ఆధ్యాత్మికం

పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌లో మొత్తం ఎన్ని ర‌థాల‌ను ఊరేగిస్తారో తెలుసా..?

దేశంలోని అత్యంత ప్రసిద్ధమైన చార్ ధామ్ క్షేత్రాలలో జగన్నాథదేవాలయం కూడా ఒకటి. ఉత్త‌రాన బ‌ద‌రీ, ద‌క్షిణాన రామేశ్వ‌ర‌ము, ప‌డ‌మ‌ర‌న ద్వార‌క‌, తూర్పున పూరీ క్షేత్ర‌ము జగములనేలే లోకనాయకుడు దేవదేవుడు కొలువై ఉన్న దేవాలయం ఒడిస్సాలోని పూరీ పట్టణంలో ఉంది. ఈ దేవాలయం ఎంతో మహత్యం కలిగి ఉండి ఎన్నో వింతలకు నెలవైఉంది. పూరీలో జరిగే జగన్నాథుని రథయాత్ర భారీ ఎత్తున సాగుతుంది. ప్రపంచ నలుమూలల నుండి భక్తులు రథయాత్రకు వస్తారు. ప్రతీ సంవత్సరం ఆషాఢ శుక్ల విదియనాడు పూరీ రథయాత్రని ఘనంగా నిర్వహిస్తారు. జగన్నాథ, సుభద్ర బలభద్రులను ఈ రథయాత్రలో ఊరేగిస్తారు. ఈ రథయాత్రలో మూడు ప్రధాన రథాలు వుంటాయి.

1. బలభద్రుని రథం, 2. సుభద్రా దేవి రథం, 3. జగన్నాధుని రథం. ఈ మూడు రథాలు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు కొత్తవి తయారుచేస్తారు. రథయాత్ర ముగిసాక ఈ రథాలను విరిచేస్తారు. జగన్నాధుడు ఊరేగే రథాన్ని నందిఘోష అంటారు. ఈ రథం 34న్నర అడుగుల ఎత్తు వుంటుంది. 18చక్రాలు వుంటాయి. బలభద్రుడు ఊరేగే రథాన్ని తాళద్వజ అంటారు. ఈ రధం 33 అడుగుల ఎత్తు కలిగి వుంటుంది. ఈ రథానికి 16 చక్రాలు వుంటాయి. సుభద్రాదేవి ఊరేగే రథాన్ని దేవదాలన అంటారు. ఈ రథం 31న్నర అడుగుల ఎత్తు వుంటుంది. ఈ రథానికి14 చక్రాలు వుంటాయి. ఈ మూడు రథాలు అలంకరించడానికి 12 వందల మీటర్ల పట్టు వస్త్రాన్ని ముంబాయిలోని సెంచరీమిల్స్ వారు విరాళంగా సమర్పిస్తారు.

how many rathams are there in puri jagannadh rath yatra

రథయాత్ర నేపథ్యం గురించి రెండు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుని మేన మామ కంసుడ్ని వధించేందుకు బలరాముడితో కలిసి వేళ్లే ఘట్టాన్ని రథయాత్రగా చేస్తారనేది ఒక కథనం, ద్వారకకు వెళ్లాలన్న సోదరి సుభద్రాదేవిని పంపేముందు అన్నదములు తమ చెల్లిని రాజ్యమంతా తిప్పి చూపి తన కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరొకొందరు నమ్ముతారు. జగన్నాథ రథ యాత్రను వేల సంవత్సరాలుగాజరుపుకుంటూ వస్తున్నారు. ప్ర‌తీ ప‌న్నెండు నుంచి పందొమ్మిది సంవ‌త్స‌రాల‌కొక‌సారి ఏ సంవ‌త్స‌రంలో అయితే ఆషాఢ మాసం రెండు సార్లు వ‌స్తుందో ఆ యేడు నవ కళేబరోత్సవం పేరుతో కొత్త విగ్ర‌హాల‌ను మారుస్తారు.

Admin

Recent Posts