Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఈ ఆల‌యానికి వెళ్తే చాలు.. ఎలాంటి అప్పులు అయినా స‌రే తీరిపోతాయ‌ట‌..!

Admin by Admin
March 14, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ రోజుల్లో అప్పు లేని వారంటూ లేరనే చెప్పొచ్చు. ఎంత కోటీశ్వరులైనా గానీ ఈఎంఐ పేరుతో బాకీ పడే ఉంటున్నారనడంలో సందేహం లేదు. చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలకు వడ్డీలు కడుతూ బాధను అనుభవించేవారు చాలామందే ఉంటారు. అప్పులు తీర్చే ఆపదల మొక్కులవాడు ఆ శ్రీనివాసుడు భక్తులకోసం నెలవై ఉన్నాడు. ఈ దేవాల‌యం ద‌ర్శిస్తే చాలు ఎంత‌టి బాధ‌లనుంచి అయినా విముక్తి పొంద‌వ‌చ్చ‌ని ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. హైదరాబాద్‌ వరంగల్‌ హైవేలో చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని బుగుల్ లేదా గుబులు వేంక‌టేశ్వ‌ర‌స్వామి అని పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనే పోసి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే స్వామి వారి అనుగ్రహంతో అప్పులు తీరతాయని భక్తుల నమ్మకం.

ఇంకా ప్రతీ శుక్రవారం జరిగే అభిషేకంలో పాల్గొన్నా, శనివారం జరిగే ప్రత్యేక పూజను చూసినా స్వామి వారి అనుగ్రహం కలుగుతుందట. వెంకటేశ్వర స్వామి అప్పుల బాధ నుండి బయట పడటానికి ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకున్నారు కాబట్టి ఇక్క‌డ‌కు వ‌చ్చి స్వామివారిని ద‌ర్శనం చేసుకుంటే ఎలాంటి అప్పుల బాధ‌లున్నా స‌రే ఆ బాధ‌ల నుంచి విముక్తి పొందుతార‌ని ప్ర‌జ‌ల విశ్వాసం. ఈ దేవాలయ స్థల పురాణం ప్రకారం.. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారు వివాహం చేసుకోవ‌డం కోసం కుబేరుని దగ్గ‌ర ధ‌నాన్ని అప్పుగా తీసుకున్నారని మ‌నంద‌రికి తెలిసిందే. అయితే ఆ కుబేరుని అప్పుని తీర్చ‌లేక వేంక‌టేశ్వ‌ర స్వామివారు చింతతో, దిగులుతో చిల్పూరు గుట్ట‌కు వ‌చ్చార‌ని, ఆ కొండ‌పైకెక్కి అక్క‌డ గుహ‌లో కుబేరుడి అప్పు తీర్చ‌లేద‌ని బాధ‌ప‌డుతూ త‌ప‌స్సులో ఉండిపోయార‌ని స్థ‌ల‌పురాణం తెలియ‌జేస్తోంది.

gubulu venkateswara swamy temple do you know the speciality

కుబేరుని అప్పు తీర్చ‌లేక ఇక్కడ‌కు వ‌చ్చి త‌ప‌స్సు చేశారు కాబ‌ట్టి ఈ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని బుగుల్ లేదా గుబులు వేంక‌టేశ్వ‌ర‌స్వామి అని పిలుస్తారు. బుగుల్ (గుబులు) అంటే చింత‌, దిగులు అని అర్ధం. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారు ఈ గుట్ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆ కొండ క్రింద భాగంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్ప‌డ్డాయి. స్వామివారి పాదాలు ఉన్న చోటుని పాదాల గుండు అనే పేరుతో పిలుస్తారు. ఇక్క‌డే ఒక అఖండ దీపం వెలిసింద‌ని స్థలపురాణం మ‌న‌కు తెలియ‌జేస్తోంది.

Tags: gubulu venkateswara swamy temple
Previous Post

పూట‌పూట‌కీ క‌దిలే శివ‌లింగం.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

Next Post

ఈ ఆల‌యం వ‌ద్ద న‌దిలో స్నానం చేస్తే చాలు.. స‌క‌ల పాపాలు పోతాయి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.