Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

గరుడ పురాణం ప్రకారం…చనిపోయిన తర్వాత మొదటగా ఆత్మ వెళ్ళేది అక్కడికే..! ఆత్మ రెండో గదిలోకి వెళుతుంది..!

Admin by Admin
February 4, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా యమున్ని చావుకి ప్రతిరూపంగా భావిస్తారు. అందువల్లే యమధర్మరాజుకు చాలా దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంతమంది దేవుళ్లకు ఆలయాలున్నాయి కానీ యమధర్మరాజుకి మాత్రం ఒకే ఒక ఆలయం అది కూడా హిమాలయాల్లో ఉంది. మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని వదిలి ఆత్మ పరలోకం చేరుతుందని కొందరి నమ్మకం. జీవించినప్పుడు చేసిన పాప పుణ్యాలను అనుసరించి సదరు జీవి పరలోకంలో శిక్షను అనుభవిస్తాడని చెబుతారు. ఏ భేదం లేకుండా యమధర్మరాజు ఈ శిక్షలను విధిస్తాడంటారు. ఇలా యమధర్మరాజు శిక్షలు విధించే చోటు భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ లోని బర్మోరలో ఉంది.. ఆ ఆలయ ప్రత్యేకతలు ఏంటి.. ఆ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకోండి..

యమాలయం ప్రత్యేకత ఏంటి?

హిమాచల్ ప్రదేశ్ లోని బర్మోర్ పట్టణంలో చౌరాసి దేవాలయాల సముదాయం ఉంది. ఇక్కడ మొత్తం 84 దేవాలయాలు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఇందులోని ఒక దేవాలయమే ధర్మేశ్వర్ మహాదేవ దేవాలయం. ఈ దేవాలయం చూడటానికి ఒక ఇల్లు వలే ఉంటుంది. ఈ ఇంట్లోనే యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఉంటూ పాప పుణ్యాల బేరీజు వేసి శిక్ష ఖరారు చేస్తారని స్థానికులు చెబుతారు. ఈ ఇల్లు లాంటి దేవాలయంలో రెండు ఖాళీ గదులు ఉంటాయి. మొదటి గదిలో చిత్రగుప్తుడు ఉంటాడ‌ని చెబతారు. ఆత్మను యమభటులు ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత సదరు జీవి చేసిన పాపపుణ్యాలను విడమరిచి చెబుతారు.

this is the one and only temple to lord yama in india

అటుపై ఆత్మ రెండో గదిలోకి వెళుతుంది. అక్కడ సదరు పాపపుణ్యాలను అనుసరించి అక్కడ శిక్ష ఖరారు అవుతుంది. శిక్ష ఖారారైన తర్వాత యమలోకానికి వెళ్లి అక్కడ సదరు ఆత్మ‌ శిక్ష అనుభవిస్తుంది. .ప్రతి జీవి ప్రాణం పోయిన తర్వాత ఆత్మ మొదట ఈ దేవాలయానికి తప్పక వస్తుందని ఇక్కడి నమ్మకం. ఈ విషయం గరుడ పురాణంతోపాటు మరికొన్ని పురాణాల్లో ప్రస్తావించారు. ఈ ఆలయంలో మరో నాలుగు కంటికి కనిపించని ద్వారాలు కూడా ఉన్నాయని చెబుతారు. అవి వరుసగా బంగారు, వెండి, కంచు, రాగితో తయారు చేయబడినవని చెబుతారు. పాపపుణ్యాలను అనుసరించి ఆత్మ వీటి ద్వారా బయటికి వస్తుందని స్థానికుల నమ్మకం.

యమాలయం ఎక్కడ ఉంది?ఎలా చేరుకోవాలి?

హిమాచల్ ప్రదేశ్ లోని చాంబా జిల్లాలో బర్మోర్ దేవాలయం ఉంది. ఈ పట్టణం ధర్మశాలకు 145 కిలోమీటర్ల దూరం, సిమ్లాకు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బర్మోర్ కు దగ్గరగా అంటే దాదాపు 199 కిలోమీటర్ల దూరంలో ధర్మశాల విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సదుపాయాలు ఉన్నాయి. ట్యాక్సీలు కూడా తిరుగుతున్నాయి. బర్మోర్ కు దగ్గరగా పఠాన్ కోట్ రైల్వే స్టేషన్ ఉంది. రెండు నగరాల మధ్య దూరం 190 కిలోమీటర్లు. రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బర్మోర్‌కు చేరుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ లోని పలు నగరాల నుంచి బర్మోరకు బస్సు సదుపాయాలు ఉన్నాయి. చాంబ నుంచి 60 కిలోమీటర్లు, ధర్మశాల నుంచి 145 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

చుట్టుప్రక్కల చూడదగిన ఇతర ప్రదేశాలు..

సముద్ర మట్టానికి 2195 మీటర్ల ఎత్తులో ఉన్న బర్మోర చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ధర్మశాల, సిమ్లా వంటి ప్రాంతాలకు వేసవి కాలంలో ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు.

Tags: barmore himachal pradesh temple
Previous Post

సావిత్రి చేసిన చిన్న పొరపాటు.. పెద్ద రహస్యం బయట పడింది, అదేంటో తెలుసా …?

Next Post

రోజూ డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నారా..? అయితే వీటిని తినండి..!

Related Posts

వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025
పోష‌ణ‌

మీ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే వీటిని తీసుకోండి..!

July 3, 2025
చిట్కాలు

ప‌సుపు రంగులోకి మారిన మీ దంతాలు మళ్లీ తెల్ల‌గా మారాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 3, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని తింటే షుగర్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.