ఆధ్యాత్మికం

ఎన్నో ఏళ్లు వ‌చ్చినా వివాహం ఇంకా కావ‌డం లేదా ? అయితే ఇలా చేయండి..!

ఏ వ‌య‌స్సులో జ‌ర‌గాల్సిన శుభ‌కార్యం ఆ వ‌య‌స్సులో జ‌రిగేతేనే ఎవ‌రికైనా భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని.. లేదంటే క‌ష్టాల పాలు కావ‌ల్సి వ‌స్తుంద‌ని.. పెద్ద‌లు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రికి అన్ని అర్హ‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ అనేక కార‌ణాల వ‌ల్ల పెళ్లిళ్లు జ‌ర‌గ‌డం లేదు. అయితే అలాంటి వారు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. మంగ‌ళ‌వారం నాడు కింద చెప్పిన విధంగా చేస్తే త‌ప్ప‌క వివాహం అవుతుంది. జాత‌కంలో ఉండే దోషాలు పోతాయి. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఎన్ని ఏళ్ల వ‌య‌స్సు వచ్చినా వివాహం కావడం లేదని బాధపడేవారు ఆంజనేయ స్వామిని పూజించాలి. ప్రతి మంగళవారం 108 తమలపాకులతో ఆయనకు పూజ చేయాలి. ఇలా 8 మంగళవారాల పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఫ‌లితంగా త్వరగా వివాహం అవుతుంది. శని దోషం కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది.. అనుకున్న వారు కూడా ఇలా చేయ‌వ‌చ్చు. వారు తమలపాకుల్లో తేనె పోసి అనంతరం వాటిని చీమలకు ఆహారంగా పెట్టాలి. దీంతో దోష ప‌రిహారం అవుతుంది.

do pooja to hanuman to get married

ఇక పూజ చేసే స‌మ‌యంలో.. దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి సర్వసౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయినీ.. అనే మంత్రాన్ని ప‌ఠించాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు ప‌ఠించాలి. దీంతో దోషాలు తొల‌గిపోతాయి. ఫ‌లితంగా వివాహం త్వ‌ర‌గా అవుతుంది. వివాహంలో జాత‌క రీత్యా దోషాలు ఉన్నవారు లేదా శ‌నిదోషం ఉన్న‌వారు ఇలా చేయ‌డం వ‌ల్ల దోషాలు తొల‌గిపోతాయి. త్వ‌ర‌గా వివాహం జ‌రుగుతుంది. అలాగే సుఖ సంతోషాల‌తో దంప‌తులు అన్యోన్యంగా ఉంటారు.

Admin

Recent Posts