Soul Weight : ప్రతి మనిషిలో అత్మ ఉంటుంది, అది మనిషి మరణం తర్వాత అతనిని నుండి వేరై, పరమాత్మలో లీనం అవుతుంది. ఇది మన పురాణాలు మనకు అందించిన సమాచారం. ఇది నిజమేనా ? నిజంగానే ఆత్మ ఉంటుందా ? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు అమెరికాకు చెందిన ఓ సైంటిస్ట్ అవును మనిషికి ఆత్మ ఉంటుంది, దాని బరువు 21 గ్రాములు అని ప్రయోగాలతో సహా నిరూపించాడు. చాలా మంది డాక్టర్లు దీనితో విభేదించినప్పటికీ దానిని తప్పు అని సైటింఫిక్ గా నిరూపించలేకపోయారు.
1907 మెక్ డగెల్ అనే డాక్టర్ కమ్ సైంటిస్ట్ మరణానికి సమీపంలో ఉన్న వ్యక్తి పడుకున్న బెడ్ కు బరువును కొలిచే పరికరాన్ని అమర్చాడు. పేషెంట్ మరణానికి కంటే కొన్ని సెకన్ల ముందు అతని బరువును, అలాగే మరణించిన వెంటనే అతడి బరువును కొలిచాడు. ఈ రెండు బరువుల మధ్య తేడా 21 గ్రాములుగా తేలింది. తగ్గిన ఈ 21 గ్రాముల బరువు మనిషి యొక్క ఆత్మదే అని ప్రకటించాడు డగెల్.
అయితే డగెల్ ప్రతిపాదనను చాలా మంది డాక్టర్లు వ్యతిరేకించారు. మనిషి చనిపోయాక అతడి శ్వాసక్రియ ఆగుతుందని, గుండె, ఊపిరితిత్తులు పనిచేయడం ఆగుతాయని, ఇంకా శరీర అతర్భాగంగా జరిగే ప్రతీ క్రియ ఆగుతుందని.. అందుకే చనిపోయాక మనిషి బరువులో 21 గ్రాములు తేడా వస్తుందని ఇతర డాక్టర్లు వాదించారు.
ఈ సారి డగెల్ తన ప్రయోగాన్ని 15 కుక్కల మీద చేశాడు. మరణించక ముందు వాటి బరువుకు, మరణించాక వాటి బరువుకు మధ్య ఎటువంటి తేడా రాలేదని నిరూపించాడు. అంటే ఆత్మ కేవలం మనిషికే ఉంటుంది కాబట్టి మనుషుల బరువుకే ఆ 21 గ్రాముల తేడా ఉంటుందని తెలిపాడు. అంతే కాకుండా జీవక్రియ ఆగడం వల్ల 1 నిమిషానికి మనిషి బరువు 0.5 గ్రాము మాత్రమే తగ్గుతుందని నిరూపించాడు. అంటే ఈ 21 గ్రాములు ఆత్మ బరువే అని అతడి వాదన. సైన్స్ దీనికి పరిష్కారం చూపనంత వరకు ఆ లెక్క తేలదు. 21 గ్రాముల బరువు ఆత్మదే అన్నమాట.