ఆధ్యాత్మికం

ఇంట్లో నుంచి ద‌రిద్ర దేవ‌త పోయి లక్ష్మీదేవి రావాలంటే ఏం చేయాలి.. చిన్న క‌థ‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అనగనగా&period;&period; ఒకసారి లక్షీదేవి ఒక వ్యక్తి పై కోపగించుకొని ఈ ఇంటినుండి వెళ్లి పోతున్నాను&period; ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది&period; కాకపోతే నీకో వరం ఇవ్వదలచుకొన్నాను&period; అడుగు&excl; అని అంటుంది&period; అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు… అమ్మా నీవు వెళ్లుతుంటే ఆపే శక్తి నాకు లేదు&period; అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు&period; మీలో ఒకరు వున్నచోట ఒకరు వుండరు&period; కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే వుండేటట్లు వరం ఇవ్వమని అంటాడు&period; తథాస్తు&excl; అని లక్ష్మీదేవి ఆ ఇంటినుండి వెళ్లిపోతుంది&period; కొన్నిరోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్ళలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమై పోతుంది&period; ఇంకొంతసేపటికి పెద్దకోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తనుకూడ ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరేపనిలో పడిపోతుంది&period; ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్లు ఇద్దరు తమ పనిలోపడి ఉప్పు వేశారో లేదో అని తనూ కొంత వేస్తుంది&period; మధ్యాహ్నం ఆవ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువయిందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు&period; ఏమి మాట్లాడకుండా తిని లేస్తాడు&period; కొంత సేపటికి ఆ వ్యక్తి పెద్దకొడుకు కూడ భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి నాన్న గారు తిన్నారా&quest; అని భార్యను అడుగుతాడు&period; తిన్నారు&excl; అని చెబుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84298 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;lakshmi-devi-1&period;jpg" alt&equals;"how to attract lakshmi devi in home small story " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానితో నాన్న ఏమీ అనకుండా తిన్నాడు&period; నేనెందుకు అనాలి&quest; అని ఏమి మాట్లాడకుండా తనూ తిని లేస్తాడు&period; ఇలా ఆ ఇంటి వాళ్లంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా వుంటారు&period; ఆరోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నేను ఇక్కడ ఉండలేను వెళ్లిపోతున్నాను&period; ఉప్పు కశాయం అయిన వంట తిని కూడా మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు&period; మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు&period; ఇటు వంటి చోట నేనుండను&excl; అని వెళ్లిపోతుంది&period; దరిద్ర దేవత వెళ్లిపోవటంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకొంటుంది&period; కనుక&comma; ఏ ఇంటిలో ప్రేమ&comma; అప్యాయతలు మరియు శాంతి కళకళలాడుతూ వుంటాయో ఆ ఇల్లు లక్ష్మీనివాసం అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts