Pooja Room : ఇష్ట దైవానికి తరచూ పూజలు చేసే ఎవరైనా సరే తమ ఇంట్లో పూజ గదిని లేదా మందిరాన్ని కచ్చితంగా పెట్టుకుంటారు. కొందరు రోజూ పూజలు చేస్తారు. కొందరు మాత్రం వారంలో నిర్దిష్టమైన రోజుల్లో మాత్రమే పూజలు చేస్తుంటారు. అయితే ఎలా చేసినా సరే పూజ గది లేదా మందిరం విషయంలో తప్పనిసరిగా కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పూజ గదిలో పెట్టే కొన్ని విగ్రహాలు లేదా ఫొటోల విషయంలో మాత్రం తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. లేదంటే అరిష్టం కలుగుతుంది. ఇక ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పూజ గదిలో కొన్ని విగ్రహాలు, ఫొటోలను ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. పూజ గదిలో శాస్త్రాలలో చెప్పే ఫొటోలు, విగ్రహాలను మాత్రమే పెట్టాలని అంటున్నారు. లేదంటే ప్రతికూల ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పూజ గదిలో ఎట్టి పరిస్థితిలోనూ శనీశ్వరుని విగ్రహం లేదా ఫొటోలను పెట్టరాదు. నవగ్రహాల ఫొటోలు, విగ్రహాలను అసలు పూజ గదిలో ఉంచరాదు. లేదంటే అంతా అరిష్టమే సంభవిస్తుంది.
పూజ గదిలో నటరాజ స్వామి ఫొటోను లేదా విగ్రహాన్ని, కోపంతో ఉన్న దేవుళ్లు లేదా దేవతల విగ్రహాలు, ఫొటోలను, కాళికా దేవి ఫొటోలు, విగ్రహాలను ఉంచరాదు. అలాగే శివుడి రుద్ర తాండవం చేసే ఫొటోలు, విగ్రహాలు, పాతబడినవి, విరిగిపోయినవి, చిరిగిపోయిన.. ఫొటోలు, విగ్రహాలను ఎట్టి పరిస్థితిలోనూ పూజ గదిలో ఉంచరాదు. అలా చేస్తే అశుభం కలుగుతుందని.. అన్నీ సమస్యలే వస్తాయని హెచ్చరిస్తున్నారు. కనుక పూజ గదిలో ఉంచే విగ్రహాలు, ఫొటోల విషయంలో తప్పకుంగా జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే కష్టాలను కోరి తెచ్చుకున్న వారు అవుతారు.