ఆధ్యాత్మికం

ఎలాంటి రోగాలు అయినా న‌యం అవ్వాలంటే.. వెంక‌టేశ్వ‌ర స్వామిని ఈ రోజు ద‌ర్శించుకోండి..!

ప్రపంచంలో ధనవంతుడు ఎవరు అంటే విజ్ఞులు ఠక్కున చెప్పె సమాధానం ఆరోగ్యవంతుడు. అటువంటి ఆరోగ్యం కోసం అందరూ ఎన్నో వ్యయప్రయాసలు పడుతుంటారు. అయితే ఔషధసేవతోపాటు భగవత్ అనుగ్రహం ఉంటే ఇక తిరుగు ఉండదు అనేది సత్యం. అయితే ఆరోగ్యం కోసం ఏం పూజ చేయాలి అనేది చాలామందికి సంశయం.

కలియో వేంకటనాయకః- కలియుగంలో ప్రతక్ష్య దైవం శ్రీశ్రీనివాసుడు. ఆయన్ను పూజిస్తే చాలు అన్ని మీకు లభ్యం. అయితే ఎప్పుడు ఎలా పూజచేస్తే ఆరోగ్యాన్ని వేంకటేశ్వరుడు ప్రసాదిస్తాడో తెలుసుకుందాం…

dp pooja to lord venkateswara swamy like this for health

నక్షత్రాలన్నింటిలోకి మొదటిది అశ్విని. ఈ నక్షత్రానికి అశ్విని అధి దేవతలు. ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మేషరాశికి చెందుతాయి. అశ్విని నక్షత్రంనాడు శ్రీనివాసుడిని దర్శించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. దేవతల వైద్యుడైన ధన్వంతరి శ్రీమన్నారాయణుడే. శ్రీమన్నారాయుణుని అశ్విని నక్షత్రం రోజున ఎవరు ఆరాధిస్తారో వారికి ఎటువంటి అనారోగ్యం నుంచైనా వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ప్రతినెల ఒక్కసారి వచ్చే అశ్విని నక్షత్రంనాడు నమ్మకంతో, విశ్వాసంతో శ్రీనివాసుడిని పూజించి సంపూర్ణ ఆరోగ్యంవంతులు కండి. అవకాశం ఉంటే తిరుమల లేదా దగ్గర్లోని వేంకటేశ్వర ఆలయాలను అశ్విని నక్షత్రం నాడు తప్పక దర్శించండి. ఆరోగ్యం మీ సొంతం.

Admin

Recent Posts