మనిషి జీవితంలో డబ్బు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి విషయం, ప్రతి అంశంలోనూ సొమ్ము అవసరం ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అందుకే తన జీవితంలో ఎక్కువ శాతం మనిషి డబ్బు సంపాదించడానికే ప్రాకులాడుతూ ఉంటాడు. అయితే ఎంత కష్టపడినా కొన్నిసార్లు ధనం అవసరాల మేరకు ఉండకపోవడం, వచ్చినా వృథాగా ఖర్చుకావడం లాంటివి జరుగుతుంటాయి. ఇందుకు ఇంటి వాస్తు కూడా కొంత కారణమవుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఉదయాన్నే లేచి మీరు ఈ చిట్కాలు పాటిస్తే ధనం ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంట్లో అపారమైన సంపద వస్తుంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి విధానాలు అవలంభించాలో ఇప్పుడు చూద్దాం.
వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంటి ప్రధాన ముఖద్వారం ఎంత ప్రాముఖ్యంగా ఉంటే దాని ప్రకారం ఇంట్లో ధనం ఆ విధంగా పెరుగుతుంది. అంటే ఇంట్లో ఎల్లప్పుడు సంపద ఉండాలంటే ముఖ ద్వారానికున్న ప్రధాన తలుపుకు ముదురు రంగును వేయాలి. అలా చెప్పి నలుపు రంగును ఉపయోగించకూడదు. ఎరుపు లేదా ముదురు ఎరుపు రంగును వేయడం శుభంగా పరిగణించవచ్చు. ఫలితంగా ఇంట్లో సంపద పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుడా ఉదయాన్నే మెయిన్ డోర్ తెరిచేముందు లక్ష్మీదేవిని మనసులో తలుచుకొని తెరిస్తే అంతా శుభమే జరుగుతుంది.
ఒకవేళ ప్రధాన ద్వారానికి ముదురు రంగులైన ఎరుపు లేదా మెరూన్ కలర్స్ లేకపోయినట్లయితే ఇందుకు మరో పరిష్కారముంది. ఎరుపు లేదా మెరూన్ రంగుల్లో ప్రధాన ద్వారాన్ని డిజైన్ చేసినా శుభంగా పరిగణించవచ్చు. ఫలితంగా ఇంట్లోవారు లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందుతారు. ఉదయాన్ని నిద్రలేచిన తర్వాత శుభరంగుల్లో ఉన్న మెయిన్ డోర్ డిజైన్ ను చూసి లక్ష్మీ దేవిని ప్రార్ధిస్తే అంతా మంచే జరుగుతుంది. అంతేకాకుండా ధనం ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది.
వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రవేశద్వారం వద్ద శుభసంకేతాలైన ఓం, శ్రీ గణేశ, శుభ్-లాభ్ లాంటి చిహ్నాలను ఉంచాలి. వీటి వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి పెంపొందడమే కాకుండా ప్రతికూల శక్తి దూరమవుతుంది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఈ చిహ్నాలకు నమస్కరించిన అనంతరమే తలుపు తెరవండి. ఇలా లక్ష్మీ దేవికి క్రమం తప్పకుండా చేయడం వల్ల మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో అందరూ ఆనందంతో పాటు శ్రేయస్సుగా ఉండేట్లు అమ్మవారు ఆశీర్విదిస్తారు.
వాస్తుశాస్త్రం ప్రకారం.. ప్రతి రోజు ఉదయాన్నే అల్పాహారానికి ముందు రోజ్ పెర్ఫ్యూమ్ (గులాబీ రంగు అత్తరు)ను మీ నాభి వద్ద ఉంచుకోవాలి. అయితే దీనికి ముందు దుర్గామాతను పూజించడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా ప్రతినిత్యం చేయడం వల్ల మీరు ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కోరు. అంతేకాకుండా జీవితంలో కష్టాలను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి నిత్యం లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది.