Lalitha Devi : లలితా సహస్ర నామాలను ఇంట్లో చదివితే ఎంతో మంచి జరుగుతుందని, లలితా దేవి అనుగ్రహం కలుగుతుందని మనకి తెలుసు. చాలా మంది స్త్రీలు శుక్రవారం, మంగళవారం పూజ చేసినప్పుడు కచ్చితంగా లలితా సహస్ర నామాలను చదువుతూ ఉంటారు. అయితే లలితా సహస్ర నామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. ఇది లలితా దేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వ్రాసినది. దేవతలు పలికితే ఈ స్తోత్రం వచ్చింది.
ఎవరైతే ఈ నామాలని అనుసంధానం చేస్తారో, ఎవరైతే ప్రతి రోజూ వీటిని చదువుతారో లలితా దేవికి ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగ క్షేమాలని తానే స్వయంగా విచారణ చేస్తానని చెప్పింది. కనుక కలియుగంలో లలితా సహస్ర నామం వంటి సహస్ర నామ స్తోత్రం లభించడం మన అదృష్టం. అయితే నామం అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని మనం ఇప్పుడు అంటున్నాం కానీ బాహ్యంలో అది రహస్య నామ స్తోత్రం.
అయితే లలితాదేవి అనేది ఒక రూపం. ఆ రూపాన్ని గుర్తు పెట్టుకుని పిలవడానికి ఒక నామం చాలు. కానీ సహస్రము అంటే అనంతము. లెక్కపెట్టలేనిది. ఇంత ఎందుకు అని చాలా మందికి అనిపిస్తుంది. కానీ దీని వెనుక ఎంతో మహత్యం వుంది. నిజానికి లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే నోటితో అప్పజెప్పడం కాదు.
ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు, ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి ఈ కారణం చేత మనసుని హత్తుకుని నిలబడి పోవాలి. శివుడి భార్య అయిన భవానీయే లలితా దేవి. అయితే లలితా సహస్రనామం చదవడం వలన జీవితం తరిస్తుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం నయం అవుతుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించినది మనకి ఇంకేం కావాలి. అందుకనే శ్రీ లలితా సహస్రనామాలు చదువుతూ ఉంటాము.