ఆధ్యాత్మికం

పరమేశ్వరుడి పూజలో ఈ వస్తువులను పొరపాటున కూడా ఉపయోగించకూడదు..!

సాధారణంగా హిందువులు పరమేశ్వరుడిని పెద్దఎత్తున పూజిస్తారు. ఈ క్రమంలోనే పరమశివుడికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ఈ విధంగా స్వామి వారికి పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండి మనకు మంచి కలుగుతుందని భావిస్తాము. అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడికి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని వస్తువులను పూజలో ఉపయోగించకూడదు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

శివుడిని త్రినేత్రుడు అని కూడా పిలుస్తారు. మూడవ కన్ను స్వామి వారికి మొదటి పై ఉంటుంది. కనుక ఆ కంటికి అడ్డుగా మనం సింధూరంతో బొట్టు పెట్టకూడదు. కనుక శివుని పూజలో కుంకం వాడకూడదు. అదే విధంగా శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తాడు. లింగం పురుషత్వానికి ప్రతీక కనుక పరమ శివుడి పూజలో పసుపును ఉపయోగించకూడదు. పసుపును ఎక్కువగా స్త్రీలు ఉపయోగిస్తారు కనుక శివుడి పూజలో పసుపు వాడకూడదు.

do not put these items of lord shiva on floor

హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ క్రమంలోనే చాలా ఆలయాలకు వెళ్ళినప్పుడు తులసిమాలను తీసుకువెళుతుంటారు. కానీ పరమేశ్వరుడి పూజలో తులసి ఆకులను ఎలాంటి పరిస్థితులలో కూడా ఉపయోగించకూడదు. కేవలం బిల్వ దళాలను మాత్రమే ఉపయోగించాలి. అదేవిధంగా శంఖంలో నీటిని పోసుకుని శివుడికి అభిషేకం చేయకూడదు. ఈ విధంగా పరమ శివుడికి పూజ చేసే సమయంలో ఈ వస్తువులను ఎలాంటి పరిస్థితులలో వాడకూడదని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts