ఆధ్యాత్మికం

భోజ‌నం చేస్తున్నారా.. అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..

భోజనం చేసేటప్పుడు తప్పకుండా ఈ పద్ధతులని అనుసరించడం చాలా ముఖ్యం అని పండితులు చెబుతున్నారు. ఈనాటి కాలంలో అయితే టీవీలు, ఫోన్లు చూస్తూ తింటున్నారు. ఇలా తినడం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి అని అంటున్నారు. అయితే తినేటప్పుడు అన్నపూర్ణ దేవి స్వరూపమైన ఆహారాన్ని ఎంతో పవిత్రంగా భుజించాల‌ని అంటున్నారు. అయితే మంచి ఫలితాలు కోసం తినేటప్పుడు ఎలా ఆచరించాలి అనేది చూద్దాం.

భోజనానికి ముందు కాళ్లూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తూర్పూ లేదా ఉత్తరం దిక్కు వైపు కూర్చుని చేయడం అలవాటు చేసుకోండి. ఇదే మంచి పద్దతి. అలానే తినేటప్పుడు మధ్య లో లేవకూడదు, లేవకండి. అలానే ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించకూడదు, తాకకూడదు.

if you are taking meals do not do these mistakes

చాలా మందికి ఇది తెలియ‌దు. ఇప్పటి నుండి పాటించండి. ఒకవేళ నిలబడి అన్నం తింటే క్రమంగా దరిద్రులు అవుతారు. కంచాన్ని ఒడిలో పెట్టుకుని భోజనం చేయకూడదు. పడుకునే మంచం మీద భోజనం చేయడం మంచిది కాదు.

అందుకని ఆ అలవాటు ఉంటే మానుకోండి. అంతే కాదండి అన్నం తింటూ పదార్థాలు బాగాలేదంటూ దూషిస్తుంటారు. అలా చేయకూడదు. ఒకసారి వండిన పదార్థాలను కొందరు మళ్లీమళ్లీ వేడి చేసి తింటుంటారు కానీ అలా కూడా చెయ్యకూడదు.

Admin

Recent Posts