ఆధ్యాత్మికం

తులసి మొక్కను పూజించడంలో ఉన్న నియమాలు ఇవే.. కచ్చితంగా తెలుసుకోవాలి..!

సాధారణంగా హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావించి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూజలు చేస్తుంటారు. తులసి మొక్కను ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ తులసి మొక్కను ఎలా పడితే అలా పూజించకూడదు. తులసి మొక్కను పూజించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మరి తులసి మొక్కను ఏ విధంగా పూజించాలి అనే విషయానికి వస్తే..

తులసి మొక్క ఆకులను ఆదివారం, పౌర్ణమి, అమావాస్య, మంగళవారం వంటి దినాలలో తుంచకూడదు. అదేవిధంగా పండుగ రోజుల్లో కూడా తులసి మొక్క ఆకులను తుంచకూడదు. అలాగే పొరపాటున కూడా తులసి ఆకులతో పరమేశ్వరుడికి పూజ చేయకూడదు. ఎవరైతే పరమేశ్వరుడికి తులసి ఆకులతో పూజ చేస్తారో వారికి కష్టాలు తప్పవని చెబుతారు. శివుడికి అలాగే వినాయకుడికి తులసి మాలతో పూజ చేయరు.

rules in tulsi pooja

చాలామంది తులసి మొక్కను ఇంటి ఆవరణలో తులసికోటలో పెంచి పూజలు నిర్వహిస్తారు. తులసి మొక్కకు ప్రతిరోజు ఉదయం నీరుపోసి పూజచేయాలి. సాయంత్రం పొరపాటున కూడా తులసి మొక్కకు నీరు పోయకూడదు. తులసి మొక్క సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వరూపం కనుక నియమ నిష్టలతో తులసి మొక్కకు పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts