ఆధ్యాత్మికం

Pooja To God : ఈ పాపం చేస్తే ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు.. ఇంతకీ అదేంటో తెలుసా..?

Pooja To God : భూమికంటే బరువైనది తల్లి. ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి. పదిమంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు.. వందమంది ఆచార్యులకంటే కన్నతండ్రి గొప్పవాడు. తండ్రికంటే వెయ్యి రెట్లు గొప్పది కన్నతల్లి. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ కన్నతల్లి కంట కన్నీరు పెట్టించిన దానికి ఎన్ని యాగాలు చేసినా ఫలితం ఉండదు.

తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని చీద‌రించుకున్నా తప్పులేదు. కానీ చెడు నడతతో ఉన్న తల్లిని నిరాద‌రించినా తప్పే అని శాస్త్రాలు చెబుతున్నాయి. తల్లిని మించిన దైవం లేదని మనం చిన్నప్పట్నుండి నేర్చుకుంటున్నాం. లక్ష గోవులు దానం ఇచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా కన్నతల్లిని కష్టపెట్టిన పాపం నివృత్తి కాదట. కాబట్టి కన్నతల్లిని సంతోషంగా ఉండేలా చూసుకొండి.

if you do this then all your pooja will be waste

సాధార‌ణంగా చాలా మంది తెలిసో తెలియ‌కో అనేక త‌ప్పులు చేస్తారు. కొంద‌రు పాపాలు కూడా చేస్తారు. అయితే క‌న్న‌త‌ల్లిని క‌ష్ట‌పెడితే అది తీవ్ర పాప‌మ‌ట‌. క‌నుక త‌ల్లిని క‌ష్ట‌పెట్ట‌రాదు. ఆమెను ఎల్ల‌ప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.

Admin

Recent Posts