ఆధ్యాత్మికం

ఏడు వారాల నగలు అంటే ఏమిటో మీకు తెలుసా..?

పూర్వం ఏడు వారాల నగలు ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఏడువారాల నగల గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఈనాడు కూడా వాటి గురించి తెలుసుకోవడం ఆస‌క్తికరమే! మన పూర్వీకులు గ్రహాల అనుగ్రహము కోసము, ఆరోగ్యరీత్య స్త్రీ పురుషులు బంగారు నగలను ధరించెడివారు. వారము రోజులు అనగ ఆదివారము మొదలు శనివారము వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణముల‌ను ధరించేవారు. వీటినే ఏడు వారాల నగలు అందురు. గ్రహాలకు అనుకూలముగా కంఠహారములు, గాజులు, కమ్ములు, ముక్కుపుడకలు, పాపిటబిల్ల, దండెకడేము (ఈనాటి వంకీ), ఉంగరాలు మొదలగు ఆభరణాల‌ను ధరించేవారు.

ఏ రోజున ఏయే నగలు ధరించవలెనో ఈ విధముగా తెలియజేయబడినది. ఆదివారము: సూర్యుని కోసము కెంపుల కమ్మలు, హారాలు మొదలగునవి ధ‌రించాలి. సోమవారము: చంద్రునికోసము ముత్యాలహారాలు, గాజులు మొదలగునవి ధ‌రించాలి. మంగళవారము: కుజునికోసము పగడాల దండలు, ఉంగరాలు మొదలగునవి ధ‌రించాలి.

do you know what is the meaning of 7 varala nagalu

బుధవారము: బుధునికోసము పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి, గురువారము: బృహస్పతి కోసము పుష్యరాగము కమ్ములు, ఉంగరాలు మొదలగునవి, శుక్రవారము: శుక్రుని కోసము వజ్రాల హారాలు, ముక్కుపుడక మొదలగునవి, శనివారము: శనికోసము నీలమణి మణిహారాలు మొదలగునవి ధ‌రించాలి.

Admin

Recent Posts