Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడు చ‌నిపోయిన సంవ‌త్స‌రం, తేదీ, స‌మ‌యం ఏంటో తెలుసా..?

Admin by Admin
March 22, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

రాముడు.. కృష్ణుడు ఇలా దశావతారాల్లో అత్యంత ప్రసిద్ధినొందిన అవతారమూర్తులు. వారిలో శ్రీకృష్ణుడు సంపూర్ణ అవతారంగా చెప్తారు. కృష్ణ జననం అంటే కృష్ణాష్టమి అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఎప్పుడు మరణించాడు. ఆ తిథి ఏమిటి. ఎన్నేండ్లకు మరణం పొందాడు వంటి విషయాలు చాలామందికి తెలియవు. వాటి గురించి పండితుల చెప్పిన విషయాలు పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. మహాభారత సంగ్రామాన్ని నిర్వర్తించిన సారథి. కలియుగానికి స్వాగతం పలికేందుకు.. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రావణమాసంలో ద్వాపరయుగాన, బహుళ పక్షం రోహిణీ నక్షత్రం అష్టమి తిథినాడు రెండోఝాము వేళ చెరసాలలో దేవకీదేవి అష్టమ గర్భాన శ్రీకృష్ణపరమాత్మ అవతార పురుషుడిగా పుట్టాడు. ఆయన పుట్టుక దుష్టశిక్షణార్థం కోసం జరిగింది.

అందుకే రాక్షసులను, తన మేనమామ అయిన కంసుడిని కూడా చంపుతాడు. ఆపై మహాభారత సంగ్రామంలో దుష్టులను శిక్షిస్తాడు. ఇలా కారణ జన్ముడైన శ్రీకృష్ణుడు అవతార పురుషుడిగా 120 ఏళ్లపాటు జీవించాడని పురాణాలు చెప్తున్నాయి. మహాభారత యుద్ధం ముగిసే సమయానికి శ్రీకృష్ణుడి వయస్సు 89 సంవత్సరాలని మత్స్య పురాణం చెప్తోంది. దీనిప్రకారం ప్రతీ ఏడు చైత్రమాసం తొలిరోజును కృష్ణ నిర్యాణ దినంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో సోమనాథ్‌ ట్రస్ట్‌ తొలిసారిగా 2009 ఏప్రిల్‌ 9న కృష్ణ నిర్యాణ దినంగా పాటించింది.కృష్ణుడు అవతార పురుషుడు కావడంతో.. నవగ్రహాల మహాదశకాలాన్ని జయించి జీవించాడని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.

do you know on which date lord sri krishna died

సాధారణంగా జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల మహాదశల కాలం 120 సంవత్సరాలు. కేతు దశ- ఏడు సంవత్సరాలు, శుక్ర దశ- 20 సంవత్సరాలు, సూర్య దశ- ఆరు సంవత్సరాలు, చంద్ర దశ- 10 సంవత్సరాలు, కుజ దశ – ఏడు సంవత్సరాలు, రాహు దశ- 18 సంవత్సరాలు, బుధ దశ -17 సంవత్సరాలు, గురు- 16 సంవత్సరాలు, శని -19 సంవత్సరాలు. ఇలా నవ గ్రహాల దశాకాల ప్రభావాన్ని జయించడం మానవునికి అసాధ్యం. అయితే శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కావడంతో 120 ఏళ్లకు పైగా జీవించాడు.

శ్రీకృష్ణుడు 120 సంవత్సరాల, ఏడు నెలల, ఆరు రోజులు జీవించాడని పురాణాలు చెప్తున్నాయి. 3012 బీసీ ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 2.27 నిమిషాల 30 సెకన్లకు శ్రీకృష్ణుడు నిర్యాణం చెందినట్లు విష్ణుపురాణం చెప్తోంది. మహాభారత సంగ్రామం ముగిసిన 36 సంవత్సరాల తర్వాత ద్వారకకు వెళ్ళిన శ్రీకృష్ణుడు ఆపై ఎవ్వరికీ కనిపించలేదు.

Tags: Lord Sri Krishna
Previous Post

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం మరోసారి రుజువయింది! ఈసారి ఎక్కడ ఏమయిందంటే?

Next Post

విష్ణు స‌హ‌స్ర నామాల‌ను రోజూ చ‌దివితే.. బీపీ, షుగ‌ర్ ఉన్నా కూడా పోతాయ‌ట‌..!

Related Posts

ఆధ్యాత్మికం

శివుడి జ‌న్మ ర‌హ‌స్యం ఏమిటో మీకు తెలుసా..?

July 12, 2025
ఆధ్యాత్మికం

ఏయే దోషాల‌కు ఎలాంటి పూజ‌లు చేయించుకోవాలంటే..?

July 12, 2025
mythology

క‌ర్ణుడి నుంచి మ‌నం నేర్చుకోవాల్సిన గొప్ప విష‌యాలు ఇవే..!

July 12, 2025
హెల్త్ టిప్స్

కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడ‌దా..? కూర్చుంటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 12, 2025
technology

రాత్రంతా ఫోన్ చార్జింగ్ పెట్టి ఉంచితే ఏమ‌వుతుందో తెలుసా..?

July 12, 2025
హెల్త్ టిప్స్

క‌ర్పూరం బిళ్లను బ్యాగ్‌లో చుట్టి మెడ‌లో వేసుకుని నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.