ఆధ్యాత్మికం

సూర్య భ‌గ‌వానుడి అనుగ్ర‌హం ఇలా పొందితే.. స‌క‌ల రోగాలు పోతాయి..

సూర్యుడు స‌మ‌స్త జీవ‌కోటికి కాంతిని, శ‌క్తిని అందించే ప్ర‌దాత‌. సూర్యుని కిర‌ణాలు భూమిపై ప‌డి ఎన్నో కోట్ల జీవ‌రాశుల‌కు మ‌నుగ‌డ‌నిస్తున్నాయి. అలాంటి సూర్యుడు లేక‌పోతే మ‌న‌కు ఆహారం ఉండ‌దు. భూమిపై మ‌నిషి స‌హా ఏ జీవి కూడా బ‌త‌క‌లేదు. ఇక జ్యోతిష్య‌శాస్త్రం ప‌రంగా కూడా సూర్యుడికి ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు. 9 గ్ర‌హాల్లో సూర్య గ్ర‌హం కూడా ఒక‌టి. ఇత‌ర గ్ర‌హాల మాదిరిగానే సూర్య భ‌గ‌వానున్ని కూడా పూజించాలి. దీంతో సూర్యుడి అనుగ్ర‌హం ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో అనేక ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే కొంద‌రికి ర‌వి దోషం ఉంటుంది. దీన్నే సూర్య దోషం అంటారు. అలాంటి వారు కూడా కింద చెప్పిన విధంగా చేస్తే స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దోషం పోతుంది. అందుకు ఏం చేయాలంటే..

సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం క‌చ్చితంగా ఉపవాసం ఉండాలి. అలాగే శాకాహారం మాత్ర‌మే తినాలి. మాంసాహారం ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌రాదు. ఇక కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుడిని ఆరాధిస్తే ఎంతో మేలు జ‌రుగుతుంది. సూర్యగ్రహ ఆరాధన వల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతోపాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది. ఉపవాసం ఉన్న రోజు తినే ఆహారంలో ఉప్పు, నూనె ఉండకూడదు. సూర్యుడికి అరుణం పారాయణ చేసిన తరువాత ఆహారం తీసుకుంటారు. సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు కెంపును ధరించాలి. గోధుమలు, ఎర్రధాన్యం, బెల్లం, బంగారం, రాగి దానమివ్వాలి. దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం. ఉపవాసంతో దానమిస్తే ఇంకా ఎక్కువ ఫ‌లితం వ‌స్తుంది.

do pooja to lord surya like this for health

ఇక పైవాటిని ఆచరించడానికి ఇబ్బందులు ఉంటే మొదట భక్తి ,శ్రద్ధతో నవగ్రహాలలో సూర్యుని ముందు నిలబడి.. స్వామి, నా సమస్యలు పరిష్కారం అయితే నేను విధివిధానం ప్రకారం పూజ చేసుకుంటాను అని మొక్కుకోవాలి. సూర్యునికి సంబంధించి జపాకుసుమ సంకాశం.. అనే శ్లోకాన్ని లేదా ఓం నమో భాస్కరాయనమః లేదా ఓం నమో సూర్యనారాయణాయనమః అనే నామాన్ని భక్తి శ్రద్దల‌తో కనీసం 108కి తగ్గకుండా పారాయణం చేయాలి. ఎర్రనిపూలు, గోధుమలను సూర్యునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా కనీసం 7 వారాల పాటు చేస్తే తప్పక మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంగా ఉండాలనుకువారు ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే తెల్ల‌వారు జామునే స్నానం పూర్తి చేసుకుని సూర్యనమస్కారాలు చేస్తే ఎటువంటి రోగాలైనా పారిపోతాయి. అంతేకాదు.. పిల్లలకు అయితే జ్ఞాపకశక్తి చాలా వేగంగా పెరుగుతుంది. క‌నుక సూర్య భ‌గ‌వానున్ని ఆరాధించాలి. దీంతో స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌డంతోపాటు ఆరోగ్యం కూడా ల‌భిస్తుంది.

Admin

Recent Posts