ఆధ్యాత్మికం

మీ ఇంట్లో ఈ వ‌స్తువుల‌ను పెట్టండి.. లక్ష్మీదేవి క‌టాక్షం క‌లుగుతుంది..

సాధారణంగా అష్టైశ్వర్యాలు కలగాలని, శుభం జరగాలని మన ఇళ్ళల్లో పూజలు చేయడం వగైరా వంటివి చేస్తూ ఉంటాం. అయితే కొన్ని బొమ్మల ద్వారా మనకి మంచి కలిగేలా చేయవచ్చు. దీనితో గృహంలో భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఉన్నత పదవులు వగైరా పొందొచ్చు. మరి ఇలా శుభం జరగాలంటే ఏం చేయాలి…?, ఏ పద్ధతి పాటించడం వల్ల ఏం జరుగుతుంది…?, భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగే పద్ధతులు ఏమిటి..? ఇలా అనేక విషయాలు మీకోసం. మరి ఆలస్యమెందుకు పూర్తిగా దీనికోసం చూసేయండి.

ముందుగా మంచి కలగాలంటే ఇంట్లో ఏనుగు బొమ్మలని, గోమాతలను పెట్టాలి. ఏనుగులు తొండాన్ని పైకి ఎత్తి బొమ్మలని ఉంచితే లాభం కలుగుతుంది. ఇంటి ద్వారానికి ఇరువైపుల తొండాన్ని పైకెత్తిన ఏనుగు బొమ్మల్ని పెట్టడం వల్ల మంచి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఏనుగుల చూపు మాత్రం తిన్నగా గుమ్మం వైపు కాకుండా కొంచెం పక్కకి పెట్టాలట. ఇలా చేయడం వల్ల అదృష్ట లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

put these items in your home for lakshmi kataksham put these items in your home for lakshmi kataksham

అలానే ఇంట్లో దూడతో కలిసి ఉన్న ఆవుని పెట్టడం వల్ల మంచి లభిస్తుంది. అది కూడా ఉత్తర దిక్కుకి ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆవు దూడ బొమ్మలు, ఏనుగు బొమ్మలు ఇంట్లో పెట్టేటప్పుడు 21 సార్లు తప్పక ఈ శ్లోకాన్ని చదివి వాటిని పెట్టడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇలా నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ మహాబీష్టం కురుష్వాశు శరణాగతవత్సలా అని చదివి వీటిని పెడితే మీ ఇంట్లో లక్ష్మీకటాక్షం కలుగుతుంది.

Admin

Recent Posts