Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

శ్రీ మ‌హావిష్ణువు మ‌త్స్యావ‌తారం ఎందుకు ధ‌రించాడో తెలుసా..?

Admin by Admin
March 25, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నారాయణుడి దశావతారాలు అందరికీ తెలుసు. ప్రతి అవతారం వెనుక‌ విశేష రహస్యాలు ఉన్నాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్ధము భగవంతుడు అనేక అవతారాలు దాల్చుతాడు. ఆ అవతారాల్లోకెల్లా, దశావతారాలు చాలా ప్రముఖ్యాన్ని పొందాయి. ఆ పదింటిలోనూ మత్స్యావతారానికి బహుదా విశేషత్వం ఉంది. ఆది అంటే మొట్టమొదటి అవతారమే మత్స్యావతారం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు. వీరిలో విశ్వరచన అంతా బ్రహ్మదేవుడు చేస్తాడు. సకల విజ్ఞానానికి విశ్వసృష్టికి ఆయనే మూల పురుషుడు. పూర్వం శ్రీహరి యోగనిద్రలో ఉన్న సమయంలో చేతిలోని శంఖము జారి ప్రళయ జలాల్లో పడి పోయింది.

ఆ శంఖం నుండి ఒక రాక్షసుడు జన్మించాడు. అతడే శంఖాసురుడు. శంఖా సురుడికి సోమకుడు అని పేరు కూడా ఉంది. పెద్ద శరీరం కలిగిన సోమకుడు అని పేరు కూడా ఉంది. పెద్ద శరీరం కలిగిన సోమకుడు ఆకలి బాధతో అరుస్తూ వివిధ చోట్ల వెదుకుతూ చివరకు బ్రహ్మదేవుడిని సమీపానికి వచ్చి బ్రహ్మనే మింగే ప్రయత్నం చేయసాగాడు. దీని నుంచి బ్రహ్మ తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఆయన తొడపై ఉన్న వేదకోశము కాస్తా కిందపడింది. వెంటనే ఆ వేదాన్ని సోమకుడు సముద్రము అడుగుకు తీసుకు వెళ్లాడు. మనలో కూడా జ్ఞానం ఉంది. కాని మనం విషయాశక్తుల మైనప్పుడు ఆజ్ఞానం మరుగునపడింది. కాని మనం విషయా శక్తులమైనప్పుడు ఆ జ్ఞానం మరుగునప డుతుంది. ఒక్కోసారి తెలిసి కూడా ఏమిటో చేసే సాము దీన్ని, అని చేసిన తరువాత పని గురించి చింత మనకు కలుగుతుంటుంది. ఎప్పుడయితే మానవుడు అప్రమత్తంగా ఉండడో మాయ అనే రాక్షసుడు మన జ్ఞానాన్ని మరుగున పరుస్తాడు. దాని వలన విచక్షణా శక్తిని కోల్పోవడం జరుగుతుంటుంది.

do you know why lord vishnu came as matsyavatara

సృష్టం చేయడానికి ఆధారమైన వేదకోశము, రాక్షసుడు తీసుకుని పోవడంతో బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లి విషయంవివరించాడు. వేదములు లేకపోతే సృష్టి చేయడం సాధ్యం కాదని కావడం లేదని చెప్పాడు. ఎప్పుడయితే మన జ్ఞానం మాయ చేతి చిక్కుతుందో మనం భగ వంతుని ఆశ్రయిస్తే మనకు తిరిగి భగవదను గ్రహం వలన జ్ఞానం మాయ నుంచి బయటకు వస్తుంది. అని దీని వలన మనకు తెలుస్తుంది. శ్రీమహావిష్ణువు మత్స్యావతారమును ధరించి చక్రము, గదలను ఆయుధాలుగా ధరించి సముద్రంలోకి ప్రవేశించాడు. దినదినానికి శరీరం పెరుగుతూ ఉండగా రాక్షసుడిని వెదకసాగాడు. సోమకుడు మత్స్యావతారంలోని శ్రీ మహావిష్ణు వుని చూసి తనకు ఆహారం దొరికిందని సంతోషంచి శ్రీహరిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన శ్రీమన్నారాయణుడు నీవు మూర్ఖుడవు. నీవు జన్మిస్తూనే నా శంఖం ను, బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదములను మింగి తివి. వాటిని నాకు ఇచ్చి వేయుము. నిన్ను క్షమిం చి వదిలివేస్తాను. లేదా నిన్ను సంహరిస్తాను అని పలికాడు. నీవు ఎవరు?నీరూపు వింతగా ఉంది.

నీ చేతులలో ఉన్నవి ఏమిటి? నాకు చాలా రోజుల నుంచి ఆహారంలేక అలమటిస్తున్నాను. నిన్ను ఇప్పుడే మింగుతాను అంటూ సోమకుడు మత్స్యావతారంలో ఉన్న శ్రీహరిపై దూకే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో మత్స్యమూర్తి తన చేతిలోని చక్రముతో సోమకుడి శిరస్సును ఖండించి తన శంఖమును తీసుకొనడంతో పాటు వేదములను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి ఇవ్వడంతో, బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినట్లు పురాణకథనం. ఈ విధంగా సోమకాసురుడిని అంతమొందించి సృష్టి నిరంతరాయంగా సాగేందుకు శ్రీమన్నా రాయణుడు మత్స్యాతారం ఎత్తినట్లు పురాణ కథనం. మత్స్యపురాణం ద్వారా మనం కూడా మనలోని అజ్ఞానాన్ని పారద్రోలడంలో భగవం తుని సాయం తీసుకుని భగవదాశ్రయంలో చిత్త వికారాన్ని పోగొట్టుకొని నిర్మల చిత్తులమై విచక్షణా శక్తితో మానవ కల్యాణకారమైన పనులను చేసి భగవంతుడి ఆశీస్సులను పొందాలి అనేదాన్ని గ్రహించాలి.

Tags: matsyavatara
Previous Post

ల‌లితా స‌హ‌స్ర నామాల వెనుక ఉన్న ర‌హ‌స్యం తెలుసా..?

Next Post

మీకు కుంభీపాక న‌రకం గురించి తెలుసా..? ఇంకా ఎన్ని న‌ర‌కాలు ఉంటాయంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ డైట్ ను పాటించండి..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

July 20, 2025
lifestyle

పీడ‌క‌ల‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి..!

July 20, 2025
international

సద్దాం హుస్సేన్ నిజంగా నేరస్థుడా? అతను ఎందుకు ఉరితీయబడ్డాడు?

July 20, 2025
వినోదం

విక్రమ్ (2022) సినిమా ఎందుకు అంత హిట్ అయ్యింది?

July 20, 2025
హెల్త్ టిప్స్

మ‌ఖ‌నాలను ఎలా తింటే మంచిది.. తెలుసుకోండి..!

July 20, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.