Items : మనిషికి దాన గుణం ఉండాలని పెద్దలు చెబుతారు. ధనం, ఆహారం, దుస్తులు.. ఇలా వస్తువులు ఏవైనా దానం చేస్తే దాంతో ఎంతో పుణ్యం వస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కేవలం హిందూ మతంలోనే కాదు, ఏ మతమైనా ప్రతి మనిషి దాన గుణాన్ని, ఇతరుల పట్ల జాలిని, కరుణను, మానవతను కలిగి ఉండాలనే చెబుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది తమకు తోచినంతలో దానం చేస్తుంటారు. అయితే మీకు తెలుసా..? ఏ వస్తువునైనా దానం చేయవచ్చు కానీ, ఇప్పుడు మేం చెప్పబోయే వస్తువులను మాత్రం అస్సలు ఎవరూ, ఎప్పటికీ దానం చేయవద్దట. అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కత్తులు, సూదులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను ఎవరూ దానం చేయరాదు. అలా చేసిన వారిని దురదృష్టం వెంటాడుతుందట. ఏది చేసినా అస్సలు కలసి రాదట. దీనికి తోడు దంపతుల మధ్య కలహాలు వస్తాయట. అస్సలు మంచి జరగదట. పాడైపోయిన ఆహారం దానం ఇవ్వరాదు. అలా ఇచ్చిన వారు కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందట. ఉన్న డబ్బు అంతా పోగొట్టుకుంటారట. డబ్బు వచ్చినా అస్సలు నిలవదట.
పగిలిపోయిన వస్తువులు, చిరిగిన దుస్తులను ఎవరికీ దానం ఇవ్వరాదు. అలా చేస్తే అదృష్టం కలసి రాదట. ఏం చేసినా చెడే జరుగుతుందట. అసలు అలాంటి వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదట. వెంటనే పారేయాలట. చీపురును ఇతరులకు దానం చేయరాదు. ఇవ్వరాదు. అలా ఇచ్చిన వారి ఇంట్లో లక్ష్మి నిలవదట. డబ్బు ఇట్టే ఖర్చవుతుందట. వచ్చినా అస్సలు నిలవదట. ప్లాస్టిక్ వస్తువులను దానం ఇవ్వరాదు. ఇతరులకు కూడా బదులుగా వాడుకునేందుకు ఇవ్వరాదు. అలా ఇచ్చిన వారికి మంచి జరగదట. కెరీర్ పరంగా అన్నీ సమస్యలే ఎదురవుతాయట. కనుక ఈ వస్తువులను ఎవరూ దానం చేయకుండా ఉంటే మంచిది. లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు.