ఆధ్యాత్మికం

ఆర్థిక సమస్యలు ఉన్నాయా ? బుధవారం రోజు ఇలా చేయండి..!

వారంలో ఒక్కో రోజు ఒక్కో దైవాన్ని పూజిస్తాం కదా. అలాగే బుధవారం వినాయకుడికి ప్రీతికరమైంది. కనుక ఆ రోజు వినాయకున్ని పూజించాలి. అయితే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు లేదా చేపట్టిన పనుల్లో సమస్యలను ఎదుర్కొనేవారు బుధవారం వినాయకున్ని పూజిస్తే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు.

వినాయకున్ని విఘ్నహర్త అంటారు. అంటే విఘ్నాలు కలగకుండా చూసేవాడు అని అర్థం. ఇక వృద్ధి, సిద్ధిని ఆయన అందిస్తాడు. పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తాడు. అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాడు. కనుక బుధవారం ఆయనను పూజించాలి. చేపట్టే పనులు విజయవంతం కాకపోతే బుధవారం రోజు వినాయకుడికి పూజలు చేయాలి. ఆ రోజు వినాయకుడి ఆలయానికి వెళ్లి ఆయన్ను దర్శించుకోవాలి. అలాగే 11 లేదా 21 దర్భలతో గణేశుడికి పూజ చేయాలి. దీంతో పనిలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి.

if you have money problems do like this on wednesday

బుధవారం రోజు వినాయకుడికి ఆలయంలో బెల్లంను నైవేద్యంగా పెట్టాలి. అనంతరం దాన్ని భక్తులకు పంచి పెట్టాలి. ఇలా 7 బుధవారాలు చేయాలి. దీని వల్ల అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఇక ఇందుకోసం గణేశుడి రుద్రాక్షను కూడా ధరించవచ్చు.

పరీక్షల్లో మెరిట్‌ సాధించాలనుకునే విద్యార్థులు గణేశున్ని పూజిస్తే తప్పక ఫలితం ఉంటుంది. బుధవారం రోజు ఆవులకు గడ్డి తినిపించడం లేదా ఆకుపచ్చని కూరగాయలను తినిపించడం చేయాలి. దీని వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్‌ ఎనర్జీ పోతుంది. అందరూ సంతోషంగా ఉంటారు.

Admin

Recent Posts