Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

బ్ర‌హ్మ త‌ల‌రాత‌ను రాస్తే అది క‌చ్చితంగా జ‌రిగే తీరుతుంది.. ఈ క‌థే అందుకు ఉదాహ‌ర‌ణ‌..

Admin by Admin
April 16, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కాశీలో వున్న గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతను నిత్యం స్నానం చేయడానికి గంగ దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. గంగా నది దగ్గర మర్రిచెట్టు ఉంది. ఒకనాడు ఆ చెట్టుకి దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది. దాన్ని చూచి ఛీ వెధ‌వ పుర్రె ఇప్పుడే తగలాలా? మళ్ళీ స్నానం చేయాలి! అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు. పుర్రె తళుక్కుమని మెరిసింది. అది చూసి దీని తలరాత ఏంటో చదువుదాం అని చేతిలోకి తీసుకుని చదివాడు… వీడు జీవితాంతం కష్టపడతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు. బడిలో పంతుళ్ళు కొడతారు. పెళ్ళయ్యాక పెళ్ళాం తిడుతుంది. పిల్లలు పెద్దయ్యాక ఇంట్లోనుండి తన్ని గెంటేస్తారు. ప్రతిక్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే వుంటారు. డబ్బు నిలవదు. ఎవరైనా దయతలచి ఇచ్చినా పోతుంది. బ్రతికినంతకాలం కష్టాలు పడీ పడీ చస్తాడు. వీడు చచ్చిన 500 సంవత్సరాలకి వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది.’ అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసివుంది!

అది చదివి బ్రతికి ఉండగా అవమానం అంటే ఫ‌ర్వాలేదు. చచ్చాక పుర్రెకి అవమానం ఏంటి? బ్రహ్మకి అసలు బుర్ర వుందా? అని ఆ పుర్రెను విసిరేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూద్దాం! అనుకొని దగ్గరలో ఉన్న మర్రిచెట్టు తొర్రలో ఈ పుర్రె ని దాచాడు. నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రిచెట్టు తొర్రలో ఉన్న పుర్రెని చూసి పలకరించి వెళ్ళేవాడు. ఇలా కొన్నాళ్ళు గడచిన తరువాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక 10 రోజులపాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపి వచ్చాడు. ఎప్పటిలాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తొచ్చి మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి తొర్రలో ఉన్న పుర్రెకోసం చుస్తే కనపడలేదు. వెతికాడు దొరకలేదు. మర్రిచెట్టు తొర్రలో పుర్రె ఏమైపోయింది? అనుకుంటూ స్నానం, సంధ్యా వందనం చేస్తున్నాడు కాని మనసు మాత్రం పుర్రెమీదే వుంది.

lord brahma writing will become definitely true

చేశాం అంటే చేశాం అన్నట్టు నిత్య కృత్యములు చేస్తూ ఉండగా ఇది భార్య గమనించి మీరెందుకు ఇలా వున్నారో నాకు తెలుసులెండి అంది.. ఒసేయ్ పిచ్చి మొహమా! ఏం తెలుసే నీకు? అన్నాడు. మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రితొర్రలో దాచిన ఆవిడ పుర్రె గురించేకదా! ఆ సంగతి నాకు ఎలా తెలుసనుకుంటున్నారా? మీరు రోజూ ఆ మర్రితొర్రలో వున్న పుర్రెని చూస్తున్నారని జనాలు చెప్పారు. అంది. ఓహో! ఇంతకీ ఏమి చేశావే దాన్ని. అది నా సవతిది అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడి వేడి నీళ్ళు మరగబెట్టి దానిమీద పోశాను. సలసలా కాగే నూనె గుమ్మరించాను, అప్పటికీ కసి తీరక కారం చల్లాను. అయినా కోపం తీరక రోట్లో వేసి రోకలిబండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను! అంది.

అప్పుడు జరిగింది చెప్పాడు. ఒసేయ్ వెర్రి మొహమా! అది నాపెళ్ళాం కాదే! దానిమీద… చచ్చాక కూడా ఆపుర్రే అవమానం పాలై మోక్షం పొందుతుందని రాసి ఉంది. అది ఎలా నిజమౌతుందో చూద్దామని నేను ఆ మర్రిచెట్టు తొర్రలొ ఉంచాను. ఇదిగో నీవల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది. గంగలో కలిస్తే మోక్షమే కదా! అన్నాడు. ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైంది. బ్రహ్మ రాస్తే నిజమై తీరుతుంది. బ్రహ్మ రాసిన రాత మారాలంటే ఎం చేయాలి? సద్గురువు కటాక్షం ఉండాలి. అప్పుడే రాతని మార్చుకోవచ్చు. లేదంటే ఇది నేనే చేశాను, నేనే చేయగలను. అనే భ్రమలో బ్రతికేస్తారు.

Tags: Lord Brahma
Previous Post

వాల్తేరు వీరయ్య లో డైలాగ్ అక్కడ నుండి లేపేసారా..? ఇది అస్సలు ఊహించి ఉండరు..

Next Post

రెస్టారెంట్‌కు వ‌చ్చిన ధ‌నికుడి క‌ళ్లు తెరిపించిన బేర‌ర్‌.. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..?

Related Posts

పోష‌కాహారం

ఇప్ప‌టి నుంచి మామిడి పండ్ల‌ను తినే వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

June 3, 2025
lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!