ఆధ్యాత్మికం

శ‌నిదేవుడి ప్ర‌భావం ఉంటే ఇలా జ‌రుగుతుంది.. క‌చ్చితంగా గుర్తించండి..

శనిదేవుని ప్రభావం కనుక పడిందంటే శారీరికంగా, మానసికంగా మరియు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. శనిదేవుని ప్రభావం కనుక మీ మీద పడింది అంటే ఇటువంటివి సంభవిస్తాయి అని పండితులు చెప్తున్నారు. నుదురు నల్లగా అయిపోవడం, జుట్టు ఊడిపోవడం, బట్టతల రావడం వంటివి జరిగితే తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాళ్లు అనేక విషయాల్లో నష్టపోతారు అని చెప్తున్నారు. అలానే అనవసరం అయిన వాటిని ఆకర్షిస్తూ ఉంటారు. సరైన దారి నుంచి చెడ్డ దారి కి తీసుకెళ్లి అక్కడ బాధలు ఇస్తుంది మరియు ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి ఉంటుంది.

బిజినెస్ లో నష్టాలు రావడం, మానసికంగా ఒత్తిడి కలగడం లాంటివి జరుగుతాయి. అలానే తినే అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. ఎక్కువగా మాంసం మందు కి అలవాటు పడిపోతారు. శనిదేవుని ప్రభావం తగ్గించుకోవాలంటే ఇవి బాగా ఉపయోగపడతాయి. మీరు మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యులను సంప్రదించి శనిదేవుని ప్రభావం పడిందో లేదో చూసుకోవచ్చు. ఒకవేళ ప్రభావం ఉంది అంటే మీరు శనివారం నాడు ఇలా చేయండి.

if you have these symptoms then you might have lord shani effect

శనివారం నాడు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం. నల్ల రంగులో ఉండే కుక్కలకి ఆహారం ఇవ్వడం. నల్ల నువ్వులు, నల్ల దుస్తులు శనివారం నాడు దానం చేయడం లాంటివి చేస్తే తప్పకుండా ఈ ప్రభావం తగ్గుతుంది.

Admin

Recent Posts