Friday Mistakes : మనం చేసే తప్పుల వల్ల మనం ఎంతగానో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. తెలిసి చేసినా తెలీక చేసినా ఆ ప్రభావం మన మీద పడుతుంది. అయితే శుక్రవారం నాడు ఈ తప్పుల్ని అస్సలు చేయకండి. శుక్రవారం నాడు గుమ్మాన్ని శుభ్రం చేయకుండా ఉంచకూడదు. శుక్రవారం నాడు గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. శుక్రవారం నాడు తలలో పేలు ని అస్సలు చూసుకోకూడదు.
శుక్రవారం నాడు నల్లని బట్టలు వేసుకోవడం కూడా అస్సలు మంచిది కాదు. శుక్రవారం నాడు మెడలో తాళిని అసలు తీయకూడదు. ఎవరైనా పూలని ఇస్తే శుక్రవారం నాడు కాదనకుండా తీసుకోవాలి. అలానే గాజులని కూడా కాదనకుండా తీసుకోవాలి. శుక్రవారం నాడు ప్లాస్టిక్ గాజులని అసలు వేసుకోకూడదు. శుక్రవారం నాడు అస్సలు మాంసాహారాన్ని కూడా తీసుకోకూడదు.
శుక్రవారం నాడు ఎవరికి డబ్బులు కూడా ఇవ్వకూడదు. పాలు, పెరుగు, చింతపండు, ఉప్పు, కారం వంటివి శుక్రవారం నాడు ఎవరికి ఇవ్వకూడదు. ఈ పొరపాటు చేస్తున్నట్లయితే అసలు చేయకండి. స్త్రీలు శుక్రవారం నాడు అబద్ధం చెప్పకూడదు. శుక్రవారం అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం రెండూ మంచిది కాదు.
శుక్రవారం నాడు ఎప్పుడూ ఎవరికీ ధాన్యం కూడా ఇవ్వకండి శుక్రవారం నాడు ఈశాన్యంలో చీపురు పెట్టకండి. శుక్రవారం నాడు పురుషులు మహిళల చేత కంటతడి పెట్టించకూడదు. మహిళలు కంటతడి పెట్టకూడదు. అలానే అప్పు ని ఎవరికి ఇవ్వకూడదు. చేతికి ఉన్న గాజులని శుక్రవారం నాడు అసలు తీయకూడదు. శుక్రవారం నాడు పూజ మందిరాన్ని శుభ్రం చేయడం కూడా మంచిది కాదు. అలానే శుక్రవారం నాడు ఎవరికి పాత సామాన్లు ఇవ్వకండి.