Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఈ సంకేతాలు మీ ఇంట్లో క‌నిపిస్తున్నాయా.. అయితే పితృ దోషం ఉన్న‌ట్లే..!

Admin by Admin
June 10, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కొన్ని రకాల దోషాల వల్ల మనుషుల జీవితాల్లో సంతోషం ఉండదు.. ఎప్పుడూ ఏదో ఆందోళన, చింత చికాకు వెంటాడుతుంటాయి.. ముఖ్యంగా మన నడవడిక వల్ల తల్లిదండ్రులు కలత చెందినప్పుడు, వారికి సమస్యలు వచ్చినప్పుడు మనం పితృదోషానికి గురవుతాం. ఈరోజుల్లో కూడా ఇలాంటివి అన్నీ ఎవరు నమ్ముతారండీ అనుకుంటారేమో.. హిందూ సంప్రదాయంలో వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. పితృపక్షం సందర్భంగా మన పూర్వీకులు తమ సంతతిని ఆశీర్వదించేందుకు భూలోకానికి వస్తారన్నది భార‌తీయుల‌ నమ్మకం. పూర్వీకులకు కోపం వస్తే ఇంట్లో అశాంతి నెలకొంటుందని విశ్వ‌సిస్తారు. పూర్వీకులు మ‌న‌పై కోపంగా ఉన్నప్పుడు, ఇంట్లో అనేక విధాలుగా విభేదాలు మొదలవుతాయి. మన తల్లిదండ్రులు మనపై కోపంగా ఉన్నప్పుడు లేదా మ‌న‌పై పితృ దోషం ఉన్న‌ప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..

పూర్వీకులకు ఇష్టం లేకపోయినా, మన త‌ల్లిదండ్రులు మనపై కోపంగా ఉన్నా ఇంట్లో గొడవలు రావడం సర్వసాధారణం అయిపోతుంది.. కారణం లేకుండానే కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు గొడవ పడ‌తుంటారు. మీకు కూడా ఇలా జ‌రుగుతుంటే దీనికి కారణం పితృ దోషమే అని గుర్తించాలి. పూర్వీకుల కోపం వల్ల ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. కుటుంబంలో ఎవరో ఒక‌రు నిరంతరం అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఉంటారు. చికిత్స పొందుతూ ఉన్నప్పటికీ, సమస్యలు కొనసాగుతాయి. ఇది పితృ దోషం ఉంద‌ని తెలుసుకోవ‌డానికి ప్రధాన లక్షణం. మీరు ఏదైనా పని చేయాల‌ని త‌ల‌పెడితే అది సగంలోనే ఆగిపోయినా లేదా పనిలో ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు కనిపించినా అది పితృదోష లక్షణం కావచ్చు. పితృ దోషం వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్ప‌డుతాయి. పని చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆగిపోవడం స‌ర్వ‌ సాధారణంగా మారుతుంది. అంటే పితృ దోషం ఒక వ్యక్తి పురోగతికి సమస్యలను కలిగిస్తుంది.

if you have these signs then pitru dosham is there in your home

మీ కుటుంబంలో ఎవరికైనా వివాహానికి అడ్డంకులు ఎదురైతే, అది పితృ దోషానికి సంకేతం. పితృ దోషం కారణంగా కుటుంబ సభ్యులకు పెళ్లి కాకపోవ‌డం, పెళ్లి త‌ర్వాత‌ వారి బంధంలో సమస్యలు లేదా వివాహం కుదిరిన‌ తర్వాత చెడిపోవ‌డం కూడా పితృ దోష లక్షణాలేన‌ని గుర్తించాలి. పితృదోషం కారణంగా కుటుంబంలో పిల్లలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలు లేకపోయినా సంతానం కలగకుండా ఉంటే అది పితృ దోషానికి సంకేతం. ఈ సమస్య ఉంటే పండితులను సంప్రదించండి.

Tags: pitru dosham
Previous Post

రాత్రి నిద్ర‌పోయేట‌ప్పుడు ఇలా చేస్తున్నారా..? దుష్ట శ‌క్తులు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Next Post

గులాబీ పువ్వుల‌తో ఇలా చేస్తే చాలు మీ ఇంట్లో ల‌క్ష్మీదేవి ఎల్ల‌ప్పుడూ ఉంటుంది..!

Related Posts

వినోదం

ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో.. ఎలా ఉందో చూడండి..!!

June 11, 2025
ఆధ్యాత్మికం

కొత్తగా పెళ్ళైన దంపతులు ఆషాడ మాసంలో ఎందుకు దూరంగా ఉండాలో తెలుసా..?

June 11, 2025
వినోదం

ఆర్పీ పట్నాయక్ కు మూవీ ఆఫర్స్ రాకుండా చేసింది ఆ స్టార్ హీరో అని మీకు తెలుసా..?

June 11, 2025
వ్యాయామం

ముందుకు 10 నిమిషాలు న‌డిచే క‌న్నా.. వెన‌క్కి 3 నిమిషాలు న‌డిస్తే చాలు..

June 11, 2025
హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే చాలు.. పొగ తాగ‌డం ఇట్టే మానేస్తారు..!

June 11, 2025
హెల్త్ టిప్స్

ఈ కూర‌గాయ‌ల‌ను త‌ర‌చూ తినండి.. ఎంత‌టి కొవ్వు ఉన్నా ఇట్టే క‌రిగిపోతుంది..!

June 11, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!