మంగళవారం రోజు అప్పు తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అలుగుతుందట. అంతే కాదు అప్పు తొందరగా తీరదట. కాబట్టి మంగళవారం అప్పు తీసుకోవాలన్నా…అప్పు ఇవ్వాలన్నా..ఒక్కసారి ఆలోచించండి. అలాగే బుదవారం రోజు అప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదట. ఒకవేళ అదే పని పదేపదే చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి అలిగి ఇంటి నుండి వెళ్లిపోతుందట. వంటగది ఈశాన్యంలో కట్టకూడదని మన పెద్దలు చెబుతుంటారు. అందుకు కారణం ఇంట్లో ధన లక్ష్మీ నిలవదనే అలా చెబుతారు. కడితే లక్ష్మీ అలిగి వెలిపోతుందంట. సాధారణంగా హిందూసాంప్రదాయంలో ఎంగిలి మంగళం అనే పదాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. పూజగదిలో ఎంగిలి చేసినవి ఉంచకూడదు. తామర పువ్వులు, బిల్వపత్రాలను ఎప్పుడు నలపరాదు.
నదులు, సరస్సులను పవిత్రమైనవిగా భావిస్తారు. అలాంటి పవిత్ర జలాశయాల్లో సరస్సులలో, నదులలో మల మూత్ర విసర్జన చేయకూడదు. ఎక్కడపడితే అక్కడ అశుభ్రం చేస్తే లక్ష్మీదేవికి నచ్చదట. ఇంటి గోడలను, తలుపులను, గడపలను లక్ష్మీ స్వరూపాలుగా చెబుతుంటారు. గోడల మీద అవసరం లేనివి రాయకూడదు. అంటే బూతులు, చెడు వాఖ్యాలు రాయకూడదట. అలా చేస్తే లక్ష్మీదేవి అలుగుతుందట. పాదాన్ని పాదంతో రుద్ది కడగ కూడదు. చేతితోనే రుద్దుకొని కడగాలి. అతిథిదేవో భవ అంటారు. అతిధి మర్యాదలలో లోపం చేయరాదు. పశువులను అనవసరంగా కొట్టకూడదు. దూషించకూడదు. సాయం సంధ్యలో నిద్రించే వారింట లక్ష్మీ ఉండదు. సోమరితనంగా ఉండే ఇంట లక్ష్మీ కటాక్షించదు. ఎవరింట్లో అయితే తరచూ గొడవులు జరుగుతూ మహిళలు ఏడుస్తుంటారో, ఆ ఇంట్లో లక్ష్మీ ఉండదు. అలాగే వృద్దులను పట్టించుకోని ఇంట లక్ష్మీ దేవి ఉండక అలిగి వెలిపోతుందట. ప్రతి రోజూ ఇంట్లో ఉదయం, సాయం సంధ్యవేళల్లో కనీసం అగరబత్తి , దూపంతోనైనా దేవతారాధన చేయాలి. అలా చేయకుండా ఉండే వారింట్లో, తులసి చెట్టు పెట్టి, పట్టించుకోని ఇంట లక్ష్మీ అలిగి వెలిపోతుందట.
వ్యసనాలకు బానిసలు కారాదు. అలా చేస్తే లక్ష్మీ ఇంటి నుండి దూరం అవుతుంది. రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరించేవారిదగ్గర లక్ష్మి నిలవదు. ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లోనూ, జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీలు, నేల అదిరిపోయేటట్లు నడిచే స్త్రీలు ఉన్నప్రదేశాలలోనూ, స్త్రీలను కష్టపెట్టేచోట లక్ష్మి ఉండదు. సోమరితనం, ప్రయత్నం లేకపోవటం లక్ష్మికి వీడ్కోలు పలుకుతాయి.