సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు నవగ్రహాలు కనిపిస్తాయి. అయితే చాలా మంది వారి జాతకంలో గ్రహదోషాలు ఉండటం వల్ల నవగ్రహ పూజ చేయడం చూస్తుంటాము. ఈ విధంగా నవగ్రహాల పూజ చేయటం వల్ల దోషపరిహారం కలిగి వారి జీవితం ఎంతో సుఖంగా ఉంటుందని భావిస్తారు. అదేవిధంగా చాలామంది నవగ్రహాలకు పూజించడానికి వెనుకడుగు వేస్తారు. నవగ్రహాలలో శనీశ్వరుడు ఉంటాడు కనుక శని ప్రభావం మనపై పడుతుందని భావించిన చాలామంది నవగ్రహాలకు పూజ చేశారు. అలాగే మరికొందరు నవగ్రహాలకు ఏ విధంగా పూజ చేయాలి.. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియక నవగ్రహాల పూజ చేయరు. మరి నవగ్రహాల పూజ ఎలా చేయాలి నవగ్రహాల చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నవగ్రహాల ప్రదక్షిణ చేయడానికి మంటపంలోనికి వెళ్లేటప్పుడు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి చంద్రుడి వైపు నుంచి కుడివైపుకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. ఇలా తొమ్మిది ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఎడమవైపు అంటే బుదుడు నుంచి రాహు కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయాలి.ఇలా నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి.
నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు పొరపాటున కూడా విగ్రహాలను తాకి ప్రదక్షిణలు చేయకూడదు. ప్రదక్షిణ చేసే సమయంలో ఒక్కొక్క గ్రహం పేరు స్మరిస్తూ ప్రదక్షిణ చేయాలి. నవగ్రహాల పూజ తర్వాత నవగ్రహాలకు వీపు చూపించకుండ వెనక్కి వస్తూ బయటకు రావాలి.అయితే నవగ్రహాలను దర్శించే వారు ముందుగా ఆలయంలో ఉన్నటువంటి మూలవిరాట్ విగ్రహాన్ని దర్శనం చేసుకున్న తరువాత మాత్రమే నవగ్రహాల దర్శనం చేయాలి. నవగ్రహాల దర్శనం అనంతరం ఇంటికి వెళ్లడం వల్ల ఈ నవగ్రహ పూజ ఫలితం మనకు కలుగుతుంది.