచిది. వ్యాపారవేత్తలు వ్యాపారం బాగా సాగాలంటే షాపు ముందు పచ్చ కర్పూరాన్ని పెట్టుకుంటే మంచిది. బీరువాలో పచ్చ కర్పూరం పెడితే ధనాకర్షణ కలుగుతుంది. ఇలా పచ్చ కర్పూరం వలన అనేక లాభాలని మనం పొందడానికి అవుతుంది.
పచ్చ కర్పూరం వలన ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. పచ్చ కర్పూరం వలన ధనాకర్షణ కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఇంట్లో పచ్చ కర్పూరాన్ని పెట్టండి. సమస్యల నుండి బయట పడొచ్చు. ఆనందంగా జీవించొచ్చు.