ఆధ్యాత్మికం

Lord Shiva : ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు..? ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

Lord Shiva : చాలా మంది శివుడిని ఆరాధిస్తారు. ప్రత్యేకించి సోమవారం నాడు శివుడికి పూజలు చేస్తూ ఉంటారు. నేటికీ మన దేశంలో చాలా చోట్ల శివాలయాలు ఉన్నాయి. వేదాల‌లో శివుడిని రుద్రుడిగా చెప్పారు. పరమశివుడి ఆకృతిలో ఒక్కో దానికి కూడా ఒక్కో అర్థం ఉంటుంది. శివుడి త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. శివుడి శిరస్సుకి అలంకరించిన చంద్రవంక మనో నిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. ఢ‌మరుకం అయితే బ్రహ్మస్వరూపం.

శివుడి దేహం మీద ఉండే సర్పాలు భగవంతుని జీవాత్మలు గాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని వదిలిపెట్టమని సూచిస్తాయి. అయితే పరమశివుడు పులి చర్మాన్ని కూడా ధరిస్తాడు. పులి చర్మాన్ని ఎందుకు పరమశివుడు ధరిస్తాడు అనే దాని వెనుక కారణం చాలా మందికి తెలీదు. మరి ఎందుకు పరమశివుడు పులి చర్మాన్ని ధరిస్తాడు అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. శివుడు శ్మ‌శానంలో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఆయన వెళ్తుండగా మునికాంతలు ఆయనని చూసి, చూపు తిప్పుకోలేకపోయారు. ఆయనని చూడాలని ముని కాంత‌లలో కాంక్ష పెరిగింది.

do you know why lord shiva wears tiger skin

ఆయననే తలుచుకుంటూ ఉంటారు. హఠాత్తుగా త‌మ భార్యల్లో ఇలాంటి మార్పు వచ్చిందని మునులు వెతుకుతుండగా పరమశివుడిని చూడగానే సమాధానం దొరుకుతుంది. అయితే ఆ దిగంబరుడు సదా శివుడు అని మర్చిపోయి, సంహరించడానికి ఒక ప్లాన్ వేసారు. మునులు స్వామి నడిచే దారిలో ఒక గుంతను తవ్వారు. అయితే ఆ గుంత‌ దగ్గరికి శివుడు రాగానే తపఃశక్తితో వారు ఒక పులిని సృష్టించి శివుడి మీదకి ఉసిగొల్పారు.

శివుడు సునాయసంగా పులిని సంహరించాడు. మునులు ఎందుకు ఇలా చేశారు అనే దాని వెనక అర్థం తెలుసుకొని, ఆ పులి తోలుని కప్పుకున్నాడు శివుడు. అది చూసి మునులు శివుడు శక్తివంతుడు అని తెలుసుకుని, శివుడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగారు. ఇలా పులి చర్మాన్ని అప్పటి నుండి శివుడు ధరిస్తున్నాడు.

Share
Admin

Recent Posts